
విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన `కింగ్‌డమ్` మూవీకి భారీ హైప్ నెలకొంది. టీజర్, ట్రైలర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా ట్రైలర్‌తో ఆ అంచనాలు బాగా పెరిగాయి.
ఆ హైప్ సినిమా వ్యాపారం, అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో కనిపిస్తోంది. ఓవర్సీస్‌లో ఈ మూవీ భారీ అడ్వాన్స్ బుకింగ్స్ ని సాధించింది. టీమ్ అధికారికంగా తెలిపిన ప్రకటన ప్రకారం ఇప్పటికే నార్త్ అమెరికాలో ఐదు లక్షల డాలర్లు వసూలు చేసింది.
సుమారు నాలుగు కోట్లు రాబట్టినట్టే. మరోవైపు ఇండియాలోనూ ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్ములేపుతుంది. సుమారు రెండు లక్షల టికెట్లు అమ్ముడు పోయినట్టు సమాచారం.
విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే ఈ మూవీ భారీ ఓపెనింగ్స్ ని రాబట్టబోతుందని తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రం మొదటి రోజు రూ.40కోట్లకుపైగా వసూళ్లని రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు.
పాజిటివ్ టాక్ వస్తే యాభై కోట్లు అయినా ఈజీగా దాటేస్తుందంటున్నారు. ఇదే జరిగితే విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూవీగా `కింగ్‌డమ్` నిలుస్తుందని చెప్పొచ్చు. మరి ఆ స్థాయిలో రీచ్ అవుతుందా అనేది చూడాలి.
ఇదిలా ఉంటే `కింగ్‌డమ్` మూవీ బడ్జెట్ ఎంత అయ్యింది? బిజినెస్ ఎంత అయ్యిందనేది చూస్తే. ఈ చిత్రానికి రూ.130 కోట్ల బడ్జెట్ అయ్యిందని గలాటాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ తెలిపారు.
బడ్జెట్ ప్లాన్ చేయలేదని, కానీ అనుకున్నదానికంటే ఎక్కువైందన్నారు. అయితే ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాయి. ఈ `ట్రాక్ టాలీవుడ్` నివేదిక ప్రకారం ఈ చిత్రానికి రూ.50కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యిందట.
నైజాంలో రూ.15 కోట్లు, ఆంధ్రాలో రూ.15కోట్లు, సీడెడ్‌లో రూ.6 కోట్ల వ్యాపారం జరిగిందట. ఓవర్సీస్, మిగిలిన ఇండియావైడ్‌గా మొత్తం కలిపి యాభై కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికట్ బిజినెస్ అయ్యిందట.
ఇక దీనితోపాటు ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ రైట్స్ తీసుకుంది. రూ.50కోట్లకు ఓటీటీ డీల్‌సెట్ అయ్యిందని సమాచారం. ఇలా నిర్మాతకు రిలీజ్‌కి ముందే వంద కోట్లు వచ్చింది.
ఇక మిగిలిన అమౌంట్ థియేటర్ ద్వారానే రాబట్టు కోవాలి. మరి ఇది ఈ రేంజ్‌లో జనాలకు ఎక్కుతుందో చూడాలి. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే దాని కథే వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.
ఈజీగా మూడు వందల నుంచి నాలుగు వందల కోట్లు రాబట్టినా ఆశ్చర్యం లేదు. మరి ఆ రేంజ్ రీచ్ ఉంటుందా అనేది చూడాలి.
`కింగ్‌డమ్` మూవీ విషయంలో బయ్యర్లు సేఫ్ కావాలంటే వంద కోట్ల గ్రాస్ రావాలి. నిర్మాతలు కూడా సేఫ్‌గా ఉండాలంటే రెండు వందల కోట్లు రాబట్టాలి. అప్పుడే సినిమా హిట్ లెక్క. మరి ఈ మూవీ ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండతోపాటు సత్యదేవ్, వెంకటేష్ ప్రధాన పాత్రలు పోషించారు. భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం బిగ్ అసెట్. ఈ చిత్రం నేడు గురువారం(జులై 31న)ని విడుదలైన విషయం తెలిసిందే.