ఎన్టీఆర్ ని టార్గెట్ చేసేలా డైలాగ్, సెకన్ల వ్యవధిలో తొలగించిన కృష్ణ.. కానీ రాంచరణ్ మూవీలో అలా కాదు

Published : Oct 20, 2025, 08:47 PM IST

ఎన్టీఆర్ ని టార్గెట్ చేసేలా ఉన్న డైలాగ్ ని సూపర్ స్టార్ కృష్ణ క్షణాలలో తొలగించారని పరుచూరి బ్రదర్స్ అన్నారు. రాంచరణ్ మూవీ విషయంలో జరిగిన వివాదాన్ని కూడా బయటపెట్టారు. 

PREV
15
కృష్ణ, ఎన్టీఆర్ మధ్య విభేదాలు

సూపర్ స్టార్ కృష్ణ, నందమూరి తారక రామారావు మధ్య గతంలో చాలా విభేదాలు ఉండేవి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు మూవీ నుంచే ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఆ తర్వాతి కాలంలో ఎన్టీఆర్ టార్గెట్ గా కృష్ణ కొన్ని సినిమాలు చేశారు. ఎన్టీఆర్ పై సెటైర్లు వేస్తూ సన్నివేశాలు పెట్టారు. అప్పట్లో అది పెద్ద కాంట్రవర్సీ అయింది.

25
అల్లూరి సీతారామరాజు మూవీ చేయాలనుకున్న ఎన్టీఆర్

పరుచూరి గోపాల కృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కృష్ణ, ఎన్టీఆర్ వ్యవహారం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'కృష్ణ గారు చేసిన అల్లూరి సీతారామరాజు మూవీ తాను కూడా చేస్తానని ఎన్టీఆర్ నాతో అన్నారు. కృష్ణ గారి మూవీ చూడండి.. అప్పటికీ సినిమా చేయాలని మీకు అనిపిస్తే తప్పకుండా స్క్రిప్ట్ రెడీ చేస్తాం' అని పరుచూరి బ్రదర్స్ ఎన్టీఆర్ తో అన్నారు. వారి మాట ప్రకారమే ఎన్టీఆర్.. కృష్ణకి కబురు పెట్టి అల్లూరి సీతారామరాజు స్పెషల్ షో వేయించుకున్నారు. సినిమా చూశాక దీనిని ఇంతకంటే గొప్పగా ఇంకెవరూ చేయలేరు. మనం సినిమా చేయాల్సిన అవసరం లేదు అని ఎన్టీఆర్ పరుచూరి బ్రదర్స్ తో అన్నారు.

35
క్షణాల్లో డైలాగ్ తొలగించిన కృష్ణ

ఆ విధంగా ఎన్టీఆర్ తన హుందాతనాన్ని చాటుకున్నారు. ఎమ్మెస్ రెడ్డి, కృష్ణ గారి కాంబినేషన్ లో వచ్చిన ఒక చిత్రానికి మేము డైలాగులు రాశాము. మాకు తెలియకుండా ఆ మూవీలో డైరెక్టర్ ఒక డైలాగ్ పెట్టారు. ఆ డైలాగ్ వింటుంటే ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేసినట్లుగా అనిపించింది. రష్ చూసి మేము ఉలిక్కి పడ్డాం. ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా మేమెందుకు డైలాగులు రాస్తాం ? అని పరుచూరి బ్రదర్స్ అన్నారు. ఎమ్మెస్ రెడ్డి గారిని అడిగితే నాకు సంబంధం లేదు అన్నారు. వెంటనే కృష్ణ గారి వద్దకు వెళ్లి ఆ డైలాగ్ గురించి చెప్పాం. ఆయన మూవీ టీం కి ఫోన్ చేసి సెకన్ల వ్యవధిలో డైలాగ్ తొలగింపజేశారు అని పరుచూరి బ్రదర్స్ గుర్తు చేసుకున్నారు. అందుకే తాము కృష్ణ గారిని దేవుడిలా భావిస్తాం అని అన్నారు.

45
రచ్చ మూవీ కాట్రవర్షియల్ డైలాగ్

ఇలాంటి సంఘటనే మరోసారి ఎదురైంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ రచ్చ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ మాటలు అందించారు. ఈ మూవీలో రాంచరణ్ డైలాగులు ఒకటి ఉంటుంది. 'ఏదో చూసుకుని తొడ కొట్టే టైపు కాదు నేను' అనే డైలాగ్ ఉంటుంది. ఇది నందమూరి హీరోలని టార్గెట్ చేసిన డైలాగ్ అని.. పరుచూరి బ్రదర్స్ రాశారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి.

55
చిరంజీవి చెప్పినా వినలేదు

దీనిపై పరుచూరి గోపాల కృష్ణ క్లారిటీ ఇస్తూ ఆ డైలాగ్ దర్శకుడు పెట్టుకున్నది. మాకు సంబంధం లేదు. ఆ డైలాగ్ తొలగించమని చెప్పాం.. కానీ డైరెక్టర్ ఉండాల్సిందే అని అన్నారు. చిరంజీవి గారు కూడా తొలగించమని చెప్పారు. అయినా డైరెక్టర్ వినలేదు అని పరుచూరి బ్రదర్స్ పేర్కొన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories