రికార్డు ధరకి అమ్ముడైన కాంతార చాప్టర్ 1 తెలుగు రైట్స్, 100 కోట్ల డీల్.. నిజమెంత ?

Published : Aug 24, 2025, 07:50 PM ISTUpdated : Aug 24, 2025, 08:00 PM IST

కాంతార చిత్రం మూడేళ్ళ క్రితం విడుదలై సంచలనం సృష్టించింది. త్వరలో ఈ చిత్రానికి ప్రీక్వెల్ గా వస్తున్న కాంతార చాప్టర్ 1 రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో కాంతార చాప్టర్ 1 తెలుగు ప్రీ రిలీజ్ కి సంబంధించిన వివరాలు వైరల్ అవుతున్నాయి. 

PREV
15
కాంతార మూవీ సంచలనం

మల్టీట్యాలెంటెడ్ నటుడు రిషబ్ శెట్టి నటిస్తున్న కాంతార చాప్టర్ 1 చిత్రంపై ఊహకందని క్రేజ్ నెలకొంది. కాంతార చిత్రానికి ప్రీక్వెల్ గా కాంతార 1 తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి దర్శకుడు కూడా రిషబ్ శెట్టినే. మూడేళ్ళ క్రితం విడుదలైన కాంతార చిత్రం దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టించిందో సినీ ప్రేక్షకులు చూశారు. ఆ మూవీ ఏకంగా 400 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. 

25
తక్కువ బడ్జెట్ లో తెరకెక్కి 400 కోట్ల వసూళ్లు 

 15 కోట్ల అతి తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన కాంతార చిత్రం 400 కోట్ల వసూళ్లు రాబట్టడం చూసి సినీ ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. కర్ణాటకలోని తుళు సంస్కృతి, సంప్రదాయాలని పరిచయం చేసిన రిషబ్ శెట్టి.. తన నటన, దర్శకత్వంతో ప్రేక్షకులకు మంచి థ్రిల్ అందించారు. 

35
అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్

దీనితో కాంతార చాప్టర్ 1 ఇంకెంత అద్భుతంగా ఉంటుందో అనే అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. ఈ చిత్రం అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా కాంతార చాప్టర్ 1 సంచలనాలు మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్ర తెలుగు థియేట్రికల్ హక్కులు ఏకంగా 100 కోట్ల ధరకి అమ్ముడైనట్లు ప్రచారం జరుగుతోంది. 

45
కాంతార చాప్టర్ 1 తెలుగు రైట్స్ కి రికార్డ్ ధర ?

ఒక కన్నడ చిత్రానికి 100 కోట్ల ధర అంటే మామూలు విషయం కాదు. తెలుగు అగ్ర హీరోల చిత్రాల బిజినెస్ కి సమానమైన ధర అనే చెప్పాలి. ఓ అగ్ర నిర్మాణ సంస్థ కాంతార చాప్టర్ 1 తెలుగు హక్కులని సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఏరియాల వారీగా కూడా బిజినెస్ లెక్కలు వినిపిస్తున్నాయి. నైజాం 40 కోట్లు, ఆంధ్ర 45 కోట్లు, సీడెడ్ 15 కోట్లకు కాంతార చాప్టర్ 1 హక్కులు అమ్ముడైనట్లు ప్రచారం జరుగుతోంది.  అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

55
ఈసారి కూడా గీతా ఆర్ట్స్ చేతికేనా ?

ఈ చిత్ర బిజినెస్ గురించి మరో రకమైన వార్తలు కూడా వస్తున్నాయి. ఇదంతా కేవలం హైప్‌ కోసం క్రియేట్‌ చేసింది మాత్రమే అని, ఇంకా డీల్‌ సెట్ కాలేదని తెలుస్తోంది.  అయితే `కాంతార` చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ గతంలో తెలుగులో రిలీజ్ చేసింది. ఇప్పుడు చాప్టర్ 1 ని కూడా అదే సంస్థ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.  కాకపోతే రైట్స్ రూపంలో కాకుండా `కాంతార చాప్టర్ 1`ని  సహజ లాభాల్లో వాటా పద్ధతిలో రిలీజ్‌ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఇందులో ఏది నిజమనేది తేలియాల్సి ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories