ఓ వైపు డిప్యూటీ సీఎంగా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వర్తిస్తూనే ఉంటానని, వాటికి ఆటంకం కలగకుండా చూసుకుంటానని, టైమ్ దొరికినప్పుడు సినిమాలు చేస్తానని వెల్లడించారు. సినిమాలను చేస్తూ ప్రజలను దూరం చేసుకోనని, రెండింటిని బ్యాలెన్స్ చేస్తానని తెలిపారు.
ఈ వార్తతో దర్శక, నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. అదే సమయంలో రాజకీయాల్లో బిజీగా ఉండి పవన్ సినిమాలకు ఎక్కడ దూరమవుతాడో అనే ఆవేదన చెందుతున్న ఫ్యాన్స్ కిది శుభవార్త అని చెప్పొచ్చు.