రజినీకాంత్ కొత్త సినిమా `కూలి`కి దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది దేశవ్యాప్తంగా రూ.235 కోట్లకు పైగా వసూలు చేసిందని బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా హిందీ వెర్షన్ కూడా ఓ మైలురాయిని అధిగమించింది. కేవలం తొమ్మిది రోజుల్లోనే, `కూలి` హిందీ వెర్షన్ రూ.27 కోట్లు వసూలు చేసింది. రజినీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన `రోబో` (2010) సినిమా హిందీ వెర్షన్ (రూ.23.84 కోట్లు) కలెక్షన్స్ ని అధిగమించి, రజినీ రెండో అతిపెద్ద హిట్ గా `కూలి` నిలిచింది. హిందీ మార్కెట్‌లో రజనీకి ఉన్న క్రేజ్‌ని ఇది చాటి చెబుతుంది.
DID YOU KNOW ?
`జైలర్` ఫస్ట్ ప్లేస్
రజనీకాంత్ నటించిన చిత్రాల్లో అత్యధిక వసూళ్లని రాబట్టిన మూవీగా `జైలర్` నిలిచింది. ఈ మూవీ రూ.618కోట్లు వసూలు చేసింది.
25
`కూలీ` హిందీ కలెక్షన్లు
హిందీలో మొదటి రోజు రూ.4.5 కోట్లతో ప్రారంభమైన `కూలీ`, రెండో రోజు రూ.6.25 కోట్లు, మూడో రోజు రూ.4.25 కోట్లు, నాలుగో రోజు రూ.4.75 కోట్లు వసూలు చేసింది. మొదటి వారాంతంలో రూ.19 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టింది. Sacnilk సమాచారం ప్రకారం, ఐదో రోజు రూ.1.85 కోట్లు, ఆరో రోజు రూ.2 కోట్లు, ఏడో రోజు రూ.1.3 కోట్లు, ఎనిమిదో రోజు రూ.1.12 కోట్లు వసూలు చేసింది. తొమ్మిదో రోజు కూడా కోటికిపైగానే వసూలు చేసింది. ఈ లెక్కన ఈ మూవీ ఇప్పటికే సుమారు రూ.27కోట్లు రాబట్టింది. దీంతో `రోబో` హిందీ వసూళ్లని `కూలీ` దాటేయడం విశేషం.
35
`రోబో` హిందీ కలెక్షన్లు
2018లో విడుదలైన 2.0 హిందీలో రజినీకి అతిపెద్ద హిట్. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, విలన్ గా అక్షయ్ కుమార్ నటన కారణంగా, ఈ సినిమా హిందీలో రూ.189 కోట్లకు పైగా వసూలు చేసింది. `2.0` తో పోల్చితే `కూలీ` వసూళ్లు తక్కువగా ఉన్నప్పటికీ, కేవలం ఎనిమిది రోజుల్లోనే `రోబో` లైఫ్ టైం హిందీ వసూళ్లను అధిగమించడం సినిమాకి, రజినీకి దక్కిన ఆదరణకు నిదర్శనంగా చెప్పొచ్చు.
హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ నటించిన `వార్ 2` సినిమాతో పోటీ పడి హిందీలో `కూలీ` బాగా రాణిస్తోంది. హిందీలో మంచి ఆదరణ పొందడానికి మరో కారణం బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా నటించడమే.
55
అక్కడ హిట్, ఇక్కడే లాస్
`కూలీ` సినిమా రజనీకాంత్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. దీని కంటే ముందు `2.0`, `జైలర్` సినిమాలున్నాయి. అయితే ఈ మూవీ ఓవర్సీస్‌లో ఇప్పటికీ లాభాల్లోకి వెళ్లింది. అక్కడ రూ.160కోట్లు వసూలు చేస్తే హిట్. ఇప్పటికే రూ.172కోట్లు దాటినట్టు సమాచారం. ఇక తెలుగులో రూ. 47కోట్ల షేర్ రావాలి. ఇప్పటి వరకు రూ.42కోట్లు వచ్చాయని సమాచారం. ఇంకా ఐదు కోట్లు వస్తే సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది. కాకపోతే తమిళంలోనే ఈ మూవీ పెద్ద డిజాస్టర్‌గా నిలవబోతుంది. అక్కడ రెండు వందల కోట్లు దాటాలి. కానీ ఇంకా రూ.126కోట్ల వద్దే ఉంది. తమిళంలోనే నాలభై కోట్లకుపైగా నష్టాలను తీసుకొచ్చే అవకాశం ఉంది. మిగిలిన ఏరియాల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్‌కి ఛాన్స్ ఉంది.