మరోసారి సిరి షణ్ముఖ్‌ని కూల్ చేద్దామని, ఓదార్చే ప్రయత్నం చేసింది. దీంతో అతను ఈ సమయంలో దీప్తి సునైనా(షణ్ముఖ్ లవర్) ఉంటే బాగుండేదని అంటాడు. ఆమె తనని బాగా అర్థం చేసుకునేదని వెల్లడించారు. దీనికి కరిగిపోయిన సిరి షన్నుని మళ్లీ ఓదార్చేందుకు ప్రయత్నించగా ఇక్కడి నుంచి వెళ్లిపో, తనని ఒంటరిగా వదిలేయ్.. నువ్వు సొంతంగా గేమ్ ఆడాలని వచ్చావుగా.. ఆడు, నాతో సంబంధం లేదు, నీ గేమ్ నువ్వు ఆడుకో, నా గేమ్ నేను ఆడుకుంటా అంటూ కామెంట్ చేశాడు షన్ను. అయితే షన్నుపై కూడా కామెంట్ చేసింది. ఎప్పుడు ఎలా ఉంటాడో అర్థం కాదు, అప్పుడే బాగుంటాడు, అప్పుడే ఇలా ప్రవర్తిస్తాడు అంటూ తెలిపింది.