ఇదిలా ఉంటే ఇటీవల నాట్స్ వేడుకల్లో పాల్గొన్న సమంత స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వేడుకలకు రావడానికి, అమెరికా ఆడియెన్స్ ని కలవడానికి 15ఏళ్లు పట్టిందని ఎమోషనల్ అయ్యింది. యాంకర్ సుమని పట్టుకుని ఏడ్చేసింది. ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది.
ఇక ఇటీవల `శుభం` సినిమాతో నిర్మాతగా మారిన సమంత ఇప్పుడు `మా ఇంటి బంగారం`తోపాటు మరో హిందీ సినిమా చేస్తుందట. అలాగే `ది ఫ్యామిలీ మ్యాన్ 3`లో ఆమె నటిస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.
దీనికి రాజ్ నిడిమోడు, డీకే దర్శకులు కావడం విశేషం. వీరు రూపొందించిన `ది ఫ్యామిలీ మ్యాన్ 2`లో సమంత నటించింది. అప్పట్నుంచే రాజ్, సమంతలు ప్రేమలో పడ్డారని టాక్.