రాజశేఖర్ కి జరిగిన సంఘటన రిపీట్, చిరంజీవిని ఒక్క మాట అన్నందుకు నటి కారుపై ఫ్యాన్స్ అటాక్, ఏం జరిగిందంటే ?
చిరంజీవిని తిట్టడం వల్ల ఒక నటి కారుపై ఆయన అభిమానులు దాడి చేశారట. ఇది వినగానే రాజశేఖర్ సంఘటన గుర్తుకు రావడం సహజం.
చిరంజీవిని తిట్టడం వల్ల ఒక నటి కారుపై ఆయన అభిమానులు దాడి చేశారట. ఇది వినగానే రాజశేఖర్ సంఘటన గుర్తుకు రావడం సహజం.
మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్యాగ్రౌండ్ లేకుండా కష్టపడి ఎదిగిన చిరంజీవి తన డ్యాన్సులు, నటనతో కోట్లాది మంది అభిమానులని సొంతం చేసుకున్నారు.గతంలో చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ లో పండగ వాతావరణం కనిపించేది. చిరంజీవిని ఎవరైనా విమర్శించినా అభిమానులు ఊరుకునేవారు కాదు. మెగాస్టార్ కి అంతలా మాస్ ఫాలోయింగ్ ఉండేది.
చిరంజీవిని చిన్న మాట అన్నా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ విరుచుకుపడుతుంటారు. చిరంజీవిని తిట్టడం వల్ల ఒక నటి కారుపై ఆయన అభిమానులు దాడి చేశారట. ఇది వినగానే రాజశేఖర్ సంఘటన గుర్తుకు రావడం సహజం. ప్రజారాజ్యం పార్టీ సమయంలో రాజశేఖర్ చిరంజీవిని విమర్శించారు. దీనితో అప్పట్లో అభిమానులు రాజశేఖర్ కారుపై దాడి చేయడం జరిగింది. ఆ సంఘటన సంచలనం సృష్టించింది. చిరంజీవి రంగంలోకి దిగి ఫ్యాన్స్ తరుపున క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.
అంతకంటే చాలా ఏళ్ళ క్రితమే ఒక నటికి ఇలాంటి సంఘటన ఎదురైంది. ఆ నటి పేరు మీనా కుమారి. ఆమె చిరంజీవి హిట్లర్ చిత్రంలో 5వ చెల్లి పాత్రలో నటించారు. ఆమె మాట్లాడుతూ నేను చిన్న చెల్లిని కాబట్టి హిట్లర్ లో నాకు ఎక్కువగా డైలాగులు లేవు. కొన్ని మాత్రమే ఉన్నాయి. క్లైమాక్స్ ముందు చిరంజీవి గారిని నేను తిట్టాలి. నిన్ను చూస్తుంటే రాక్షసుడిని చూస్తున్నట్లు ఉంది అని డైలాగ్ చెప్పా. ఆ డైలాగ్ తో ఫ్యాన్స్ లో నాకు విపరీతమైన చెడ్డ పేరు వచ్చింది. చిరంజీవిని అంత మాట అంటుందా అని ఎక్కడికి వెళ్లిన ఫ్యాన్స్ గోల చేయడం, నన్ను తిట్టడం ప్రారంభించారు. నేను తిట్టింది సినిమాలో రా బాబు అని చెప్పినా వినిపించుకోవడం లేదు.
హిట్లర్ మూవీ 50 రోజులు, 100 రోజుల ఫంక్షన్స్ చాలా చోట్ల చేశారు.సూళ్లూరుపేట లో కూడా ఈవెంట్ జరిగింది. అక్కడికి వెళుతుంటే మా కారుని 50 మంది ఫ్యాన్స్ చుట్టుముట్టారు. చిరంజీవిని ఇష్టం వచ్చినట్లు తిడతావా అంటూ పెద్ద రచ్చ చేశారు. మమ్మల్ని వెళ్లనివ్వడం లేదు.
మేము సీన్ లో ఉన్నట్లు, డైరెక్టర్ చెప్పినట్లు డైలాగులు చెప్పాలి, అది సినిమాలో భాగం మాత్రమే అని రిక్వస్ట్ చేస్తే ఆ తర్వాత వదిలిపెట్టారు అని మీనా కుమారి తెలిపింది. మీనా కుమారి సినిమాల కంటే అప్పట్లో టివి సీరియల్స్ ద్వారా ఎక్కువ గుర్తింపు పొందారు.