Naga Chaitanya: ఏకంగా 6 బెడ్ రూమ్ లతో చైతు, శోభిత లగ్జరీ విల్లా..కళ్ళు చెదిరే హంగులు, ఈ హౌస్ గురించి తెలుసా ?

Published : Nov 10, 2026, 04:23 PM IST

నాగ చైతన్య, శోభిత ధూళిపాళ కొత్త లగ్జరీ హౌస్ గురించి ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ హౌస్ లో ఏకంగా 6 బెడ్ రూమ్ లు, అనేక హంగులు ఉన్నట్లు తెలుస్తోంది.

PREV
15
2024లో వివాహం.. జూబ్లీహిల్స్‌లో నివాసం

నటుడు నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల 2024 డిసెంబర్ 4న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో సంప్రదాయ తెలుగు పద్ధతిలో వీరి పెళ్లి జరిగింది. పెళ్లికి ముందు కొంతకాలం ఇద్దరూ తమ ప్రేమ విషయాన్ని ప్రైవేట్‌గా ఉంచారు. ప్రస్తుతం ఈ జంట హైదరాబాద్‌లోని ప్రముఖ నివాస ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. జూబ్లీహిల్స్‌లో పలువురు సినీ ప్రముఖులు, ప్రముఖ కుటుంబాలు నివసిస్తున్నారు. ప్రశాంతమైన రహదారులు, నగర అందాలను వీక్షించే అవకాశం, కేబీఆర్ నేషనల్ పార్క్‌కు సమీపంలో ఉండటం ఈ ప్రాంత ప్రత్యేకతలు. లగ్జరీ షాపింగ్ కేంద్రాలు, ప్రధాన ఐటీ హబ్‌లకు దగ్గరగా ఉండటంతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు, పెరుగుతున్న ఆస్తుల విలువ కారణంగా ఖరీదైన ఇళ్లను కొనుగోలు చేసేవారికి ఇది ప్రధాన ఎంపికగా మారింది.

25
8500 చదరపు అడుగులకు పైగా విస్తీర్ణం.. ఆరు బెడ్‌రూమ్స్

నాగచైతన్య, శోభిత నివసిస్తున్న విల్లా 8500 చదరపు అడుగులకు పైగా విస్తరించి ఉంది. ఇందులో ఆరు బెడ్‌రూమ్స్, హోమ్ థియేటర్, లైబ్రరీతో పాటు అందంగా తీర్చిదిద్దిన బహిరంగ ప్రదేశాలు ఉన్నట్లు సమాచారం. ఈ ఇంటి విలువ సుమారు రూ.15 కోట్లుగా ఆస్తి అంచనాల్లో పేర్కొంటున్నారు. ఇదే ప్రాంతంలో ఉన్న అక్కినేని కుటుంబానికి చెందిన పెద్ద నివాస ప్రాంగణం విలువ రూ.45 కోట్ల వరకు ఉంటుందని అంచనా. మరోవైపు నాగచైతన్య, శోభిత ఇద్దరి మొత్తం ఆస్తుల విలువ రూ.164 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.

35
సంప్రదాయ తెలుగు నిర్మాణ శైలికి ఆధునిక హంగులు

ఈ విల్లా నిర్మాణంలో ఆధునిక విలాసవంతమైన సదుపాయాలతో పాటు సంప్రదాయ తెలుగు వాస్తుశిల్ప అంశాలను మేళవించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. ఇంట్లోకి ప్రవేశించగానే కనిపించే విశాలమైన డబుల్ హైట్ ప్రవేశ ద్వారం, పెద్ద విక్టోరియన్ శైలి తలుపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అందమైన వరండా, ఇంటి మధ్యలో ఏర్పాటు చేసిన అంతర్గత ప్రాంగణాలు, టెర్రస్ గార్డెన్లు నిర్మాణానికి ప్రత్యేక రూపాన్ని అందిస్తున్నాయి. ఇంటీరియర్ డిజైన్‌లో సహజ కాంతి, విశాలమైన ఖాళీ ప్రదేశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. లివింగ్ ఏరియాలో క్రీమ్ రంగు గోడలకు విరుద్ధంగా ఆకాశ నీలం రంగు సోఫాలు, ఇతర ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. బోకా డో లోబో వంటి అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్లకు చెందిన ఫర్నిచర్‌ను ఉపయోగించినట్లు సమాచారం. వంపులతో కూడిన ఐవరీ వైట్ మార్బుల్ మెట్ల నిర్మాణం ఇంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గోడలపై పెయింటింగ్స్, ఇతర కళాఖండాలను కూడా అలంకరించారు.

45
స్విమ్మింగ్ పూల్ నుంచి హోమ్ సినిమా వరకు ఆధునిక సదుపాయాలు

విల్లాలో ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్, ఆధునిక పరికరాలతో కూడిన జిమ్, హోమ్ సినిమా వంటి సదుపాయాలు ఉన్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. విశాలమైన బేస్‌మెంట్, మిడ్ సెంచరీ డిజైన్ అంశాలతో రూపొందించిన బార్ ఏరియా, పచ్చదనంతో కూడిన బహిరంగ ప్రదేశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇంటి నిర్మాణంలో పర్యావరణహిత అంశాలు, స్మార్ట్ హోమ్ టెక్నాలజీని ఉపయోగించినట్లు సమాచారం. ఈ విల్లాకు ప్లాటినం రేటింగ్ కలిగిన ఐజీబీసీ గ్రీన్ హోమ్ సర్టిఫికేషన్‌తో సంబంధం ఉన్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ వివరాలన్నీ మీడియా రిపోర్ట్స్ ఆధారంగా వెలుగులోకి వచ్చినవే.

55
నాగచైతన్య వృషకర్మ.. శోభిత వెట్టువం

ఇక సినిమాల విషయానికి వస్తే నాగచైతన్య ప్రస్తుతం దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కిస్తున్న అడ్వెంచర్ మిస్టికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ విడుదలకు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 4న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా నుంచి ఇటీవల తొలి పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, ‘లాపతా లేడీస్’ సినిమాతో గుర్తింపు పొందిన స్పర్శ్ శ్రీవాస్తవ్ ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. మరోవైపు శోభిత ధూళిపాళ్ల దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘వెట్టువం’లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా ఇద్దరూ తమ తదుపరి సినిమాలతో బిజీగా ఉన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories