పవన్‌ కళ్యాణ్‌, రాజమౌళి కాంబినేషన్‌తో సినిమా.. పవర్‌ స్టార్‌ని ఇరికించి జక్కన్న భలే తప్పించుకున్నాడే

పవన్‌ కళ్యాణ్‌, రాజమౌళి కాంబినేషన్‌లో ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ దీనికి సంబంధించిన డిస్కషన్‌ జరిగింది. ఇందులో రాజమౌళి.. పవన్ ని ఇరికించడం విశేషం. 
 

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా రాలేదు. వీరిద్దరి కాంబోలో సినిమా అంటే అది ఊహకు కూడా అందరు. ఆ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని దాటి ఉంటాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు టాలీవుడ్‌లోనే అంత్యంత క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ గా ఇది నిలుస్తుందని చెప్పొచ్చు. అయితే వీరిద్దరి కాంబోలో సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

రాజమౌళి ఇప్పటి వరకు ఎన్టీఆర్‌తో నాలుగు సినిమాలు, ప్రభాస్‌ తో మూడు సినిమాలు, రామ్‌ చరణ్‌తో రెండు సినిమాలు, నితిన్‌, రవితేజ, నాని, సునీల్‌లతో ఒక్కో సినిమా చేశారు. ఇప్పుడు మహేష్‌ బాబుతో మొదటిసారి సినిమా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది. హాలీవుడ్‌ సినిమాల స్థాయిలో దీన్ని తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు జక్కన్న. ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ని టార్గెట్‌ చేస్తూ ఆయన ఈ మూవీని రూపొందించబోతున్నారు. పాన్‌ ఇండియా ఆర్టిస్టులతోపాటు అంతర్జాతీయంగా పేరున్న ఆర్టిస్ట్ లను కూడా దించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీ ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. 


ఇదిలా ఉంటే సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అవుతుంది. అందులో రాజమౌళి, పవన్‌ కళ్యాణ్‌ కాంబినేషన్‌లో సినిమాకి సంబంధించిన ప్రస్తావన ఉండటం విశేషం. పవన్‌తో సినిమా చేయాలని ఫ్యాన్స్ అరుస్తుండగా, పవన్‌ కళ్యాణ్‌ని అడగాలని రాజమౌళి చెప్పడం, జక్కన్నతో సినిమా చేయడానికి సంబంధించిన పవన్‌ కూడా రియాక్ట్ కావడం విశేషం. మరి ఇంతకి ఏం జరిగిందంటే.

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన `పంజా` సినిమా ఆడియో లాంఛ్‌ ఈవెంట్‌కి గెస్ట్ గా రాజమౌళి వచ్చారు. `పంజా` సినిమా టైటిల్‌ అదిరిపోయిందని, టైటిల్‌ సాంగ్‌ కూడా చించేశారు. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉందన్నారు. పవన్‌ కళ్యాణ్‌ని కలుద్దామని చాలా సార్లు అనుకున్నా.

కానీ ఎప్పుడూ కుదరలేదు. ఓసారి కోల్‌కత్తాలో షూటింగ్‌లో ఉన్నారని వెళితే, నేను వెళ్లిన రోజే ఆయనకు షూటింగ్‌ లేదు. అలా మిస్‌ అయ్యింది. ఇన్నాళ్లకి `పంజా` ఈవెంట్‌లో కలిసే అవకాశం వచ్చింది. చాలా సంతోషంగా ఉందన్నారు రాజమౌళి.
 

pawan kalyan

ఆయన మాట్లాడుతున్న సమయంలోనే ఫ్యాన్స్‌ పవన్‌తో సినిమా అని అరుస్తున్నారు. దీనికి రాజమౌళి రియాక్ట్ అవుతూ ఆ ప్రశ్నకి సమాధానం ఆయన(పవన్‌) చెప్పాలి అంటూ వెళ్లిపోయారు రాజమౌళి. అనంతరం పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ, రాజమౌళి సినిమాలంటే తనకు చాలా ఇష్టమని, `మగధీర` సినిమా బాగా నచ్చిందని, ఆ మూవీ చూశాక రాజమౌళితో మాట్లాడి, ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందించినట్టు తెలిపారు పవన్‌.

ఇక సినిమా గురించి చెబుతూ, తాను ఎవరినీ చేయి చాచి సినిమా చేయమని అడగనని, అలా అడగాలంటే ఇబ్బందిగా ఉంటుందని చెప్పాడు పవన్‌. అయితే రాజమౌళితో సినిమా మనం అనుకుంటే అవదు, ఆ సమయం వచ్చినప్పుడు అవుతుందన్నారు. దానికి టైమ్‌ కలిసి రావాలన్నారు. దీంతో ఫ్యాన్స్ అరుపులతో హోరెత్తించారు. కానీ ఇప్పటి వరకు వీరి కాంబోలో సినిమా సెట్‌ కాలేదు. 

ఇప్పుడు రాజకీయాల్లో పవన బిజీగా ఉన్నారు. మరోవైపు రాజమౌళి .. మహేష్‌తో సినిమా చేస్తున్నారు. ఆయన ఆలోచనల్లో వేరే ప్రాజెక్ట్ లున్నాయి. పవన్‌ తో చేయాలనే ఆలోచనలోనే ఆయన లేరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏదో వింత జరిగితే, మ్యాజిక్‌ జరిగితే తప్ప వీరి కాంబోలో సినిమా రావడం అసాధ్యమనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే పవన్‌తో సినిమా చేయాలని ఒకప్పుడు రాజమౌళి ప్రయత్నించారట.

`విక్రమార్కుడు` కథ ఆయనతోనే చేయాలనుకున్నారట. కానీ పవన్‌ ఆసక్తి చూపించడం లేదని, అందుకే సినిమా పడలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. బాహుశా రాజమౌళి ఈ ఈవెంట్‌లో చెప్పింది ఆ మూవీ కోసమేనేమో. మొత్తానికి అదిరిపోయే సినిమా, దాన్నిమించిన కాంబో మిస్‌ అయ్యిందనే చెప్పొచ్చు. ప్రస్తుతం పవన్‌ చేతిలో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`, `ఓజీ`, `హరిహర వీరమల్లు` సినిమాలున్నాయి. 

Read more: `రోబో` సినిమాని రిజెక్ట్ చేయాలనుకున్న రజనీ.. శంకర్‌ బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు షాక్‌లు ఇవ్వడంతో

Also read: రామ్‌ చరణ్‌ డాన్స్ చేస్తాడా? నాకు పెద్ద డౌట్‌, చాలా టెన్షన్‌ పడ్డాం.. బావ ముందే అల్లు అర్జున్‌ కామెంట్‌

Latest Videos

click me!