ప్రతిపక్షాలకు చుక్కలు చూపించే పవన్‌ కళ్యాణ్‌ ఇంట్లో ఆమెకి భయపడాల్సిందే.. ఎవరా రూలర్‌ ?

Published : Jun 25, 2025, 11:36 AM IST

డిప్యూటీ సీఎంగా ప్రతిపక్షలకు చుక్కలు చూపిస్తున్నారు పవన్‌. ఛాన్స్ దొరికితే వారిపై విరుచుకుపడుతున్నారు. కానీ ఇంట్లో మాత్రం ఆమెకి భయపడతాడట. ఆ కథేంటో చూద్దాం. 

PREV
15
గిరిజన ప్రాంతాల అభివృద్ధినే ధ్యేయంగా పవన్‌ అడుగులు

పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నారు. ఆయన మంత్రిగా తన బాధ్యతలు సిన్సియర్‌గా నిర్వహిస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సదుపాయాలు అందించే ప్రయత్నం చేస్తున్నారు. గిరిజన ప్రాంతాలు, అటవి ప్రాంతాల ప్రజలకు అండగా నిలుస్తున్నారు. 

మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఆయన ఇప్పటి వరకు తన బెస్ట్ ఇస్తున్నారని చెప్పొచ్చు. అటవి ప్రాంత గూడెలాకు, గ్రామాలకు రోడ్లు, తాగునీరు, వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అక్కడి ప్రజల చేత మన్ననలు పొందుతున్నారు పవన్‌.

25
ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసే పనిలో పవన్‌ కళ్యాణ్‌

అదే సమయంలో ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్‌. ఇప్పటికే `హరిహర వీరమల్లు` చిత్రాన్ని పూర్తి చేశారు. జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం విడుదలకు రెడీగా ఉంది. 

వచ్చే నెల 24న ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. దీనికి ఏఎం రత్నం నిర్మాత. ఇక మరోవైపు `ఓజీ` మూవీ షూటింగ్‌ని కూడా పూర్తి చేశారు పవన్‌. ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుంది. 

కొంత ప్యాచ్‌ వర్క్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మూవీని సెప్టెంబర్‌లో విడుదల చేయబోతున్నారు. దీంతోపాటు హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` చిత్రీకరణ కూడా ఇటీవలే స్టార్ట్ చేశారు. 

మొన్నటి వరకు ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొన్నారు పవన్‌. ఇప్పుడు కొంత బ్రేక్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కూడా త్వరగానే పూర్తి చేయాలని పవన్‌ నిర్ణయించుకున్నట్టు సమాచారం.

35
ప్రతిపక్షాలను వణికించే పవన్‌ భయపడేది ఆమెకే

ప్రభుత్వంలో బిజీగా ఉంటూనే ఛాన్స్ దొరికినప్పుడు ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు పవన్‌. వైసీపీ టార్గెట్‌గా తన ప్రసంగాలిస్తూ వారిని వణికిస్తున్నారు. అయితే ప్రతిపక్షాలను వణికించే పవన్‌ ఇంట్లో మాత్రం ఒకరికి బయపడతాడట. ఆమె అంటే డిప్యూటీ సీఎం అయినా వణికిపోవాల్సిందే అట. 

మరి పవన్‌ కళ్యాణ్‌ భయపడేది ఎవరికి అనేది చూస్తే. ఎవరో కాదు తన పెద్ద కూతురు ఆధ్య. రేణు దేశాయ్‌, పవన్‌లకు ఆధ్య జన్మించారు. వీరి రెండో సంతానం. వీరికి పెద్ద కుమారుడు అకీరా నందన్‌ ఉన్న విషయం తెలిసిందే. కాకపోతే దాదాపు 13ఏళ్ల క్రితమే పవన్‌, రేణు విడిపోయారు.

45
కూతురు ఆధ్య ఆర్డర్‌ వేస్తే పవన్‌ చేయాల్సిందే

ఆధ్య పవన్‌ కళ్యాణ్‌ గారాల పట్టి. ఆమె అంటే ఆయనకు ఎంతో ఇష్టం. అదే సమయంలో పవన్‌ ఎవరినీ పెద్దగా లెక్క చేయరు. కానీ ఆధ్య చెప్పిన మాట వింటాడట. ఆమె ఏం చెబితే అది చేయాల్సిందేనట. 

లేదంటే గోల చేస్తుందట. వార్నింగ్‌లు కూడా ఇస్తుందట. ఈ విషయాన్ని రేణు దేశాయ్‌ వెల్లడించింది. ఆమె పవన్‌ ఇంట్లో బాస్‌ రోల్‌ పోషిస్తుందట. ఎవరినైనా ఎదురించాలంటే తనే అని, తండ్రి వద్ద మాత్రం ఆమె డిమాండ్‌గా ఉంటుందని, ఏదైనా కావాలనిపిస్తే డాడీ నాకు ఇది కావాలి, తీసుకురా అని చెబుతుందట. 

చూడాలనిపిస్తే ఫోన్‌ చేసి వెంటనే రా డాడీ అంటుందట. ఎవరు ఏం చెప్పినా వినదట. ఓపెన్‌ హార్ట్ విత్‌ ఆర్కే షోలో రేణు దేశాయ్‌ ఈ విషయాన్ని పంచుకుంది. పవన్‌కి ముందే ఈ విషయాన్ని చెప్పిందట రేణు. 

చిన్నప్పుడే ఇంట్లో నీకు బాస్ ఎవరూ కాదు, ఆధ్య మాత్రమే. బాగా డామినేట్‌ చేస్తుందని చెప్పిందట. ఇప్పుడు అదే చేస్తుందని తెలిపింది . పవన్‌ కూడా ఆమె మాటని కాదనడని, ఏదైనా చేస్తాడని తెలిపింది రేణు దేశాయ్‌.

55
తల్లి రేణు దేశాయ్‌ వద్ద ఆధ్య

 ఆధ్య చిన్నగా ఉన్నప్పుడు అలా ఉండేది, మరి ఇప్పుడు కూడా అలానే ఉంటుందా అనేది ఆసక్తికరం. ఇప్పుడు చాలా పెద్దగైంది. పైగా పవన్‌ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నారు. కాబట్టి అంత గారాభం ఇప్పుడు ఉండకపోవచ్చు. 

అయితే కూతురు అంత డిమాండ్‌గా ఉండటంలోనే తండ్రికి ఆనందం ఉంటుంది. దాన్ని అంతే ముద్దుగా స్వీకరిస్తారు. అది తండ్రీ కూతుళ్ల ప్రేమకి ప్రతిబింబమని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఆధ్య ఇప్పుడు హైయ్యర్‌ స్కూల్‌ స్టడీస్‌ తో బిజీగా ఉంది. ఆమె అమ్మ రేణు దేశాయ్‌ సంరక్షణలో ఉంది. అడపాదడపా, పండగలు, ఫంక్షన్లకి, ప్రత్యేకమైన అకేషన్లకి పవన్‌ వద్దకు వస్తుంటుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories