ఈ స్టార్ డాన్స్ మాస్టర్ ఓ ఆటో డ్రైవర్ కొడుకని మీకు తెలుసా? ఇప్పటికీ అదే పని ఎందుకు చేస్తున్నాడంటే?

Published : Aug 26, 2025, 05:40 PM IST

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కింద స్థాయి నుంచి ఎంతో మంది స్టార్లుగా ఎదిగారు. ఎంత ఎదిగినా వారు ఒదిగి ఉంటారు. అలాంటి వారిలో ఓబుల్లితెరపై స్టార్ కొరియోగ్రాఫర్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం స్టార్ డమ్ చూస్తున్న ఆయన సాధారణ ఆటోడ్రైవర్ కొడుకునని గర్వంగా చెపుతున్నాడు

PREV
15

బుల్లితెరపై స్టార్ కొరియోగ్రఫర్

ఇంతకీ ఆ టెలివిజన్ స్టార్ ఎవరో కాదు పండు మాస్టర్. అవును టెలివిజన్ రియాలిటీ షో ఢీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన డ్యాన్సర్ పండు మాస్టర్, ఇప్పుడు ఆర్టిస్ట్‌గా, డ్యాన్స్ మాస్టర్‌గా, డ్యాన్సర్‌గా బిజీగా ఉన్నాడు. ఇటీవల ఓ ప్రముఖ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పండు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ముఖ్యంగా తన తండ్రిపై ఉన్న గౌరవం, దేవుడిపై పెట్టుకున్న విశ్వాసం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించాయి.

25

స్టార్ అయినా ఆటో డ్రైవర్ కొడుకుగానే

పండు మాట్లాడుతూ – "మా నాన్న ఆటో డ్రైవర్. ఇప్పటికీ అదే పాత ఆటో నడుపుతారు. దానిని కొని 20 ఏళ్ళు అయింది. నేను చెప్పినా కొత్తదిగా మార్చుకోరు. ఇది ఆయన డబ్బులతో కొన్న ఆటో అని సెంటిమెంట్. నెల నెలా రిపేర్ ఖర్చులు ఎక్కువైనా దాన్ని వదలరు. నేను కొత్త ఆటో కొనిస్తా అంటే కూడా వద్దంటారు. మా నాన్న ఆటోలు నడిపేవాళ్లందరికీ తెలుసు నేను ఆయన కొడుకుని అని. అయినా ఆయన పట్టించుకోరు,” అని చెప్పాడు.

35

యాంకర్ ప్రదీప్ చేసిన పెద్ద సాయం

అలానే, తన తండ్రికి హార్ట్ స్ట్రోక్ వచ్చిన సమయంలో యాంకర్ ప్రదీప్ తనకు సహాయం చేశాడని గుర్తు చేశాడు. “ప్రదీప్ అన్న నా తండ్రికి ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు చాలా హెల్ప్ చేశాడు. కానీ ఆయన ఎక్కడా ఈ విషయాన్ని చెప్పనివ్వరు, ప్రదీప్ అన్న చేసిన సాయాన్నినేను ఎప్పటికీ మర్చిపోలేను '' అని అన్నారు పండు. ప్రదీప్ కు తన తండ్రి అంటే చాలా ఇష్టం. కాని ఆయన కొంత కాలం క్రితం అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే.

45

శివయ్య దిగి వచ్చిన వేళ

పండు మాట్లాడుతూ.. తను శివ మాల వేసుకున్న అనుభవాన్ని వివరించాడు. “రెండేళ్ల క్రితం మాల వేసుకున్నా. ఇరుముడి కోసం శ్రీశైలం వెళ్తుంటే ఒక పెద్దాయన లిఫ్ట్ అడిగారు. కార్ ఆపి తీసుకెళ్లా. ఆయన ‘నిన్ను శివయ్య పంపించాడు’ అని చెప్పారు. తరువాత అక్కడ ఇరుముళ్ళు గురించి నాకు తెలియక తికమకలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి వచ్చి నన్ను పూజకు తీసుకెళ్లి ఇరుముళ్ళు కట్టించి వెళ్లిపోయారు. ఎవరో తెలియలేదు, తిరిగి కనిపించలేదు. ఆ శివుడే కావచ్చునాకు ఇరుముడి కట్టించింది అనిపించింది,” అని పండు చెప్పుకొచ్చాడు.

55

దారి చూపించిన స్వామి

తన కెరీర్‌లో వచ్చిన ఒడిదుడుకుల గురించి పండు మాస్టర్ మాట్లాడుతూ – “ఇటీవలి వరకు నా ఫేమ్ కొంచెం తగ్గిందని అనిపించేది. కరెక్ట్‌గా ఏదీ వర్కవుట్ కాలేదు. ఆ టైంలో అరుణాచలం వెళ్లి వచ్చాను. తర్వాతే 'ఇటుక మీద ఇటుక' సాంగ్ వచ్చి పెద్ద హిట్ అయింది. ఆ తరువాత వరుసగా రెండు సాంగ్స్ హిట్ అయ్యాయి. అరుణాచలేశ్వరుడే నాకు దారి చూపించాడు అనిపించింది. దేవుడు నాతో ఉన్నాడు అనే భావన కలిగింది,” అన్నారు. ఇలా పండు మాస్టర్ తన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు వెల్లడించారు. తన కుటుంబం, భక్తి, కెరీర్, బుల్లితెరపై తన లైఫ్ ఎలా ఉందో వివరించాడు.

Read more Photos on
click me!

Recommended Stories