
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకంటే రాజకీయాల్లోనే ఎక్కువగా బిజీగా ఉన్నప్పటికీ, ఆయన ఇప్పటికే కమిట్ అయిన సినిమాల షూటింగ్‌ను పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన నటించిన ఓజీ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఓ ఆసక్తికరమైన సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.
మీకు హీరో వెంకట్ గుర్తున్నాడా? సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి సినిమా చూసిన ప్రతీ ఒక్కరికి వెంకట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా మాత్రమే కాదు అన్నయ్య , ఆనందం, శివరామరాజు లాంటి సినిమాల్లో వెంకట్ నటన అద్భుతంగా ఉంటుంది. అంతే కాదు అప్పట్లో హ్యాడ్సమ్ హీరోగా వెంకట్ కు లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. హీరో మెటీరియల్ అనిపించికున్నాడు కాని.. హీరోగా కెరీర్ ను మాత్రం కంటీన్యూ చేయలేకపోయాడు. ఇప్పటికీ అదే గ్లామర్ ను కంటీన్యూ చేస్తున్నాడు వెంకట్.
ఈమధ్యనే రీ ఎంట్రీ ఇచ్చి అప్పుడప్పుడు క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాడు వెంకట్. ఈక్రమంలోనే ఓజీ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన విషయాలను గురించి ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇందులో ఓ సీన్‌లో ఆయన పవన్ కళ్యాణ్ కాలర్ పట్టాల్సి వచ్చిందట. అయితే పవన్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ కావడంతో వెంకట్ ఆ సీన్ చేయడంపై తడబడ్డాడు.
ఈ విషయం గురించి వెంకట్ మాట్లాడుతూ “పవన్ కళ్యాణ్ గారి కాలర్ పట్టుకోవాలి అని డైరెక్టర్ చెప్పగానే నేను భయపడ్డాను. ఆయన డిప్యూటీ సీఎం, పెద్ద స్టార్. ఆయనను తాకడమే పెద్ద విషయం. పైగా ఆయన ఫ్యాన్స్ నన్ను ఊరుకుంటారా, నా వల్ల కాదు అని చెప్పేశాను. ఈ విషయం డైరెక్టర్ సుజీత్ దగ్గరకు వెళ్లి సీన్‌లో మార్పు చేయమని అడిగాను”.
అయితే డైరెక్టర్ సుజీత్ మాత్రం, “మీరు ఏం చేస్తారో తెలియదు కానీ మీరే అన్నయ్యని ఒప్పించి కాలర్ పట్టుకోవాలి,” అని క్లియర్‌గా చెప్పారు. దాంతో వెంకట్ భయంతోనే పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లి, “అన్నయ్యా, నేను మీ కాలర్ పట్టుకోవాలి ఓ సీన్‌లో” అని భయంభయంగానే చెప్పారు.
అయితే పవన్ కళ్యాణ్ మాత్రం చాలా సింపుల్‌గా స్పందిస్తూ, “పట్టుకోండి.. దాంట్లో ఇబ్బంది ఏముంది? అది సీన్ కోసమే కదా” అని చాలా క్యాజువల్‌గా స్పందించారని వెంకట్ పేర్కొన్నారు. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, “చిన్న హీరోలైనా అలాంటి సీన్లకు అబ్జెక్షన్స్ చెబుతారు. కానీ పవన్ గారు మాత్రం ఎంతో అనుభవంతో, వినయంగా ఆ స్పందన ఇవ్వడం నాకు ఆశ్చర్యం కలిగించింది,” అని వెంకట్ అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ వినయాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. రాజకీయ నేతగా , హీరోగా స్టార్ డమ్ చూసిన పవన్ కళ్యాణ్ కాస్త కూడా గర్వం ప్రదర్శించకుండా ఎంత డెడికేషన్ తో తన పనితాను చేసుకుంటూ వెళ్తున్నారని అంటున్నారు. అంతే కాదు ఈ వీడియోను పవన్ ఫ్యాన్స్ గ్రూప్ లో తెగ వైరల్ చేస్తున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన పెండింగ్ సినిమాలు కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఆయన నటించిన హరిహరవీరమల్లు సినిమా రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక నెక్ట్స్ ఓజీ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈమూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ నడుస్తున్నాయి.
కాగా సెప్టెంబర్ 25న OG సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు టీమ్. ఇక ఈమూవీ తరువాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాడ్ భగత్ సింగ్ సినిమా ఒక్కటి పెండింగ్ ఉంది. ఈసినిమా కూడా కంప్లీట్ అయితే, పవన్ కళ్యాణ్ గతంలో కమిట్ అయిన సినిమాలన్నీ పూర్తి అవుతాయి.
ఇక ఆతరువాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారా? లేక పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవుతారా అన్న విషయంలో క్లారిటీ లేదు. అధికారకంగా మాత్రం పవన్ ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఒక వేళ సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది.
డిప్యూటీ సీఎంగా చాలా బిజీ షెడ్యూల్స్ లో ఉంటున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక సినిమాకు ఫుల్ లెన్త్ కాల్షీట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఉస్తాద్ తరువాత ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ మాత్రం ఓజీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు.