Sobhan Babu: స్టార్‌ హీరోయిన్‌కి సెట్‌లోనే నో చెప్పిన శోభన్‌ బాబు.. హీరోయిన్ల విషయంలో ఇంత స్టిక్ట్ గానా?

Published : Feb 25, 2026, 06:31 PM IST

సోగ్గాడు శోభన్‌ బాబు చాలా సిస్టమాటిక్‌ లైఫ్‌కి కేరాఫ్‌. ఆయన ఏ విషయంలో అయినా టెంప్ట్ కారని చెబుతారు. అయితే ఓ సందర్భంలో స్టార్‌ హీరోయిన్‌ రిక్వెస్ట్ ని కూడా నో చెప్పారాట. 

PREV
15
మహిళా అభిమానులకు దగ్గరైన శోభన్‌ బాబు

శోభన్‌ బాబు గురించి చెప్పాల్సి వస్తే, ఆయన అందం గురించిన ప్రస్తావనే మొదటగా వస్తుంది. సోగ్గాడిగా ఆయన పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆయన్ని మించిన అందగాడు లేడని అంతా చెబుతుంటారు. అది కూడా నిజమే అని చెప్పొచ్చు. అయితే ఆయన ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యారు. ఎక్కువగా ఫ్యామిలీ కథలతో సినిమాలు చేసి మెప్పించారు. భార్యాభర్తల మధ్య రిలేషన్‌, వారి మధ్య గొడవలకు ప్రయారిటీ ఉన్న కథలతోనే సినిమాలు చేసి మహిళా అభిమానులను సొంతం చేసుకున్నారు.

25
సిస్టమాటిక్‌ లైఫ్‌కి కేరాఫ్‌ శోభన్‌ బాబు

శోభన్‌ బాబు వ్యక్తిగతంగా చాలా సిస్టమాటిక్‌ ఉన్న నటుడు. ప్రతి విషయంలో ఎంతో క్రమశిక్షణగా ఉండేవారు. ఆయన ఫుడ్‌ విషయంలో, వ్యవహారం విషయంలో, షూటింగ్‌ విషయంలో, రిలేషన్‌ విషయంలోనూ అదే క్రమశిక్షణ మెయింటేన్‌ చేసేవారు. అదే సమయంలో మహిళలు, హీరోయిన్లతో రిలేషన్‌ విషయంలోనూ ఆయన క్రమశిక్షణతో ఉండేవారని అంటుంటారు. అయితే మాజీ సీఎం, నటి జయలలితతో మాత్రం ఆయనకు సంబంధం ఉందనే వార్తలున్నాయి. ఆమెతో ఎఫైర్‌ నడిపించాడని అంటుంటారు. ఇద్దరూ పెళ్లి వరకు వెళ్లినట్టు టాక్‌.

35
స్టార్‌ హీరోయిన్‌కి నో చెప్పిన సోగ్గాడు

ఇదిలా ఉంటే ఓ హీరోయిన్‌ కి మాత్రం శోభన్‌ బాబు సెట్‌లోనే నో చెప్పాడట. తాను ఏ విషయంలోనూ టెంప్ట్ కాననే విషయాన్ని ఆయన స్పష్టం చేశారట. జానకికి ఆయన నో చెప్పారట. ఓ సారి `ఖైదీ బాబాయ్‌` అనే సినిమా షూటింగ్‌ జరుగుతుంది. ఇందులో శోభన్‌ బాబు హీరో. టికృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వాణి శ్రీ హీరోయిన్‌. షావుకారు జానకి కీలక పాత్రలో నటించింది. ఆమె బాధితురాలిగా నటించింది. ఈ చిత్రం 1974లో విడుదలై, పెద్ద హిట్‌ అయ్యింది. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో ఓ రోజు జానకి తన ఇంటి నుంచి చాలా వెరైటీస్‌ ఫుడ్‌ వండుకొని వచ్చింది.

45
జానకి రిక్వెస్ట్ కి నో చెప్పిన శోభన్‌ బాబు

సెట్‌లో చాలా మందికి తన ఇంటి ఫుడ్‌ని వడ్డించింది జానకి. ఈ క్రమంలో శోభన్‌ బాబుని కూడా తన వంటని టేస్ట్ చేయాలని కోరిందట. కానీ ఆయన మాత్రం అస్సలు తగ్గలేదు.  సెట్‌లోనే అందరి ముందు నో చెప్పారట. అప్పటికే ఫుడ్‌ విషయంలో సోగ్గాడు చాలా నియమాలను ఫాలో అవుతున్నారు. దీంతో మధ్యాహ్నం సమయంలో, షూటింగ్‌ సమయంలో అస్సలు హార్డ్ ఫుడ్‌ తీసుకోవడం లేదు. దీంతో జానకి వెంటనే నో చెప్పాడట. తాను తన ఇంటిఫుడ్‌ మాత్రమే తింటానని చెప్పారట.

55
సోగ్గాడు తినే ఫుడ్‌ ఏంటంటే?

మరి ఇంతకి ఆ రోజు సోగ్గాడు ఏం తిన్నాడటంటే.. క్యారెక్ ముక్కలు, బీట్‌రూట్‌, ఫ్రూట్‌ మిక్స్, విటమిన్స్ ఉన్న ఫ్రూట్‌ జూస్‌ని తీసుకున్నాడట. ఆ పూటకి సోగ్గాడి భోజనం అదే. అది చూసి అంతా షాక్‌ అయ్యారు. ఘుమఘుమలాడే నాన్‌ వెజ్‌ వంటకాలను కాదని, ఫ్రూట్స్ తింటూ ఉండిపోయాడట. అలా ఫుడ్‌ని కంట్రోల్‌గా తిన్నారు కాబట్టే ఆయన మంచి ఫిజిక్‌ని మెయింటేన్‌ చేయగలిగారు, సోగ్గాడిగా పాపులర్‌ అయ్యారని చెప్పొచ్చు. ఫుడ్‌ విషయంలో హీరోయిన్‌ ఆఫర్‌ చేసిన కూడా సోగ్గాడు నో చెప్పడం ఆశ్చర్యానికి గురయ్యే విషయమనే చెప్పొచ్చు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories