విజృంభిస్తున్న వీరమల్లు, పవన్ కళ్యాణ్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

Published : Jul 25, 2025, 11:06 AM IST

ప్రపంచ వ్యాప్తంగా జులై 24న రిలీజ్ అయ్యింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమా. ఈమూవీకి ఫస్ట్ డే ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూలు చేసింది? 

PREV
16

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం హరి హర వీరమల్లు జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఈసినిమా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత వచ్చిన మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. కామన్ ఆడియన్స్ తో పాటు రాజకీయ, సినీ వర్గాల్లో ఈ సినిమాపై విపరీతమైన ఆసక్తి నెలకొంది.

26

దాదాపు ఐదేళ్లకు పైగా ఈసినిమా షూటింగ్ జరిగింది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ అవ్వడంవల్ల హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కు బ్రేక్ లు ఎక్కువగా పడ్డాయి. ఇక షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ సినిమా తాలూకు ఫస్ట్ లుక్, ట్రైలర్ నుండి విడుదల వరకు వచ్చిన ప్రతి అప్డేట్ భారీ హైప్‌ను సృష్టించాయి. ఐదేళ్ల అభిమానులను ఊరించిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా చివరకు తెరపైకి వచ్చి అభిమానులను అలరించడంతో పాటు విజయం దిశగా పరుగులెడుతోంది.

36

విడుదలకు ముందే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు ఏర్పాటవగా, ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు, మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలు హౌస్‌ఫుల్‌గా నడిచాయి. ఫ్యాన్స్ సాయంత్రం నుండి ట్విట్టర్, సోషల్ మీడియా వేదికలపై హరిహర వీరమల్లు సినిమాను, అందులో పవన్ కళ్యాణ్ నటనను పొగడ్తలతో ముంచెత్తారు. మరీ ముఖ్యంగా పవర్ స్టార్ యాక్షన్ సీన్స్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

46

ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన సినిమాల జాబితాలో స్థానం సంపాదించింది. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయి ఫస్ట్ డేనే ఓవర్ ఆల్ ఇండియాలో 31.50 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ నివేదికలు తెలిపాయి. ఇక ప్రీమియర్ షోల ద్వారా దాదాపు 12.7 కోట్లు కలెక్షన్ రాగా, మొత్తం కలిపి మొత్తం కలెక్షన్ 43.8 కోట్లు నమోదు చేసినట్టు తెలుస్తోంది.

56

ఇక హరిహరవీరమలల్లు ఒరిజినల్ తెలుగు వెర్షన్ విషయానికి వస్తే... ఫస్ట్ డే సగటున 57.39% థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు కావడం గమనార్హం. మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. బ్రో సినిమా తరువాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా కావడంతో.. పవర్ స్టార్ తన మాస్ స్వాగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అభిమానుల కోసం పలు ప్రాంతాల్లో ప్రత్యేక షోలు ఏర్పాటు చేయడం, పెద్ద తెరపై పవన్ మళ్లీ కనిపించడమే సినిమాకు అదనపు బజ్‌ను తీసుకొచ్చాయి.

66

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమాతో అదరగొడుతున్నారు. దాంతో ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. నెక్ట్స్ ఓజీ సినిమా కోసం వెయిటింగ్ లో ఉన్నారు పవర్ ఫ్యాన్స్. ఈమూవీ షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ అయ్యింది. సుజిత్ డైరెక్ట్ చేసిన ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఈ సినిమా తరువాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో మరో సినిమా అప్ డేట్ ఇవ్వాల్సి ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories