,రష్యాలో అన్నా లెజ్నెవా జన్మించారు. మాజీ మోడల్, నటి అన్నా కొణిదెల తెలుగు ప్రేక్షకుల్లో పాపులర్ అయ్యారు. నివేదికల ప్రకారం, వారు 2011లో 'తీన్ మార్' సెట్స్ లో మొదటిసారి పవన్ ను కలుసుకున్నారు. ఈ సినిమాలో అన్నా కూడా నటించింది. ఆ తరువాత వీరి మధ్య ప్రేమ చిగురించింది.
పవన్ కళ్యాణ్ ను వివాహం చేసుకున్న తర్వాత ఆమె పబ్లిక్ లైఫ్ కు దూరంగా ఉన్నప్పటికీ, అప్పుడప్పుడు మాత్రమే పవన్ కళ్యాణ్ తో కలిసి బహిరంగంగా కనిపిస్తుంటుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ బయోలో "రష్యన్ హృదయం, భారతీయ ఆత్మ" అని ఉంటుంది. జూలై 2026 లో ఆమె తన సొంత పేరుకు బదులుగా అన్నా కొణిదెలగా పిలవాలని అభిమానులను కోరారు. వివాహం తర్వాత తన భర్త కళ్యాణ్ ఇంటిపేరును మార్చుకున్నట్లు ఆమె స్పష్టం చేసింది.