యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని నమ్ముకుని నిర్మాతలు వేల కోట్ల బిజినెస్ కి రెడీ అవుతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని స్టార్ హీరో. బాహుబలి, కల్కి లాంటి చిత్రాలు ప్రభాస్ సత్తా ఏంటో చూపించాయి. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజి, రాజా సాబ్ చిత్రాల్లో నటిస్తున్నారు. స్పిరిట్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.