Lokah Records: మోహన్‌లాల్‌ రికార్డుని బద్దలుకొట్టిన లోకా.. ఎంత వసూలు చేసిందంటే?

Published : Sep 21, 2025, 11:28 AM IST

Lokah Records: మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కళ్యాణి ప్రియదర్శన్ నటించిన `లోకా చాప్టర్ 1: చంద్ర` రికార్డు సృష్టించింది. ఇది మోహన్‌లాల్‌ మూవీ రికార్డులు బ్రేక్‌ చేసింది.  

PREV
14
`లోకా` మూవీ సరికొత్త సంచలనం

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా 'లోకా చాప్టర్ 1: చంద్ర' రికార్డు సృష్టించింది. రూ.265 కోట్లు వసూలు చేసిన మోహన్‌లాల్ 'ఎంపురాన్' రికార్డును 'లోకా' బద్దలుకొట్టింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో ఇదే అతిపెద్ద విజయం. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు.

24
హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌లో సరికొత్త రికార్డు

ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మలయాళంలో తొలి మహిళా సూపర్ హీరో చిత్రంగా విడుదలైన 'లోకా', కల్లియంకాట్టు నీలి అనే పురాణ కథ ఆధారంగా తెరకెక్కింది. వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఏడో చిత్రం 'లోకా - చాప్టర్ 1: చంద్ర' బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. 7 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇది ఐదు భాగాల సూపర్ హీరో సిరీస్‌లో మొదటి సినిమా.

34
`లోకా`లో దుల్కర్‌, టోవినో థామస్‌ గెస్ట్ రోల్స్

కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో నస్లెన్ కూడా కీలక పాత్ర పోషించారు. కేరళ పురాణగాథ కల్లియంకాట్టు నీలి ఆధారంగా ఈ సినిమా రూపొందింది. శాండీ, చందు సలీమ్‌కుమార్, అరుణ్ కురియన్, శరత్ సభ, నిశాంత్ సాగర్, విజయరాఘవన్ ఇతర పాత్రలు పోషించారు.  దుల్కర్ సల్మాన్, టోవినో థామస్, సన్నీ వెయిన్ అతిథి పాత్రల్లో కనిపించారు. దీని తర్వాతి భాగం టోవినో థామస్ ప్రధాన పాత్రలో రానుంది.

44
`ఎంపురాన్‌` రికార్డులు బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్‌గా `లోకా`

గతేడాది వరకు మలయాళంలో `మంజుమ్మెల్ బాయ్స్` అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఉంది. అది `పులిమురుగన్`(మన్యంపులి) రికార్డును బద్దలుకొట్టింది. ఈ ఏడాది మోహన్‌లాల్ 'ఎంపురాన్' ఆ రికార్డును అధిగమించగా, ఇప్పుడు 'లోకా' ఆ రెండు చిత్రాలను దాటి నెం.1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ మూవీ తెలుగులో `కొత్తలోక`గా విడుదలయ్యింది. ఇక్కడ కూడా మంచి ఆదరణ పొందింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories