మై లైఫ్ విత్ ది వాల్టర్ బాయ్స్ సీజన్ 2(My Life with the Walter Boys Season 2) – ఆగస్టు 28, 2025
ఒక టీనేజ్ అమ్మాయి తన గార్డియన్ కుటుంబంతో కొత్త జీవితం మొదలుపెట్టే కథ. ప్రేమ, ఆశ, స్నేహం అంశాలతో ఈ సిరీస్ ఉంటుంది.
ది థర్స్ డే మర్డర్ క్లబ్ (The Thursday Murder Club) – ఆగస్టు 28, 2025
రిటైర్మెంట్ హోమ్‌లో ఉన్న స్నేహితులు హత్య కేసులను సరదాగా విచారిస్తారు. కానీ ఒక నిజమైన కేసులో ఇరుక్కుపోతారు.
టు గ్రేవ్స్ (Two Graves) – ఆగస్టు 29, 2025
ఇద్దరు బాలికలు అదృశ్యం కావడంతో సముద్రతీరంలో ఉండే ఒక పట్టణం షాక్‌కు గురవుతుంది. నిజం తెలుసుకోవడానికి ఒక వృద్ధురాలు త్యాగం చేస్తుంది.
లవ్ అన్ టాంగిల్డ్ ( Love Untangled) – ఆగస్టు 29, 2025
ఒక టీనేజ్ అమ్మాయి తన స్కూల్ హార్ట్‌త్రాబ్ దృష్టిని ఆకర్షించేందుకు తన స్టైల్ మార్చుకుంటుంది. కానీ కొత్త స్టూడెంట్ రావడంతో ఆమె జీవితం మారిపోతుంది.
కరాటే కిడ్ లెజెండ్స్ (Karate Kid Legends) – ఆగస్టు 29, 2025
లీ ఫాంగ్ అనే కుంగ్‌ఫూ ప్రొడిజీ న్యూయార్క్ సిటీలోకి వచ్చిన తర్వాత కారాటే పోటీలో పాల్గొనే ప్రయాణం మొదలవుతుంది. మిస్టర్ హాన్, డేనియల్ లారుస్సో సహాయంతో అతను కొత్త సవాళ్లను ఎదుర్కొంటాడు.