Chiranjeevi: చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ బాక్సాఫీస్ వద్ద దద్దరిల్లే విజయం అందుకుంది. ఈ సినిమాపై తాజాగా సీనియర్ రచయిత ఒకరు రివ్యూ ఇచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు చిత్రం సంక్రాంతికి విడుదలైన రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద చిరంజీవి మరోసారి విజృంభించారు. ప్రస్తుతం ఈ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సీనియర్ రచయిత పరుచూరి గోపాల కృష్ణ తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు.
25
పరుచూరి గోపాల కృష్ణ రివ్యూ
పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ.. ఇది మొదటి నుంచి కామెడీ సినిమా అని చెబుతూ వచ్చారు. సినిమాలో మొదటి పది నిమిషాల వరకు ఇది కామెడీ సినిమానే అనే అనుమానం కలిగింది. చిరంజీవిని పెట్టుకుని ఇలాంటి సినిమా చేస్తున్నారు ఏంటి అని కొందరు ఆశ్చర్యపోయి ఉండొచ్చు.
35
ఇది కామెడీ సినిమా కాదు
ఫుల్ లెన్త్ కామెడీ సినిమాలు రాజేంద్ర ప్రసాద్, నరేష్ లాంటి వాళ్ళు చేశారు. కానీ చిరంజీవి ఇమేజ్ కి అలాంటి సినిమాలు చేయడం సాహసమే. కానీ మొదటి పది నిమిషాల తర్వాత అసలైన చిరంజీవి బయటకు వచ్చాడు. అప్పుడు అర్ధమైంది ఇది కామెడీ సినిమా కాదు అని. నా దృష్టిలో ఇది ఎంటర్టైనింగ్ అండ్ యాక్షన్ మూవీ అని పరుచూరి అన్నారు.
ఈ సినిమా 400 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది అంటే ఓటీటీలో, టీవీలో వచ్చే వరకు ఎదురుచూడకుండా ప్రేక్షకులంతా థియేటర్స్ కి వెళ్లి సినిమా చూసి ఉండాలి. అందుకే ఈ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి అని పరుచూరి తెలిపారు. భార్య భర్తలు విడిపోయిన కథ అంటే ఆడియన్స్ కి ముందే తెలుసు.. వాళ్లిద్దరూ మళ్ళీ కలుస్తారు. ఆ కలిసే విధానాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి చాలా బాగా ప్రజెంట్ చేశారు.
55
చిరంజీవి ఎనెర్జీ
చివర్లో వెంకటేష్ పాత్రని చాలా బాగా ఉపయోగించుకున్నారు. మామగారి పాత్రలో సచిన్ ఖేడ్కర్ అద్భుతంగా నటించారు అని పరుచూరి ప్రశంసలు కురిపించారు. చిరంజీవి గారిలో పాత ఎనర్జీ అలాగే ఉంది. అద్భుతంగా చేశారు అని పరుచూరి అన్నారు.