OTT Upcoming Movies: ఓటీటీలోకి మంచు మనోజ్‌, ఆర్జీవీ చిత్రాలు.. మ్యూజిక్‌ హిట్‌ మూవీ కూడా, స్ట్రీమింగ్‌ డేట్స్

Published : Jul 09, 2025, 11:40 AM IST

మంచు మనోజ్‌ నటించిన `భైరవం` చిత్రం, అలాగే వర్మ నుంచి వచ్చిన `శారీ`, మ్యూజికల్‌గా ఆకట్టుకున్న `8 వసంతాలు` చిత్రాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. 

PREV
15
ఓటీటీలో క్రేజీ మూవీస్‌ సడెన్‌ సర్‌ప్రైజ్‌

ఓటీటీలో ఈ వారం పలు క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. అలాగే వచ్చే వారం మంచు మనోజ్‌ మూవీ కూడా రానుంది. ఇక ఈ వారంలో ఒక మ్యూజిక్‌ హిట్‌ మూవీ స్ట్రీమింగ్‌ కాబోతుండగా,

 రామ్‌ గోపాల్‌ వర్మ రూపొందించిన ఓ బోల్ట్ సినిమా కూడా ఓటీటీలోకి రాబోతుంది. ఆ సినిమాలేంటి? ఎప్పుడు స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కాబోతున్నాయనేది చూస్తే.

25
నెట్‌ ఫ్లిక్స్ లో `8 వసంతాలు`

ఈ వారం సడెన్‌ గా ఓటీటీలోకి వస్తోన్న మూవీ `8 వసంతాలు`. మూడు వారాల క్రితం రిలీజ్‌ అయిన ఈ మూవీ మ్యూజికల్‌గా ఆకట్టుకుంది. డైలాగ్స్ పరంగా ఆద్యంతం అలరించింది.

కానీ కమర్షియల్‌గా సక్సెస్‌ సాధించలేకపోయింది. ఈ సినిమా కేవలం మూడు వారాల్లోనే ఓటీటీలోకి రాబోతుంది. నెట్‌ ఫ్లిక్స్ లో ఈ నెల 11న స్ట్రీమింగ్‌ కానుంది. 

దీనికి ఫణింద్ర నార్సెట్టి దర్శకత్వం వహించగా, అనంతిక సనిల్‌కుమార్‌, హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ జూన్‌ 20న థియేటర్లలో విడుదలైంది.

35
వర్మ కంపెనీ నుంచి వచ్చిన `శారీ` ఆహాలో స్ట్రీమింగ్‌

ఇదే రోజు `ఆహా`లో రామ్‌ గోపాల్‌ వర్మ మూవీ `శారీ` స్ట్రీమింగ్‌ కానుంది. ఇది ఇప్పటికే ఇతర ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ కాగా, తాజాగా ఈ నెల 11 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతుంది. 

ఈ సినిమాకి గిరికృష్ణ కమల్‌ దర్శకత్వం వహించగా, ఇందులో సత్య యాదు, ఆరాధ్య దేవి నటించారు. రవి వర్మ నిర్మించారు.

45
మలయాళ హిట్‌ మూవీ `నరివేట్ట` సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌

వీటితోపాటు జులై 11న మలయాళంలో హిట్‌ అయిన `నరివేట్ట` మూవీ సోనీ లివ్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇందులో టొవినో థామస్‌, సూరజ్ వెంజరమూడు, చేరన్, ఆర్య సలీం, ప్రియంవద కృష్ణన్, ప్రణవ్ టియోఫిన్ వంటి వారు నటించారు. అనురాజ్‌ మనోహర్‌ దర్శకత్వం వహించారు.

55
వచ్చే వారం జీ 5లో మంచు మనోజ్‌ `భైరవం

మరోవైపు మంచు మనోజ్‌ మూవీ కూడా ఓటీటీలోకి రాబోతుంది. నారా రోహిత్‌, బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ కలిసి నటించిన `భైరవం` మూవీ వచ్చే వారం(జులై 18న) జీ 5లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్రం మే 30న థియేటర్లలో విడుదలైంది. 

దాదాపు ఏడు వారాల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో ఫర్వాలేదనిపించింది. దీన్ని కెకె రాధామోహన్‌ నిర్మించారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories