`ఓజీ` గూస్‌బంమ్స్ అప్‌ డేట్‌, పవన్‌ స్పీడ్‌ మామూలుగా లేదుగా.. ఫస్ట్ వచ్చేది ఏ సినిమా అంటే?

First Published | Oct 16, 2024, 12:13 AM IST

పవన్‌ కళ్యాణ్‌ స్పీడ్‌ పెంచాడు. బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు పూర్తి చేసే పనిలో పడ్డారు. `హరిహర వీరమల్లు`లో బిజీగా ఉన్న ఆయన, ఇప్పుడు `ఓజీ`ని స్టార్ట్ చేయడం విశేషం. 
 

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ గ్యాప్‌ తర్వాత ఇప్పుడు స్పీడ్‌ పెంచాడు. తాను కమిట్‌ అయిన సినిమాల షూటింగ్‌లు పూర్తి చేసే పనిలో బిజీ అయ్యారు. అటు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే ఇటు సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఆ మధ్య `హరి హర వీరమల్లు` సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు పవన్. ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుంది. పవన్‌ కి టైమ్‌ దొరికినప్పుడల్లా ఆయనపై ఉన్న కీలక సన్నివేశాలను షూట్‌ చేస్తున్నారు.

ఏమాత్రం ఆలస్యం లేకుండా పవన్‌ పాత్రని కంప్లీట్‌ చేసే పనిలో ఉన్నారు టీమ్‌.  ఈ నేపథ్యంలో సోమవారం నుంచే కొత్త షెడ్యూల్‌ ప్రారంభమైంది. నవంబర్‌ 10 నాటికి చిత్రీకరణ పూర్తి చేసే పనిలో ఉన్నారు. త్వరలోనే మొదటి సాంగ్‌ని విడుదల చేయబోతున్నారు. `ప్వార్డ్ వర్సెస్‌ స్పిరిట్‌` పేరుతో ఈ పాట రానుంది. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది మార్చి 28న `హరిహర వీరమల్లు` పార్ట్ 1ని విడుదల చేయబోతున్నారు.  

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రముఖ బాలీవుడ్ నటుడు, `యానిమల్` ఫేమ్ బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్, సచిన్ ఖేడ్ ఖర్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, మురళీశర్మ, అయ్యప్ప శర్మ, సునీల్, నీహార్ కపూర్, సుబ్బరాయ శర్మ,  సుబ్బరాజు, కబీర్ దుహన్ సింగ్, నాజర్, రఘుబాబు, నర్రా శ్రీను, దలీప్ తాహిల్,  అనసూయ భరద్వాజ్, పూజిత పొన్నాడ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

క్రిష్‌ దర్శకత్వ పర్యవేక్షణలో జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏఎంరత్నం సమర్పణలో మెగాసూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ దయాకర్‌ రావు నిర్మిస్తున్నారు. దీనికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండటం విశేషం. పవన్‌ నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా మూవీ ఇది కావడం విశేషం. 
 


ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సినిమాని స్టార్ట్ చేశారు పవన్‌. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మరో మూవీ `ఓజీ`ని స్టార్ట్ చేశారు. గతేడాది ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్‌ని మంగళవారం నుంచి ప్రారంభించారు. కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్‌లో పవన్‌ కళ్యాణ్‌ కూడా పాల్గొనబోతున్నారు. `హరిహర వీరమల్లు` షూటింగ్‌ పూర్తి చేసుకుని ఈ మూవీ సెట్‌లోకి డిప్యూటీ సీఎం రాబోతున్నట్టు తెలుస్తుంది. 
 

ముంబయి బేస్డ్ గ్యాంగ్‌స్టర్‌ ప్రధానంగా సాగే ఈ మూవీకి సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ మూవీలో పవన్‌ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ గూస్‌ బంమ్స్ తెప్పించాయి. సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ మూవీ షూటింగ్‌లో పవన్‌ మరో పదిహేను, ఇరవై రోజులు పాల్గొంటే సరిపోతుందట. సినిమా షూటింగ్‌ అయిపోతుందని తెలుస్తుంది.

సుజీత్‌ చాలా పక్కా ప్లానింగ్‌తోనే చిత్రీకరణ పూర్తి చేస్తున్నారని తెలుస్తుంది. కుదిరితే ఈ చిత్రాన్ని కూడా వచ్చే ఏడాదిలోనే ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. అదే జరిగితే, వచ్చే ఏడాది పవన్‌ నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయని చెప్పొచ్చు. ఇది ఆయన ఫ్యాన్స్ సంబరాలు చేసుకునే విషయమనే చెప్పాలి. 
 

ఓజీ సినిమాలో బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆయనది నెగటివ్ రోల్‌ అని సమాచారం. ఆయనతోపాటు అర్జున్‌ దాస్‌, శ్రియా రెడ్డి వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పవన్‌కి జోడీగా ప్రియాంక అరుల్‌ మోహన్‌ కనిపించబోతుంది. దీన్ని కూడా పాన్‌ ఇండియా మూవీగా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాపై పవన్‌ ఫ్యాన్స్‌ భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వస్తే ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసే మూవీ అవుతుందని ఆశిస్తున్నారు. మరి ఏ రేంజ్‌ ఫలితాన్ని చవిచూస్తుందో చూడాలి. 

సాయిపల్లవితో సినిమా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే
 

Latest Videos

click me!