యష్మి-విష్ణుప్రియలకు నామినేషన్స్ లో చుక్కలు చూపించిన వైల్డ్ కార్డ్స్!

First Published | Oct 8, 2024, 2:41 PM IST

వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ యష్మి, విష్ణుప్రియలకు చుక్కలు చూపించారు. నామినేషన్స్ లో వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తడబడ్డారు. 
 

Bigg boss telugu 8

బిగ్ బాస్ హౌస్ 16 మంది కంటెస్టెంట్స్ తో కళకళలాడుతుంది. గత ఐదు వారాలుగా హౌస్లో ఉన్న 8 మంది కంటెస్టెంట్స్ కి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరో 8 మంది తోడయ్యారు. రెండు టీమ్స్ గా వీరిని బిగ్ బాస్ విభజించాడు. పాత కంటెస్టెంట్స్ ఓజీ క్లాన్ కాగా... కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్ రాయల్ క్లాన్.

Bigg boss telugu 8

ఇక సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఓజీ క్లాన్ సభ్యులను రాయల్ క్లాన్ సభ్యులు నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. ప్రతి కంటెస్టెంట్ తగు కారణాలు చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాలి. నామినేట్ చేసిన కంటెస్టెంట్ మెడలో నామినేటెడ్ అని రాసి ఉన్న బోర్డు వేయాలి. 

మెజారిటీ ఇంటి సభ్యులు యష్మి, విష్ణుప్రియలను నామినేట్ చేయడం విశేషం. రోహిణి... యష్మి, విష్ణుప్రియలను నామినేట్ చేసింది. అలాగే గంగవ్వ.. విష్ణుప్రియను నామినేట్ చేసింది. నీ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి. కానీ సైలెంట్ గా కూర్చుంటున్నావ్. గేమ్ ఆడటం లేదని.. విష్ణుప్రియపై గంగవ్వ ఆరోపణలు చేసింది. 
 


Bigg boss telugu 8

నువ్వు హౌస్లోకి చిల్ కావడానికి వచ్చావా... నువ్వు గేమ్ ఆడుతున్నట్లు నాకేమీ కనిపించడం లేదని పృథ్విరాజ్ ని అవినాష్  అన్నాడు. నాగ మణికంఠను నామినేట్ చేస్తే నువ్వెందుకు సెలబ్రేట్ చేసుకున్నావని... యష్మిని అవినాష్ ప్రశ్నించాడు. నువ్వు ఆ విధంగా ప్రవర్తించడం నచ్చలేదని అవినాష్, అసహనం వ్యక్తం చేశాడు. 

నామినేషన్స్ లో యష్మి, విష్ణుప్రియ, పృథ్విరాజ్... రాయల్ క్లాన్ కి టార్గెట్ అయ్యారు. విష్ణుప్రియ, యష్మిలను అయితే ప్రశ్నలతో బాగా ఎన్కౌంటర్ చేశారు. ఈ వైల్డ్ కార్డ్స్ గేమ్ అంత ఈజీ కాదని వాళ్లకు ఇప్పటికే అర్థమైంది. ఐదు వారాల గేమ్ చూసి వచ్చారు కాబట్టి.. నామినేషన్స్ లో రాయల్ క్లాన్ చెప్పిన పాయింట్స్.. ప్రేక్షకుల అభిప్రాయం కావచ్చని, ప్రేరణ సందేహం వ్యక్తం చేసింది. 

Bigg boss telugu 8

నామినేషన్ ప్రక్రియ మంగళవారం ముగియనుంది. ఓజీ క్లాన్ నుండి విష్ణుప్రియ, యష్మి, పృథ్విరాజ్, సీత నామినెట్ అయ్యారని సమాచారం. అదే సమయంలో జీ క్లాన్ సభ్యులు ఓ నిర్ణయానికి వచ్చి రాయల్ క్లాన్ లోని ఇద్దరు సభ్యులను నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించారు. రాయల్ క్లాన్ సభ్యులు.. మెహబూబ్, గంగవ్వలను నామినేట్ చేశారు. 

మొత్తంగా విష్ణుప్రియ, యష్మి, పృథ్వి, సీత, మెహబూబ్, సీత ఆరవ వారానికి నామినేషన్స్ లో నిలిచారు. వీరిలో ఒకరు వచ్చే వారం ఎలిమినేట్ కానున్నారు. గంగవ్వ కారణంగా ఇతరుల గేమ్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. ఆమెకు ప్రేక్షకుల్లో సింపతీ ఉంటుంది. అందుకే గేమ్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఓట్లు వేస్తారు. ఈ కారణంగా గంగవ్వను ఎలిమినేట్ చేయవచ్చని ఒక వాదన. 

Bigg boss telugu 8

లేదంటే ఈ వారం సీత ఎలిమినేట్ అవుతుందని మరో వాదన నడుస్తుంది. నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఆమెకు ఫేమ్ తక్కువ. గేమ్ పరంగా కూడా వెనకబడింది. కాబట్టి సీత ఎలిమినేట్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  పోతుంది. 15 వారాలకు ప్రైజ్ మనీ రూ. 50 లక్షలకు ఎక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుందా? అనేది చూడాలి.. 

Bigg boss telugu 8

ఇక గత ఐదు వారాల్లో ఐదుగురు బిగ్ బాస్ హౌస్ ని వీడారు. సోషల్ మీడియా స్టార్ బేబక్క ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యింది. అనంతరం శేఖర్ బాషా ఇంటిని వీడాడు. శేఖర్ బాషా రెండు వారాల్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అవతరించాడు. అతడు ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతాడని ఎవరూ ఊహించలేదు. ఇక మూడో వారం అభయ్ నవీన్, నాలుగో వారం సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యారు. 

ఐదవ వారం డబుల్ ఎలిమినేషన్ చోటు చేసుకుంది. మిడ్ వీక్ లో ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యాడు. అనంతరం నైనిక ఇంటిని వీడింది. ఈసారి ప్రైజ్ మనీ సైతం అన్ లిమిటెడ్. కంటెస్టెంట్స్ పెర్ఫార్మన్స్ ఆధారంగా అది పెరుగుతూ

Latest Videos

click me!