Pawan Kalyan OG: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కానున్నది. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఓవర్సీస్ లో రికార్డుల మోత మోగిస్తోంది. టీజర్ విడుదల కాకముందే మిలియన్ల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయి.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓజీ’(OG). పవన్ కళ్యాణ్- సుజిత్ కాంబోలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గ్యాంగ్ స్టార్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ బ్యాక్ టు బ్యాక్ అందుతున్నాయి. చివరిగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆశించినంతగా ఫలితాన్ని అందించలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఇక ఇప్పుడు మెగా అండ్ పవరస్టార్ ఫ్యాన్స్ అందరూ OG సినిమా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా నాలుగు రోజుల్లో విడుదల కాబోతుండడంతో ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నారు. అప్పుడప్పుడు సినిమా చూసేద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఎంతలా అంటే.. విడుదలకు ముందే నయా రికార్డులను క్రియేట్ చేసుంది.
24
ఓవర్సీస్ ఓజీ రికార్డు
సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓజీ’ సినిమా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందించబడింది. కేవలం తెలుగు ప్రేక్షకుల్లోనే కాదు ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేకంగా నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోలు $ 2 మిలియన్ మార్క్ దాటి అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు చేశాయి. ఈ ఫీట్ ట్రైలర్ విడుదల కాకముందే సాధించబడింది. ఇలాంటి ఘనత సాధించి తొలి తెలుగు సినిమా నయా రికార్డు క్రియేట్ చేసింది ఓజీ. ఇది సినిమాకు అద్భుతమైన ఫ్యాన్స్ రిస్పాన్స్ ను సూచిస్తుంది. ట్రేడ్స్ వర్గాల అంచనాల ప్రకారం, ట్రైలర్ విడుదల తర్వాత ఈ సంఖ్య మరింత పెరుగే అవకాశముంది.
34
అమలాపురం నుంచి అమెరికా వరకూ
ఇంకా, తెలుగు సినిమాల్లో తొలిసారిగా ప్రముఖ టిక్కెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్ District యాప్ సీటు మ్యాప్‌లో ప్రతి సీటుపై OG ట్యాగ్ పెట్టింది. ఇది సినిమాకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడంలో సహాయపడింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం, “అమలాపురం నుంచి అమెరికా వరకూ OG మోత మోగిపోతోంది” అని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోనూ బుకింగ్స్ ప్రారంభమై, ఫస్ట్ డే ఫుల్ హౌస్ షోలు ఖాయం అయ్యాయని సమాచారం. చివరి రెండు వారాల ట్రేడ్స్ అంచనాల ప్రకారం, ‘ఓజీ’ మొదటి రోజే 100 కోట్ల మార్క్ దాటే అవకాశం ఉంది. గతంలో ‘హరిహర వీరమల్లూ’తో ఫ్యాన్స్ నిరాశ చెందగా, ఈసారి పవన్ కళ్యాణ్ ‘ఓజీ’తో ఆశలకు పరిమితి లేకుండా చేస్తాడని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓజీ’ (OG)ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు సెప్టెంబర్ 21న నిర్వహించనున్నారు. ‘ఓజీ కాన్సర్ట్’ పేరుతో నిర్వహించే ఈ వేడుక హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభం కానుంది. పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి ప్రీ రిలీజ్ వేడుకలు తక్కువగా జరిగాయి. టిక్కెట్ల కొరత కారణంగా అభిమానులు ఇబ్బంది పడినప్పటికీ, ఈసారి 30,000 మందికి సామర్థ్యం గల ఎల్బీ స్టేడియంను వేదికగా ఎంపిక చేశారు. ఇప్పటికే ఈవెంట్ పాస్‌ల పంపిణీ పూర్తయినట్లు తెలిపారు. 25,000 మందికి పైగా అభిమానులు ఈ వేడుకలో హాజరవుతారని అంచనా. ఈ కార్యక్రమాన్ని శ్రేయాస్ మీడియా నిర్వాహిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన ‘ఓజీ’ సాంగ్స్ అన్నీ బాక్ట్ బస్టర్‌గా సక్సెస్ కావడంతో మూవీపై భారీ అంచనాల పెరిగాయి. అలాగే, ఈ వేడుకలో ‘ఓజీ’ ట్రైలర్ ను కూడా విడుదల చేయనున్నారు. దీంతో ఈ షో మరింత స్పెషల్ గా మారింది. ఈవెంట్‌లో ‘ఓజీ’ దర్శకుడు సుజీత్, నిర్మాత డీవీవీ దానయ్య, సహ నిర్మాత కళ్యాణ్ దాస్, హీరో పవన్ కళ్యాణ్, హీరోయిన్ ఇతర ప్రధాన తారాగణం పాల్గొనే అవకాశముంది.