Pawan Kalyan: `భీమ్లా నాయక్‌` మాస్టర్‌ ప్లాన్‌ మైండ్‌ బ్లాంక్‌.. ఈ సంక్రాంతికి దేత్తడే.. అసలు గేమ్‌ స్టార్ట్

First Published | Nov 17, 2021, 12:53 AM IST

పవన్‌ కళ్యాణ్‌ అదిరిపోయే మాస్టర్‌ ప్లాన్ వేశాడు. `భీమ్లా నాయక్‌` కోసం మైండ్‌ బ్లాంక్ అయ్యే స్కెచ్‌ వేశాడు. ఎవరిని నొప్పించకగా తానొవ్వక అన్నట్టుగా ముందుకు సాగుతున్నాడు. ఈ వచ్చే సంక్రాంతికి పునకాలకు సిద్ధం కండి అనే సంకేతాలనిస్తున్నాడు. 

పవన్‌ కళ్యాణ్‌- రానా ప్రస్తుతం `భీమ్లా నాయక్‌`(Bheemla Nayak) చిత్రంలో నటిస్తున్నారు. మలయాళం రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో భీమ్లా నాయక్‌గా పవన్‌(Pawan Kalyan), డేనియర్‌ శేఖర్‌గా రానా(Rana) నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య క్లాషెస్సే ఈ సినిమా. ఇటీవల విడుదలైన పాత్రలు ఫస్ట్ లుక్‌ గ్లింప్స్‌ లు మలయాళ `అయ్యప్పనుమ్‌ కోషియమ్‌`కంటే ఎక్కువ హైప్‌ వచ్చింది. ఊహించని విధంగా పాటలు సైతం సంచనాత్మకంగా మారాయి. అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. విడుదలైన మూడు పాటలు శ్రోతలను ఉర్రూతలూగిస్తున్నాయి. 
 

ఇక సాగర్‌ కె చంద్ర దర్శకత్వంలో, త్రివిక్రమ్‌ మాటలు, స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో Pawan సరసన నిత్యా మీనన్‌, రానా సరసన సంయుక్త మీనన్‌ హీరోయిన్లు నటిస్తున్నారు. ఇక సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకి ఐదు రోజుల ముందు `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR Movie), రెండు రోజులు తర్వాత ప్రభాస్ `రాధేశ్యామ్‌`(Radheshyam) చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు పాన్‌ ఇండియా లెవల్‌లో విడుదలవుతున్నాయి. పవన్‌ `భీమ్లా  నాయక్‌` రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్‌ అవుతుంది. 


అయితే `ఆర్‌ఆర్‌ఆర్‌` కోసం ఈ సినిమా వాయిదా పడుతుందని, టికెట్ల రేట్ల విషయంలో `భీమ్లా నాయక్‌` తమకి అడ్డంకిగా మారుతుందని ఆయా చిత్ర నిర్మాత భావిస్తున్న నేపథ్యం, మరోవైపు పవన్‌ కళ్యాణ్‌పై ఏపీ ప్రభుత్వానికి ఉన్న కోపం కారణంగా ఈ చిత్రాన్ని వాయిదా వేయించాలని, సమ్మర్‌కి పంపించాలని ప్లాన్‌ చేసినట్టు తెలిసింది. ఈ వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. పవన్‌ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటుందనే వార్తలు వచ్చాయి. దీంతో పవన్‌ అభిమానులు నిరాశ చెందారు. సంక్రాంతి బరిలోనే ఉండాలని రిక్వెస్ట్ చేస్తూ అనేక సందేశాలను చిత్ర బృందానికి పంపించారు. సోషల్‌ మీడియాలోనూ ట్రెండ్‌ చేశారు. 

దీంతో ఎట్టకేలకు తలొగ్గిన చిత్ర బృందం సినిమాని సంక్రాంతికే రిలీజ్‌ చేయబోతున్నట్టు మంగళవారం మరోసారి ప్రకటించారు. రిలీజ్‌ డేట్‌లో ఏమాత్రం మార్పు లేదని తెలిపారు. దీంతో వచ్చే సంక్రాంతి `ఆర్‌ఆర్‌ఆర్‌`, `భీమ్లా నాయక్‌`, `రాధేశ్యామ్‌` ల మధ్య త్రిముఖ పోటీ తప్పదంటున్నారు క్రిటిక్స్. అయితే ఇక్కడే మరో తిరకాసు కూడా ఉంది. `భీమ్లా నాయక్‌` వాయిదా వేసుకోకపోవడానికి మరో కారణం ఉందట. ఇప్పుడా కారణం మతిపోగోట్టేలా ఉండటం విశేషం. `భీమ్లా నాయక్‌` సంక్రాంతి బరి నుంచి తగ్గకపోవడానికి పవన్‌ టీమ్‌ ఓ మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేసిందట. 
 

ఏపీలో జగన్మోహన్‌ ప్రభుత్వానికి, పవన్‌ కళ్యాణ్‌కి పడటం లేదు. రాజకీయంగా పవన్‌ చేసే విమర్శల కారణంగా  ఆయన నటించే సినిమాలను ఆడ్డుకోవాలని వైసీపీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారట. ఇప్పటికే `వకీల్‌సాబ్‌` విషయంలో అదే జరిగింది. టికెట్ల రేట్లు తగ్గించడం చూశాం. ఇది సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడింది.  దీంతో ఇప్పుడు టికెట్‌ రేట్స్ పెంచుకునేలా అనుమతించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరబోతున్నట్టు `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌ చెప్పింది.

అయితే `భీమ్లా నాయక్‌` సంక్రాంతి నుంచి తప్పుకోకపోవడానికి కారణం కూడా ఇదే అని తెలుస్తుంది. `ఆర్‌ఆర్‌ఆర్‌`,`రాధేశ్యామ్‌` రిక్వెస్ట్ మేరకు సమ్మర్‌కి వెళితే పవన్‌ చిత్రం ఒంటరిగా రావాల్సి వస్తుంది. ఆ సమయంలో జగన్‌ ఈ ఒక్క సినిమాని నలిపేసే అవకాశం ఉందట. టికెట్లరేట్ల తగ్గింపు, షోల తగ్గింపు, థియేటర్లు ఓపెన్‌ కాకుండా చేసే అవకాశం ఉంటుంది. ఇలా అన్ని రకాలుగా ఆ సినిమాని ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని యూనిట్‌ భావించిందట. దీంతో సంక్రాంతినే బెస్ట్ టైమ్‌ అని నిర్ణయించారట. పెద్ద సినిమాలు వస్తున్న నేపథ్యంలో తమని టచ్‌ చేస్తే ఇతరసినిమాకు ఎఫెక్ట్ అవుతుంది. అందుకు వాళ్లు ఒప్పుకోరు.

`ఆర్‌ఆర్‌ఆర్‌`, `రాధేశ్యామ్‌`లతోపాటు `భీమ్లా నాయక్‌` విడుదలైతే ఆయా చిత్రాల కోసం టికెట్ల రేటు పెంచితే అది తమ సినిమాకి కూడా కలిసొస్తుంది పవన్‌ టీమ్‌ భావిస్తుందట. కలెక్షన్ల విషయంలో హెల్ప్ అవుతుందని, అంతేకాదు సంక్రాంతి టైమ్‌లో అయితే  ఏపీ ప్రభుత్వం ఏం చేయలేదని అనుకుంటున్నారట. సంక్రాంతి సీజన్‌ కావడంతో ఆడియెన్స్ కూడా సినిమాని చూసేందుకు ఎగబడతారు. దీంతో కావాల్సిన కలెక్షన్లు ఈజీగానే వస్తాయి. దీనికి తోడు సినిమా బాగుందనే టాక్‌ వస్తే బాక్సాఫీసు వద్ద పవన్‌ దుమ్ము రేపడం ఖాయం. `ఆర్‌ఆర్‌ఆర్‌`, `రాధేశ్యామ్‌`లను మించిన కలెక్షన్లని తెలుగు రాష్ట్రాల్లో `భీమ్లా నాయక్‌` కలెక్ట్ చేసినా ఆశ్చర్యం లేదు. 
 

ఇప్పుడు పవన్‌గానీ, `భీమ్లా నాయక్‌` టీమ్‌ గానీ ఇదే మాస్టర్‌ ప్లాన్‌తో ఉన్నారట. అందుకే సంక్రాంతికే ఈ సినిమాని తీసుకొచ్చేందుకు నిర్ణయించారట. ఫ్యాన్స్ రిక్వెస్ట్ మేరకు అని పైకి చెప్పినా, అసలు ప్లాన్‌ ఇదే అని సోషల్‌ మీడియాలో, ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్న వార్త. మొత్తానికి ఈ సంక్రాంతికి ఇతర రెండు సినిమాలకు చుక్కలు చూపించి, దేత్తడి చేసేందుకు `భీమ్లా నాయక్‌` రెడీ అవుతున్నాడట. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. 

also read: ఫ్యాన్స్ డిమాండ్ కి తలొగ్గిన పవన్... సంక్రాంతికే భీమ్లా నాయక్
 

Latest Videos

click me!