ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు, ఇప్పుడు ఇలా అయిపోయాడేంటి, ఈ స్టార్ హీరో ని గుర్తుపట్టారా?

Published : Jul 09, 2025, 11:04 AM IST

ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న హీరోను గుర్తు పట్టారా? ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న ఈ హ్యాండ్సమ్ హీరో ఇప్పుడు గుర్తు పట్టకుండా మారిపోయాడు. ఇంతకీ ఈ హీరో ఎవరో మీరు గుర్తు పట్టారా?

PREV
16

ఒకప్పుడు వెండితెరపై వెలుగులు వెలిగిన తారలు ఎంతో మంది ప్రస్తుతం కనిపించకుండా పోయారు. కొంత మంది ఏం చేస్తున్నారో కూడా తెలియదు. ముఖ్యంగా లేడీ ఫ్యాలోయింగ్ ఉన్న హ్యాండ్సమ్ హీరోలు కొంత మంది గుర్తు పట్టనంతగా మారిపోయారు. అమ్మాయిల మనసుల్లో కలల రాకుమారుడిలా మెరిసిన హీరోలు, ఆతరువాత ఏమాత్రం పోలిక లేకుండా కంప్లీట్ గా ఛేంజ్ అవ్వడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. అలాంటి హీరో ఫోటోనే ఇంది. ఇంతకీ ఈ హీరో ఎవరో కాదు అబ్బాస్. అబ్బాస్ ఏంటి ఇలా అయ్యాడు, అస్సలు గుర్తు పట్టకుండా పోలికలు లేకుండా ఎందుకు తయారయ్యాడు అని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇంతకీ అబ్బాస్ ఇప్పుడు ఎక్కడున్నాడు ఏంచేస్తున్నాడు?

26

అబ్బాస్.. ఒకప్పుడు ఈ హీరో క్రేజే వేరు. అవ్వడానికి తమిళ హీరో అయినా.. తెలుగులో కూడా అబ్బాస్ కు లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. మరీ ముఖ్యంగా 90s బ్యాచ్ ఆడియన్స్ కు అబ్బాస్ తెలియకుండా ఉండదు. అప్పట్లో లేడీస్ అబ్బాస్ అంటే పిచ్చిగాప్రేమించేవారు. ప్రేమదేశం లాంటిసినిమాలు చూసి అబ్బాస్ కు విపరీతంగా ప్యాన్స్ అయిపోయారు. అంతే కాదు అబ్బాస్ అప్పట్లో యూత్ లో ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న హీరో కూడా. అలాగే అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న లవర్ బాయ్ కూడా అప్పట్లో అబ్బాస్ మాత్రమే.

36

లవ్ స్టోరీస్ తో తెరకెక్కిన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు అబ్బాస్. 1996 లో రిలీజ్ అయిన ప్రేమదేశం సినిమాతో హీరోగా ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు అబ్బాస్. ఈ సినిమా తమిళ్ లో తెరకెక్కినా.. తెలుగులో కూడా భారీ విజయాన్ని సాధించింది. దాంతో ఫస్ట్ మూవీతోనే అబ్బాస్ కు విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఆ తరువాత కొంత కాలం హీరోగా వరుస సినిమాలు చేసిన అబ్బాస్.. ఆతరువాత చిన్నగా వెండితెరకు దూరం అయ్యాడు.

46

హీరోగా మంచి ఫామ్ లో ఉండగానే క్యారెక్టర్ రోల్స్, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం స్టార్ట్ చేశాడు అబ్బాస్. ఫిల్మ్ ఇండస్ట్రీలో చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల అబ్బాస్ ఇండస్ట్రీకి దూరమయ్యారు. టాప్ హీరోగా అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిన ఈ లవర్ బాయ్.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అబ్బాస్ క్రేజ్ తగ్గిపోయింది.దాంతో అబ్బాస్ నటించిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది.

56

2009లో బ్యాంక్ సినిమాలో చివరిసారిగా కనిపించిన అబ్బాస్.. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. తెలుగు, తమిళం భాషలలో మొత్తం 50కి పైగా సినిమాల్లో నటించిన ఈ హీరో అవకాశాలు తగ్గడంతో కొంత కాలం బుల్లితెరపై సందడి చేశాడు అబ్బాస్. కొన్నియాడ్స్ లో నటించాడు. ఇక ఆ తర్వాత చిన్నగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇక అప్పుడు స్టార్ట్ అయ్యాయి ఈ హీరో కష్టాలు. కొన్నాళ్లు చెన్నైలోనే ఉండి ఇబ్బందిపడ్డ ఈ హీరో.. చిన్నగా న్యూజిలాండ్ వెళ్లిపోయాడు.

66

అక్కడ కూడా ఎన్నో కష్టాలుపడి పెట్రోల్ బంక్ లో పనిచేసి, మెకానిక్ గా ఓ షెడ్ లో పనిచేయడం స్టార్ట్ చేశారు. ఇక అలానే ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఐటీ జాబ్ చేస్తున్నారు అబ్బాస్. ఈ క్రమంలో తాజాగా అబ్బాస్ న్యూలుక్ ఫోటోస్ వైరలవుతున్నాయి. అందులో అబ్బాస్ లుక్ పూర్తిగా మారిపోయాడు. సాల్ట్ పెప్పర్ లుక్ లో, గెడ్డంతో డిఫరెంట్ గా కనిపించాడు. దాంతో అబ్బాస్ త్వరలోనే రీఎంట్రీ ఇస్తున్నారా ? అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Read more Photos on
click me!

Recommended Stories