`హరి హర వీరమల్లు` మూవీ కథ మొత్తం చెప్పేసిన పవన్‌.. క్లైమాక్స్ కూడా లీక్‌.. హైలైట్ అదే

Published : Jul 22, 2025, 06:10 AM IST

పవన్‌ కళ్యాణ్‌ తాను నటించిన `హరి హర వీరమల్లు` మూవీ కథ మొత్తం రివీల్‌ చేశారు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్లో ఆయన క్లైమాక్స్ పార్ట్ కూడా బయటపెట్టారు. 

PREV
15
`హరి హర వీరమల్లు` కథ బయటపెట్టిన పవన్‌ కళ్యాణ్‌

పవన్‌ కళ్యాణ్‌ నటించిన `హరి హర వీరమల్లు` మూవీ మరో మూడు రోజుల్లో(జులై 24న) విడుదల కాబోతుంది.ఈ చిత్రానికి జ్యోతికృష్ణ దర్శకత్వం వహించగా, ఏఎం రత్నం నిర్మించారు. 

నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా, బాబీ డియోల్‌ విలన్‌గా నటించారు. ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగింది. ఇందులో పవన్‌ మాట్లాడుతూ, సినిమా కథ మొత్తం లీక్‌ చేశారు. క్లైమాక్స్ తో సహా చెప్పి షాకిచ్చారు.

25
ఔరంగజేబ్‌ అరాచకాలు పుస్తకాల్లో చెప్పలేదు

ఇందులో పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ, ``హరి హర వీరమల్లు` నాకు ఇష్టమైన సబ్జెక్ట్. మనందరం చరిత్ర గురించి చదువుకుంటాం. భారతదేశం ఎవరి మీద దాడి చేయలేదు. ఏ దేశాన్ని ఆక్రమించుకోలేదు. కానీ ఈ దేశాన్ని అందరు ఆక్రమించుకున్నారు. 

మనం చదువుకున్న టెక్ట్స్ బుక్‌లో ఎంత సేపు మొఘల్‌ సామ్రాజ్య గొప్పతనం చెప్పారు తప్పా, వాళ్ల తాలూకు అరాచకం గురించి చెప్పలేదు. అక్బర్‌ గ్రేట్‌, షాజహాన్‌ గొప్ప, ఔరంగజేబ్‌ గొప్ప అన్నారు, కానీ వాళ్లు మన కోసం ఏం చేశారనేది చెప్పలేదు. 

అదే సమయంలో మన రాజులైన విజయనగరం రాజుల గురించి మాట్లాడలేదు. మన దేశంలో చాలా మంది రాజులున్నారు, వారి గురించి మాట్లాడలేదు. మనం ఎక్కువగా మొఘల్‌ గొప్ప తనం గురించే విన్నాం. 

మనదేశం కోసం ఔరంగజేబ్‌ ఏం చేశాడనేది ఎక్కడా చెప్పలేదు. ఆయన సొంత తమ్ముడినే చంపేశాడు. షాజహాన్‌ని జైల్లో పెట్టి, నువ్వు హిందువుగా బతకకూడదు. 

అలా బతికితే టాక్స్ కట్టాలనే రూల్‌ తెచ్చాడు. ఇలాంటి అరాచకాలు సృష్టిస్తున్న సమయంలో ఒక ఛత్రపతి శివాజీ లాంటి మహారాజ్‌ పుట్టుకొచ్చారు. గుండెల్లో శౌర్యాన్ని నింపాడు.

35
కొహినూర్‌ వజ్రం చుట్టూ `హరి హర వీరమల్లు` కథ

ఇలాంటి నేపథ్యం తీసుకుని `హరి హర వీరమల్లు` మూవీ కథ తయారైంది. కొహినూర్‌ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటుంటారు. కానీ ఆ కొహినూర్‌ మన విజయవాడ వద్ద కొల్లూరులో వజ్రాల గనులుంటే, అందులో దొరికింది‌. 

ఆ వజ్రం అక్కడి వారి నుంచి నిజాం నవాబ్‌ వద్దకు వచ్చింది. వారి నుంచి మొఘల్‌ రాజులకు చేరింది. వారి నుంచి బ్రిటీష్‌ చేతిలో పడింది. ఇప్పుడు లండన్‌లో మ్యూజియంలో ఉంది. వారికి ఎలా చేరిందనేదే ఈ మూవీ` అని చెప్పారు పవన్‌.

45
క్లైమాక్స్ యాక్షన్‌ కొరియోగ్రఫీ చేశా

ఆయన ఇంకా చెబుతూ, `ఈ కథని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు క్రిష్‌ ఈ స్టోరీ చెప్పినప్పుడు నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అందుకే ఈ మూవీ చేశాను. ఈ సినిమా ఎన్ని రికార్డులు చేస్తుందనేది చెప్పలేను. ఎంత కలెక్ట్ చేస్తుందనేది చెప్పలేను.

 కానీ సినిమా కోసం మా బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాం. మీ కోసం డాన్సులు కూడా చేశాను. రాజకీయాల్లోకి వెళ్లి రియల్‌ లైఫ్‌ గుండాలను, రౌడీలను ఎదుర్కొన్నాను గానీ, సినిమాల్లో ఫైట్స్ చేయడానికి నేను చిన్నప్పుడు 20లో నేర్చుకున్న మార్షల్‌ ఆర్ట్స్ పై పట్టు సాధించాల్సి వచ్చింది. 

మళ్లీ ప్రాక్టీస్‌ చేయాల్సి వచ్చింది. నేను నేర్చుకున్న అన్ని మార్షల్‌ ఆర్ట్స్ ని క్రోడీకరించి ఈ మూవీ క్లైమాక్స్ లో 18 నిమిషాల యాక్షన్‌ ఎపిసోడ్‌ని డిజైన్‌ చేశాను` అని చెప్పారు పవన్‌. తానే స్వయంగా ఆ యాక్షన్‌ కొరియోగ్రఫీ చేసినట్టు వెల్లడించారు.

55
`హరి హర వీర మల్లు` క్లైమాక్స్ రివీల్‌ చేసిన పవన్‌

ఇక ఫైనల్‌గా పవన్‌ మాట్లాడుతూ, `నీ ధర్మానికి నువ్వు టాక్స్ కట్టాలి అంటే, వీరమల్లు ఎదురుతిరిగే పరిస్థితుల్లో క్లైమాక్స్ వస్తుంది. ఆ టైమ్‌లో సగటు భారతీయుడు నలిగిన అంశాన్ని చూపించాం.

 ఇది సస్పెన్స్ మూవీ కాదు, కానీ సినిమాకి వెళ్లినప్పుడు మీరు ఏం చూడబోతున్నారనేది చెప్పే ప్రయత్నం. మీకు సినిమా నచ్చిందా రికార్డులు బద్దలు కొట్టేయండి` అని అన్నారు పవన్‌ కళ్యాణ్‌. 

ఈ క్రమంలో ఆయన సినిమా కథేంటో రివీల్‌ చేశారు. క్లైమాక్స్ పార్ట్ తో సహా మొత్తం రివీల్‌ చేయడం గమనార్హం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories