చిరంజీవి వద్దన్న వినకుండా పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఏదో తెలుసా? రిజల్ట్ ఏంటి?

Published : Aug 26, 2025, 07:01 PM IST

మెగాస్టార్ చిరంజీవి వద్దు అన్నా కూడా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఏదో తెలసా? నటించడమే కాకుండా డైరెక్షన్ కూడా చేసి దెబ్బతిన్న సినిమా గురించి మీకు తెలుసా? 

PREV
16

ఫిల్మ్ ఇండస్ట్రీలో రిస్క్ ఎక్కువ

ఫిల్మ్ ఇండస్ట్రీలో టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక్కోసారి లైఫ్ లో రిస్క్ చేయాల్సి వస్తుంది. ఆ రిస్క్ వల్ల కలిసోస్తే కెరీర్ ముందుకు వెళ్తుంది. లేదంటే భారీగా నష్టాన్ని చూడాల్సి వస్తుంది. అయితే ఇటువంటి నష్టాన్ని ముందు గుర్తించి కొంత మంది సలహాలు కూడా ఇస్తుంటారు. అనుభవంతో చెపుతుంటారు. అయినా వినకుండా నచ్చిన పనిచేయడం వల్ల ఫలితం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇబ్బందిపడ్డారట. మెగాస్టార్ చెప్పినా వినకుండా ఓసినిమా చేసి భారీ డిజాస్టర్ ను ఫేస్ చేశారట. ఇతకీ ఆసినిమా ఏంటో తెలుసా?

DID YOU KNOW ?
పవన్ కెరీర్ లో ఏకైక సినిమా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తూ, డైరెక్షన్ కూడా చేసిన ఏకైక సినిమా జానీ
26

చిరంజీవి వారసుడిగా ఎంట్రీ

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి 50 ఏళ్లుగా తన నటనతో, మంచితనంతో, సమాజ సేవతో ప్రేక్షకుల్లో అపారమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఆతరువాత తన వారసుడిగా పవన్ కళ్యాణ్ ను కూడా రంగంలోకి దింపి స్టార్ హీరోను చేశారు. అటు పవన్ కళ్యాణ్ కూడా అన్న ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నిపవర్ స్టార్ గా ఎదిగాడు. తనకంటై సొంత ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. కెరీర్ స్టార్టింగ్ లోనే వరుసగా హిట్ సినిమాలు చేసిన పవన్.. తిరుగులేని స్టార్ డమ్ ను సాధించారు.

36

డైరెక్షన్ చేసి నష్టపోయిన పవన్

అయితే, పవన్ కళ్యాణ్ హీరోగా అందరికి తెలుసు. కానీ ఆయన దర్శకుడిగా కూడా మారారని చాలా తక్కువమందికే తెలుసు. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేసిన తొలి, చివర ఏకైక సినిమా ఏదో కాదు ‘జానీ’ (Johnny). ఈ సినిమాను ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ చేశారు. కాని జానీ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. పవన్ కళ్యాన్ చాలా ఇష్టంగా చేసిన సినిమాఇది. ఎంతో ఇష్టపడి పవన్ కల్యాన్ డైరెక్షన్ కూడా చేసుకున్నారు. ఇక ఈ సినిమాకు సంబధించిన కబుర్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

46

చిరంజీవి చెపితే వినలేదు

ఈ సినిమా గురించి స్పందించిన పవన్ కళ్యాణ్, అప్పట్లో చిరంజీవి ఈ కథపై కొన్ని సూచనలు ఇచ్చారని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ తెలిపిన ప్రకారం, జానీ కథను మొదటగా చిరంజీవికి వినిపించగా, ఆయన “కథ బాగుంది కానీ ప్రస్తుత జనరేషన్‌కు కనెక్ట్ అవ్వకపోవచ్చు” అని అన్నారు. అయినప్పటికీ, పవన్ ఈ సినిమాను "సక్సెస్ చేస్తానన్న నమ్మకంతో" తీసినట్టు చెప్పారు. కానీ చిత్రం విడుదలైన తర్వాత, అది ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది.

56

జానీ ప్లాప్ కు కారణాలు

జానీ సినిమా స్లో నేరేషన్, పవన్ పాత్రలో ఉత్సాహం తక్కువగా ఉండడం వంటి అంశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయినట్లు అప్పట్లో ట్రేడ్ వర్గాలు భావించాయి. ఈ సినిమా తర్వాత పవన్ కెరీర్‌లో దాదాపు దశాబ్దం పాటు ప్లాప్‌ల పరంపర కొనసాగింది. ఈ క్రమంలో పవన్ తాజాగా మాట్లాడుతూ, “ఆ సమయంలో చిరంజీవి అన్న చెప్పినట్టు కొన్ని మార్పులు చేసి ఉంటే బాగుండేదేమో. ఇప్పుడు ఆ సినిమా విషయాన్ని తలుచుకుంటే కొంత బాధ అనిపిస్తుంది అని పేర్కొన్నారు.జానీ సినిమా పవన్ కళ్యాణ్ దర్శకత్వ ప్రతిభను చూపించినప్పటికీ, కమర్షియల్ గా అతడికి ఎదురుదెబ్బే తగిలింది. అయినప్పటికీ, ఈ ప్రయత్నం ద్వారా ఆయన ఒక నటుడిగా, దర్శకుడిగా తీసుకున్న రిస్క్‌ను ప్రేక్షకులు గుర్తించారు.

66

బిజీ బిజీగా పవన్ 

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా పరిపాలన పనుల్లో పవన్ బిజీగా ఉంటున్నారు. అయితే ఈక్రమంలోనే గతంలో కమిట్ అయిన సినిమాలను కూడా కంప్లీట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఆయన తాజాగా నటించి ఓజీ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. సెప్టెంబర్ 25న ఈసినిమా రిలీజ్ కాబోతోంది. ఇక త్వరలో ఆయన సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించి, తన వారసుడిని రంగంలోకి దింపుతారని టాక్ నడుస్తోంది. మరి ఇందులో నిజం ఎంతో తెలియాల్సి ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories