అన్నంత పని చేస్తున్న హరితేజ, టేస్టీ తేజతో కలిసి యష్మిని టార్గెట్‌, పాపం చేసేదేం లేక కన్నీళ్లు

First Published | Oct 15, 2024, 11:43 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 8.. 44 వ ఎపిసోడ్‌లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఇందులో యష్మిని తేజ, హరితేజ టార్గెట్‌ చేశారు. దీంతో కన్నీళ్లు పెట్టుకుంది యష్మి. 
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఏడో వారం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మంగళవారం ఎపిసోడ్‌ లో కూడా నామినేషన్ల ప్రక్రియ కంటిన్యూ అయ్యింది. సోమవారం ఎపిసోడ్‌లో గౌతమ్‌, నిఖిల్‌, తేజ, మణికంఠని నామినేట్‌ చేశారు. దానికి కొనసాగింపు మంగళవారం జరిగింది. ఇందులో యష్మి టార్గెట్‌ కావడం విశేషం. హరితేజ.. కావాలని ఆమెని టార్గెట్‌ చేసినట్టుగా అనిపించింది. ఇదే ఈ ఎపిసోడ్‌లో వాడి వేదిగా చర్చ జరిగింది. హౌజ్‌ని హీటెక్కించింది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

ఇందులో మొదట నబీల్‌.. టేస్టీ తేజని నామినేట్‌ చేశాడు. లీస్ట్ పర్‌ఫెర్మెన్స్ అనే రీజన్‌తో ఆయన్ని నామినేట్‌ చేశాడు. ఆ తర్వాత తేజ.. యష్మిని నామినేట్‌ చేశాడు. ఆమె మొదట తన  ప్రేరణని నామినేట్‌ చేస్తానని చెప్పిందని, కానీ తీరా అలా చేయలేదని ఫ్రెండ్‌ విషయంలో మాట మార్చిందని, ఇలాంటి మనస్తత్వం నచ్చలేదని తెలిపారు.

అయితే దీనికి యష్మి రియాక్ట్ అవుతూ తాను ఫ్రెండ్‌ అని చెప్పలేదని, ఆమె హౌజ్‌లోకి వచ్చాకనే ఫ్రెండ్‌ అయ్యిందని చెప్పింది. తనని నామినేట్‌ చేయాలా? వద్దా అనేది తన ఇష్టమని చెప్పింది యష్మి. కానీ ఫ్రెండ్‌ అన్నప్పుడు ఆమె కోసం నిలబడాలని, వారిని సేవ్‌ చేయాలని, కానీ నువ్వు అలా చేయలేదని చెబుతూ, అటు తేజ, ఇటు కిల్లర్‌ లేడీగా ఉన్న హరితేజ యష్మిని టార్గెట్ చేశారు.

ఈ విషయంలో యష్మి బాగా వాధించినా ప్రయోజనం లేదు. తన వాదన అక్కడ పెద్దగా వర్కౌట్‌ కాలేదు. దీంతో చేసేదేం లేక కన్నీళ్లు పెట్టుకుంది యష్మి. ఎక్కి ఎక్కి ఏడ్చింది. 


గతంలో యష్మి.. మణికంఠ విషయంలో రివేంజ్‌ నామినేషన్‌ చేసింది. ప్రతి సారి ఆయన్ని టార్గెట్‌ చేస్తూ తప్పులు తీసింది. కానీ ఇప్పుడు మాత్రం ఆమె స్పీడ్‌ తగ్గిపోయింది. ఆమెని కొత్తగా వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్లు టార్గెట్‌ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆమెని ఫేస్‌ చేస్తే మిగిలిన వాళ్లని టార్గెట్‌ చేయడం ఈజీ అని భావించి చేస్తున్నారనే భావన కలుగుతుంది. హరితేజ ఎంట్రీ సమయంలోనే యష్మితోనే ఉంటుందని చెప్పింది.

చూడబోతుంటే ఆమె అదే చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఓజీ టీమ్‌, రాయల్‌ టీమ్‌ మధ్య గ్యాప్‌ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మధ్యలో ఇన్‌వాల్వ్ చేసిన నయని పావని సైతం యష్మిని టార్గెట్‌ చేస్తూ ఆమెపై ఫైర్‌ కావడం గమనార్హం. ఇంత మందికి యష్మి టార్గెట్‌ కావడంతో ఆమె ఆ బాధ తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంది. 

అనంతరం విష్ణు ప్రియా.. నయని పావనిని నామినేట్‌ చేసింది. రివేంజ్‌ నామినేషన్‌ అని చెప్పగా, బిగ్‌ బాస్‌ అది చెల్లదని, సరైన కారణాలు చెప్పాలన్నాడు. దెబ్బకి విష్ణుప్రియాకి మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. ఏదో మొక్కుబడి కారణంతో నామినేట్‌ చేసింది. నిఖిల్‌.. టేస్టీ తేజని నామినేట్‌ చేశాడు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య కూడా గట్టిగానే వాదన జరిగింది. తన స్టామినా,కెపాసిటీ గురించి వివరిస్తూ తేజ చేసిన యాక్టివిటీస్‌ నవ్వులు పూయించాయి.

అవినాష్‌ని పృథ్వీ నామినేట్‌ చేసే సమయంలో ఇద్దరి మధ్య గట్టిగా వాదన జరిగింది. పృథ్వీ టాస్క్ ల్లో కనిపించడం లేదని అవినాష్‌ నామినేట్‌ చేయడం గురించిప్రస్తావని ప్రోమోలు చూసి టాస్క్ ల్లో కనిపించడం లేదని మాట్లాడటంపై తనకు నచ్చలేదన్నాడు పృథ్వీ. అయితే దీనిపై వివరణ ఇస్తూ మా వైఫ్‌ చూసిందన్నారు అవినాష్‌. దానికి మీ వైఫ్‌ రావాల్సింది, నువ్వెందుకు వచ్చావని, తన భార్య ప్రస్తావని పృథ్వీరాజ్‌ తీసుకురావడంతో అవినాస్‌ ఫైర్‌ అయ్యాడు.

కామెడీ చేయడం మాత్రమే కాదు, వాదించడంలోనూ తాను తగ్గేదెలే అని నిరూపించాడు ముక్కు అవినాష్‌. సోఫాలో కూర్చుని ఎంజాయ్‌ చేస్తున్నావని, గేమ్‌లు ఆడటం రాట్లేదని స్ట్రాంగ్‌గా ఆరోపనలు చేశాడు అవినాష్‌.దీంతో రా అంటూ నోరు జారాడు పృథ్వీ. ఇది చాలా సీరియస్‌గా మారింది. ఒకరిపైకి మరొకరు వెళ్లేంత వరకు వెళ్లింది. ఈ ఎపిసోడ్‌లో తన వాదన కూడా హైలైట్‌గా నిలిచింది. 
 

ఇక ఏడో వారం నామినేషన్‌ ప్రక్రియలో మొత్తంగా 9 మంది నామినేట్‌ అయ్యారు. గౌతమ్‌, పృథ్వీరాజ్‌, నిఖిల్‌, మణికంఠ, యష్మి, తేజ, నబీల్‌, ప్రేరణ నామినేట్‌ కాగా, స్వైపింగ్‌ ద్వారా హరితేజని నామినేట్‌ చేయాల్సి వచ్చింది. ఇలా తొమ్మిది మంది ఈ వారం నామినేట్‌ అయ్యారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఆదివారం ఎపిసోడ్‌లో తేలనుంది.

సెప్టెంబర్‌ 1న ప్రారంభమైన బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ లో ప్రస్తుతం 15 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. మరో 9వారాలు ఈ షో రన్‌ కాబోతుంది. దీనికి నాగార్జున ఆరో సారి హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. మూడో సీజన్‌ నుంచి ఆయనే హోస్ట్ గా ఉన్నారు. 

సాయిపల్లవితో సినిమా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే

Latest Videos

click me!