13 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల విడిపోతున్నట్లు ప్రకటించారు. దీంతో ఏపీ డిప్యూటీ సీఎం వ్యక్తిగత జీవితం మళ్లీ చర్చల్లోకి వచ్చింది. విడిపోవడానికి గల కారణాలను వారు చెప్పకపోయినా, ఈ జంట సంయుక్త ప్రకటనతో పెద్ద చర్చే జరుగుతోంది.
సక్సెస్ ఫుల్ సినీ కెరీర్, రాజకీయ బాధ్యతలతో పాటు పవన్ కల్యాణ్ కు భారీగా ఆస్తులు, సూపర్ కార్ల కలెక్షన్ కూడా ఉంది. లగ్జరీ ఎస్ యూవీల నుంచి ప్రీమియం కార్ల వరకు ఈ యాక్టర్-పాలిటీషియన్ దగ్గర ఎన్నో ఖరీదైన వాహనాలున్నాయి. ఆయన నెట్ వర్త్, ఆస్తులు, కార్ల కలెక్షన్ వివరాలు ఏంటంటే.
పవన్ కల్యాణ్ నికర ఆస్తుల విలువ దాదాపు రూ.120 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు ఉంటుందని అంచన. అయితే ఆయన ప్రస్తుత వ్యక్తిగత నెట్ వర్త్ ను ధ్రువీకరించే పబ్లిక్ ఫిగర్ ఏదీ లేదు.
ఏపీలోని పిఠాపురం నుంచి పోటీ చేసినప్పుడు ఆయన దాఖలు చేసిన 2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, పవన్ కల్యాణ్ తన కుటుంబ ఆస్తుల విలువ దాదాపు రూ.164.53 కోట్లుగా ప్రకటించారు. కాగా దాదాపు రూ.65.77 కోట్ల అప్పులున్నాయి.
ఆయన ప్రకటించిన ఆస్తుల్లో చరాస్తులు, స్థిరాస్తులు ఉన్నాయి. 2018-19 నుంచి 2022-23 వరకు ఐదు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.60.77 కోట్ల ఆదాయాన్ని ఈ యాక్టర్-పాలిటీషియన్ చూపించారు.
అఫిడవిట్ లెక్కల ప్రకారం, ఆయన ప్రకటించిన కుటుంబ ఆస్తుల నుంచి అప్పులు తీసేస్తే సుమారు రూ.98.77 కోట్లు ఉంటుంది. అయితే ఇది ఆయన ప్రస్తుత వ్యక్తిగత నెట్ వర్త్ మాత్రమే.. ఎందుకంటే ఆస్తుల ప్రకటనలో కుటుంబ ఆస్తులు కూడా కలిపి ఉన్నాయి.
తెలుగు సినిమాలు, ప్రొడక్షన్ యాక్టివిటీస్, పెట్టుబడులు, తన ప్రొఫెషనల్ పనుల పలు మార్గాల ద్వారా ఆయనకు ఆదాయం వస్తుంది. తెలుగు సినీ పరిశ్రమలో ఆయనకున్న క్రేజ్ తో సౌత్ ఇండియాలో అత్యంత ప్రజాదరణ ఉన్న స్టార్లలో ఒకరిగా నిలిచారు.