తనకి గట్టి పోటీ ఇచ్చిన హీరో నటనకి ఏడ్చేసిన బాలయ్య, ఆల్ టైం ఫేవరేట్ మూవీ అదే..చిరు, నాగార్జున కాదు

Published : Jul 25, 2025, 10:33 AM IST

బాలకృష్ణ తనకి పోటీ ఇచ్చిన ఓ అగ్ర హీరోపై ప్రశంసలు కురిపించారు. అతడి నటన ఒక టెక్స్ట్ బుక్ అని అభివర్ణించారు. ఇంతకీ ఆ హీరో ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. 

PREV
15
వరుస విజయాలతో బాలయ్య 

నందమూరి బాలకృష్ణ నవరసాలు పలికించగలిగే అద్భుతమైన నటుల్లో ఒకరు. బాలయ్య ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న నాల్గవ చిత్రం అఖండ 2. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు బాలయ్య అన్ స్టాపబుల్ షోతో హోస్ట్ గా రాణిస్తున్నారు. ఈ షో కూడా సూపర్ సక్సెస్ అయింది. 

25
ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ 

అన్ స్టాపబుల్ షోలో బాలయ్య తనకి గట్టి పోటీ ఇచ్చిన ఓ హీరో గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గతంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ సినిమాల మధ్య విపరీతమైన పోటీ ఉండేది. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ ఫాలో అయ్యేవారు. చిరంజీవి, బాలయ్య మాస్ చిత్రాలతో.. నాగార్జున రొమాంటిక్, ఫ్యామిలీ చిత్రాలతో.. వెంకటేష్ కామెడీ అండ్ ఎమోషనల్ చిత్రాలతో అలరించేవారు. 

35
వెంకటేష్ నటనకి బాలయ్య ఫిదా 

అన్ స్టాపబుల్ షోకి గతంలో విక్టరీ వెంకటేష్ అతిథిగా హాజరయ్యారు. ఈ షోలో బాలయ్య వెంకటేష్ ని ప్రశంసిస్తూ.. తన ఆల్ టైం ఫేవరేట్ చిత్రాలలో రాజా మూవీ కూడా ఒకటి అని తెలిపారు. ఆ మూవీలో వెంకటేష్ పెర్ఫార్మెన్స్ ఒక టెక్స్ట్ బుక్ అనే చెప్పాలి. క్లైమాక్స్ లో సౌందర్య డైలాగులకు, వెంకటేష్ నటనకు ఎవ్వరైనా కంటతడి పెట్టాల్సిందే అని బాలయ్య ప్రశంసలు కురిపించారు. 

45
అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ 

ఆ సన్నివేశానికి మీరు, సౌందర్య ఎలా ప్రిపేర్ అయ్యారు అని బాలయ్య ప్రశ్నించారు. వెంకీ సమాధానం ఇస్తూ.. ఆ సన్నివేశం షూటింగ్ కోసం అంతా సెట్స్ లో వెయిట్ చేస్తున్నారు. నేను ఇంట్లోనే ఉన్నాను. ఈ సీన్ స్పెషల్ గా ఉండాలి అనే ఉద్దేశంతో ఇంట్లోనే మిర్రర్ ముందు అమాయకంగా, ఎమోషనల్ వాక్ చేశా. ఈ వాకింగ్ స్టైల్ బావుంది, ఇలాగే ట్రై చేద్దామని చేశా. అది బాగా వర్కౌట్ అయింది అని వెంకీ తెలిపారు. 

55
సెన్సేషనల్ హిట్ గా రాజా మూవీ 

1999లో ముప్పలనేని శివ దర్శకత్వంలో తెరకెక్కిన రాజా చిత్రం సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఎస్ ఏ రాజ్ కుమార్ అందించిన సంగీతం ఈ చిత్రానికే హైలైట్. ఈ చిత్రం 3 ఫిలిం ఫేర్ అవార్డుని కొల్లగొట్టింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి సౌందర్య, ఉత్తమ సంగీత దర్శకుడు రాజ్ కుమార్ ఇలా మూడు అవార్డులు సొంతం చేసుకుంది. ఈ మూవీ 17 కేంద్రాలలో 100 రోజులు.. 4 కేంద్రాలలో 175 రోజులు ప్రదర్శింపబడింది. 

Read more Photos on
click me!

Recommended Stories