శివాని రాజశేఖర్ ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేయడంతో ఆ లక్కీ ఛాన్స్ కృతి శెట్టి కొట్టేసింది. ఉప్పెనతో హీరోయిన్‌గా పరిచయం అయిన కృతి ఒక్కసారిగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా నిలిచింది. తొలి సినిమానే బ్లాక్‌బస్టర్ కావడం, అలాగే సినిమా రూ. 100 కోట్ల మార్క్ దాటడంతో ఆమె ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ మారిపోయింది. మరోవైపు శివాని మాత్రం ఉప్పెన లాంటి భారీ సినిమా వదులుకోవడం వల్ల కెరీర్‌లో భారీ సక్సెస్ ను కోల్పోయింది. ఇప్పటివరకు ఆమె ‘అద్భుతం’, ‘విద్య వాసుల అహం’, ‘కోట బొమ్మాళి పీఎస్’ వంటి చిత్రాల్లో నటించి, మెప్పించింది. కానీ, ఆ సినిమాతో అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. ఉప్పెన అలాంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ ఆమె కెరీర్ లో లేవు అనే చెప్పాలి.