పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉండబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ వైరల్ గా మారింది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పరిపాలన వ్యవహారాలతో బిజీగా ఉన్నారు. ఈ టైంలో పవన్ కి సినిమాలకు సమయం కేటాయించడం కష్టం అవుతోంది. కానీ పవన్ ఇటీవల హరిహర వీరమల్లు, ఓజీ లాంటి సినిమాలని పూర్తి చేసి రిలీజ్ చేశారు. సమ్మర్ లో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది.
25
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో..
ఈ మూవీ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించేందుకు పవన్ కమిటయ్యారు. పవన్ ప్రస్తుతం కమిటైంది ఇదొక్క మూవీ మాత్రమే. ఓజీ 2 చేయాల్సి ఉన్నా ప్రస్తుతం దానిపై పవన్ ఫోకస్ లేదు. ఇప్పుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలోని చిత్రానికి సంబంధించి ఆసక్తికర అప్డేట్ వైరల్ గా మారింది.
35
నిర్మాతగా రామ్ తాళ్లూరి
పవన్ కి సన్నిహితుడైన రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే రామ్ తాళ్లూరికి చెందిన జైత్రరామ మూవీస్ బ్యానర్ ని పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా లాంచ్ చేశారు.
ఈ బ్యానర్ లోనే పవన్, సురేందర్ రెడ్డి చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్ర షూటింగ్ మార్చి నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డేట్లు అడ్జెస్ట్ చేస్తున్నారు. అయితే ఎక్కువ డేట్లు కేటాయించలేనని.. ఇచ్చిన డేట్లలోనే సినిమా పూర్తి చేయాలి అని పవన్ తేల్చి చెప్పేశారట.
55
సురేందర్ రెడ్డికి కష్టమే
ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి భారీ బడ్జెట్ లోనే నిర్మించబోతున్నారు. కానీ పవన్ మాత్రం ఎక్కువ డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. తక్కువ సమయంలోనే మంచి క్వాలిటీ అవుట్ పుట్ రాబట్టడం సురేందర్ రెడ్డికి పెద్ద టాస్కే అని చెప్పాలి. ఈ చిత్రానికి వక్కంతం వంశీ రచయితగా పనిచేస్తున్నారు. సురేందర్ రెడ్డి చివరిగా తెరకెక్కించిన ఏజెంట్ మూవీ డిజాస్టర్ అయింది. ఇప్పుడు తప్పనిసరిగా సురేందర్ రెడ్డి కంబ్యాక్ ఇవ్వాల్సిందే.