విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ చిత్రం నేడు జూలై 31న రిలీజ్ అవుతోంది. ప్రతిభగల దర్శకుడిగా గుర్తింపు పొందిన గౌతమ్ తిన్ననూరి జెర్సీ తర్వాత తెరకెక్కించిన చిత్రం ఇదే. సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రానికి నిర్మాత. యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ అన్న పాత్రలో హీరో సత్యదేవ్ నటించారు.
26
విజయ్ దేవరకొండ హిట్ కొట్టాడా ?
విజయ్ దేవరకొండ చివరగా నటించిన లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరిగ్గా వర్కౌట్ కాలేదు. దీనితో అభిమానులు కింగ్డమ్ చిత్రం విజయ్ దేవరకొండకి సాలిడ్ కంబ్యాక్ మూవీ కావాలని ఆశిస్తున్నారు. ట్రైలర్, టీజర్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మంచి బజ్ తో ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రీమియర్ షోల నుంచి కింగ్డమ్ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది ? ప్రీమియర్ షోలు చూస్తున్న ఆడియన్స్ ట్విట్టర్ లో ఈ చిత్రం గురించి ఏమంటున్నారు ? విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రంతో హిట్ కొట్టాడా లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
36
కింగ్డమ్ ట్విట్టర్ రివ్యూ
కింగ్డమ్ కథ బ్రిటిష్ టైం పీరియడ్ నేపథ్యంలో చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది.ఫస్ట్ హాఫ్ బావుంది అంటూ నెటిజన్లు ట్విట్టర్ లో పోస్ట్ లు పెడుతున్నారు. తొలి 30 నిమిషాలు దర్శకుడు నెమ్మదిగా కథని బిల్డ్ చేస్తూ ఆ వరల్డ్ లోకి తీసుకువెళ్లాడు. విజయ్ దేవరకొండ ప్రతి ఫ్రేమ్ లో తన నటనతో కట్టిపడేస్తున్నాడు.
విజయ్ దేవరకొండ గత చిత్రాల కంటే ఈ మూవీలో అతడి నటన కాస్త భిన్నంగా ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ లో కూడా మార్పులు చూడొచ్చు. అనిరుద్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయినట్లు ఆడియన్స్ చెబుతున్నారు. సత్యదేవ్, విజయ్ దేవరకొండ మధ్య ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అయినట్లు చెబుతున్నారు. ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ పరిణితి చెందిన నటుడిగా మారినట్లు ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
56
మూవీలో హైలైట్స్ ఇవే
కానీ సినిమా లెన్త్, స్లోగా సాగే నెరేషన్ మైనస్ అని చెబుతున్నారు. దర్శకుడు మంచి కథ ఎంచుకున్నప్పటికీ స్క్రీన్ ప్లే అంతగా వర్కౌట్ కాలేదని అంటున్నారు. శ్రీలంక ఫారెస్ట్ నేపథ్యంలో సాగే కథ ఆసక్తికరంగా ఉంటుంది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగింది. టెక్నికల్ గా ఈ చిత్రం చాలా బావుంది. విజువల్స్, మ్యూజిక్ అన్నీ వర్కౌట్ అయ్యాయి.
66
ఓవరాల్ గా ఎలా ఉందంటే
సెకండ్ హాఫ్ కి కూడా మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. సెకండ్ హాఫ్ లో బోట్ సన్నివేశం అద్భుతంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఓవరాల్ గా విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వానికి మరోసారి ప్రశంసలు దక్కుతున్నాయి.