నాగార్జున అర్థరాత్రి బెడ్‌పై ఉన్నా సరే ఫోన్‌ చేసే ఒకే ఒక్క హీరోయిన్‌ ఎవరో తెలుసా? అమలకు తెలిసే అదంతా!

Published : Feb 28, 2025, 06:44 PM IST

నాగార్జునకు చాలా మంది హీరోయిన్లతో ఎఫైర్‌ ఉందంటుంటారు. కానీ ఓ హీరోయిన్‌ మాత్రం ఇప్పటికీ కూడా టచ్‌లో ఉంది. అర్థరాత్రి కూడా నాగ్‌కి ఫోన్‌ చేస్తుందట. ఆ విషయం అమలకి కూడా తెలుసట.   

PREV
15
నాగార్జున అర్థరాత్రి బెడ్‌పై ఉన్నా సరే ఫోన్‌ చేసే ఒకే ఒక్క హీరోయిన్‌ ఎవరో తెలుసా? అమలకు తెలిసే అదంతా!
Nagarjuna-Amala

నాగార్జున టాలీవుడ్‌లో మన్మథుడిగా రాణిస్తుంటారు. ఆయనకు ఇప్పటికీ ఆ ట్యాగ్‌ పోలేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ అదే ఫిట్‌నెస్‌, గ్లామర్‌ ని మెయింటేన్‌ చేస్తున్నారు నాగ్‌. అమ్మాయిల గ్రీకువీరుడుగా రాణిస్తుంటారు. ఈ జనరేషన్‌ అమ్మాయిలు కూడా ఆయన్ని ఇష్టపడుతుంటారు. ఆరాధిస్తుంటారు. 

25

అయితే నాగార్జున విషయంలో చాలా రూమర్స్ వచ్చాయి. చాలా మంది హీరోయిన్లతో ఎఫైర్‌ రూమర్స్ వచ్చాయి. ఒకప్పుడు ఫామ్‌లో ఉన్న హీరోయిన్ల నుంచి ఇప్పుడు స్టార్లుగా రాణిస్తున్న హీరోయిన్ల వరకు చాలా మంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి.

అయితే ఓ హీరోయిన్‌ మాత్రం నాగార్జునతో ఇప్పటికీ అదే అనుబంధం కొనసాగిస్తుందట. అర్థరాత్రి కూడా ఆ హీరోయిన్‌ ఫోన్‌ చేస్తుంది. అర్థరాత్రి నాగ్‌ బెడ్‌పై ఉన్నా సరే, అమల పక్కన ఉన్నా సరే ఆమె ఫోన్‌ వస్తుందట. మరి ఆమె ఎవరు? ఆ కథేంటో చూస్తే. 

35

నాగార్జునకి అర్థరాత్రి అయినా ఫోన్‌ చేసే ఒకే ఒక్క హీరోయిన్‌ టబు. నాగార్జున, ఆమె మధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరు కలిసి  `సిసింద్రి`, `ఆవిడ మా ఆవిడ`, `నిన్నే పెళ్లాడతా` వంటి చిత్రాల్లో కలిసి నటించారు. దీంతో వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.

అందుకే వీరిపై చాలా రూమర్స్ వచ్చాయి. అయితే నాగార్జునని టబు బాగా ఇష్టపడిందని పెళ్లికి కూడా సిద్ధమయ్యారని సమాచారం. కానీ అమల ఫైర్‌ కావడంతో వెనక్కి తగ్గాడని, కానీ నాగ్‌పై ప్రేమతో ఆమె పెళ్లి చేసుకోకుండానే సింగిల్‌ గా ఉండిపోయిందని అంటుంటారు.

45

అయితే తమ మధ్య మంచి స్నేహం ఉందని నాగార్జున చెబుతారు. ఆ స్నేహం ఎలాంటిది అంటే ఆమె ఎప్పుడు హైదరాబాద్‌కి వచ్చినా తన ఇంటికే వస్తుందట. అంతేకాదు, తన ఇంటికి ఎదురుగానే ఇళ్లు కూడా కొనుక్కుందట.

టబుకి మూడ్‌ ఆఫ్‌ అయినా, ఏదైనా బాధ కలిగినా అర్థరాత్రి అయినా సరే తన పర్సనల్‌ నెంబర్‌కి ఫోన్‌ చేస్తుందని, అమల పక్కన ఉన్నా సరే ఆమె ఫోన్‌ లిఫ్ట్ చేస్తానని, టబు విషయం అమలకి తెలుసు అని తెలిపారు నాగార్జున. ఓ పాత ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు.
 

55
Nagarjuna Akkineni

టాలీవుడ్‌ మన్మథుడు, కింగ్‌ నాగార్జున టాలీవుడ్‌లో అగ్ర నటుడిగా రాణిస్తున్నారు. సోలో హీరోగా మూవీస్‌ చేస్తూనే వచ్చే ఆఫర్లని బట్టి, సందర్భాన్ని బట్టి ఆయన మల్టీస్టారర్స్ కూడా చేస్తుంటారు.

ప్రారంభం నుంచి ఆయన ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు రజనీకాంత్‌తో `కూలీ`లో, ధనుష్‌తో `కుబేరా` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా సోలో హీరోగా మరే సినిమాని ఆయన ప్రకటించలేదు. 

read  more: శోభన్‌బాబు అభిమానించే హీరో ఎవరో తెలుసా? దేవుడిలాంటి భావన.. రెబల్‌స్టార్‌ చెప్పిన మతిపోయే నిజాలు

also read: కృతి సనన్ కొత్త ఇంటి అద్దె తెలిస్తే షాక్ అవుతారు.. అయ్యో ఎంత పేదరాలు !

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories