ఏమీ అనుకోవద్దు, ఎన్టీఆర్ సినిమా నాకు అసలు నచ్చలేదు : తేల్చి చెప్పిన ప్రభాస్

First Published | Oct 8, 2024, 2:36 PM IST

ఎన్టీఆర్, ప్రభాస్ మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంది. రెబల్ స్టార్, పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ రాజాసాబ్, ఫౌజి చిత్రాలతో బిజీగా ఉన్నారు. 

ntr, prabhas, student no1, rajamouli


సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు ఎన్టీఆర్.  రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఏకంగా గ్లోబల్ స్థాయి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేసిన  దేవరా సినిమా సూపర్ హిట్ అవటంతో ..ఆ సక్సెస్ ని ఎంజాయ్  చేస్తున్నారు.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.

ఈ సినిమా సెప్టెంబర్ 27న చాలా గ్రాండ్ గా విడుదల అయిన ఈ చిత్రం రికార్డ్ ల బ్రద్దలు కొడుతూ దూసుకుపోతోంది. అదే సమయంలో ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం రెట్టింపు అయ్యింది. అదే సమయంలో ఎన్టీఆర్ సినిమాలు అందరికీ నచ్చుతాయా అంటే కొందరికి నచ్చచ్చు..కొందరికీ నచ్చకపోవచ్చు. ప్రభాస్ కు ఓ సినిమా నచ్చలేదట. ఆ విషయం స్టేజీపైనే చెప్పి షాక్ ఇచ్చారు.

ntr, prabhas, student no1, rajamouli

ఇక ఇప్పుడు ఎన్టీఆర్, ప్రభాస్ మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంది. రెబల్ స్టార్, పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ రాజాసాబ్, ఫౌజి చిత్రాలతో బిజీగా ఉన్నారు. రాజాసాబ్ , ఫౌజీ  చిత్రాల విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరో ప్రక్క  ప్రభాస్ లేకుండానే ఫౌజీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీనితర్వాత స్పిరిట్ చిత్రం చేయాల్సి ఉంది. ఇక ఎన్టీఆర్ అయితే వార్ 2, దేవర 2 ,  ప్రశాంత్ నీల్ తో ఓ చిత్రం  చేయాల్సి ఉంది. 



ప్రభాస్  పరిశ్రమలో అందరితో ఎంతో స్నేహంగా ఉంటాడు. షూటింగ్ సమయంలో అందరికీ తన ఇంటిదగ్గర నుంచే భోజనం తీసుకువస్తాడు. ఒకరకంగా అజాత శత్రువు అని చెప్పొచ్చు. అటువంటి అజాత శత్రువు అయిన ప్రభాస్.. జూనియర్ ఎన్టీఆర్ పై కామెంట్ చేసారంటే ఆశ్చర్యం వేస్తుంది.

వీరిద్దరి మధ్య మాటలు లేవు అనే డిస్కషన్ సైతం ఇండస్ట్రీలో జరుగుతోంది. అయితే ఇద్దరూ క్లోజ్ ప్రెండ్స్ అనేది చాలా కొద్దిమందికే తెలిసిన విషయం. ప్రభాస్ ఇచ్చే పార్టీలు అన్నిటికీ ఎన్టీఆర్ హాజరు అవుతారు. 
 

Tollywood Top Stars


 పాన్ ఇండియా సినిమాలు చేస్తూ, పాన్ ఇండియా హీరోలుగా ఉన్న ఈ ఇద్దరికీ ఓ దర్శకుడి వల్ల విభేదాలు తలెత్తటం అనేది అబద్దమే అయినా సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజిలో రచ్చ జరుగుతోంది. దేవర సైతం ప్రభాస్ చూసి  పర్శనల్ గా కంగ్రాట్స్ చెప్పారని చెప్తారు. అవన్ని ప్రక్కన పెడితే ఎన్టీఆర్ సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ ఆయనకు నచ్చలేదట. ఆ విషయం స్టేజీపై ప్రభాస్ స్వయంగా చెప్పారు.


ప్రభాస్ మాట్లాడుతూ...నాకు స్టూడెంట్ నెంబర్ వన్ నచ్చలేదు. నిజంగా నచ్చలేదు. అది చాలా పెద్ద హిట్. నన్ను తప్పుగా అనుకోకండి. బట్ సినిమా నచ్చలేదు. అయితే కొన్ని రోజులకు వర్షం సినిమా చేస్తున్నప్పుడు ఈశ్వర్, రాఘవేంద్ర రిలీజైంది. వర్షం జరుగుతోంది అఫ్పుడే సింహాద్రి రిలీజైంది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటున్నారు.

తారక్ పిలిచాడు. రా ప్రివ్యూ చూద్దాం అని..సో ప్రివ్యూకు వెళ్లాం. సింహాద్రి చూస్తూంటే నాకు మెంటల్ ఎక్కేసింది. పిచ్చెక్కిపోయింది. స్టూడెంట్ నెంబర్ వన్ తీసిన డైరక్టరేనా ఈ సినిమా తీసింది.నేను లైఫ్ లో సినిమా చేయలేను ఆ డైరక్టర్ తో.. కానీ తర్వాత వరస సినిమాలు చేసాను అంటూ  ప్రభాస్ తన మనస్సులో మాట చెప్పేసారు. అయితే ఎన్టీఆర్ దాన్ని నవ్వుతూ తీసుకున్నారు. అంతేకదా ఒక్కో సినిమా ఒక్కొక్కరికి నచ్చుతుంది. సింహాద్రి ఎమోషన్ వేరు, స్టూడెంట్ నెంబర్ వన్ ఎమోషన్ వేరు అనేది నిజం. 

Latest Videos

click me!