ఊహించని ఎలిమినేషన్.. అతడు ఇంటికి.. ఆమె జైలుకి..

Published : Sep 21, 2025, 11:53 PM IST

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రెండో వారం ఎలిమినేషన్ ఉత్కంఠభరితంగా సాగింది.ఎవరూ ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ కాగా, మరో కంటెస్టెంట్ బిగ్ బాస్ లాకప్ లోకి అడుగుపెట్టింది. ఇంతకీ ఆ కంటెస్టెంట్స్ ఎవరు? కింగ్ నాగార్జున్ ఎపిసోడ్ హైలెట్స్ ఏంటీ?

PREV
18
అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ మెంట్

బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రసవత్తరంగా సాగుతోంది. ఊహించని ట్విస్టులు, సర్ప్రైజింగ్ గేమ్స్, అంతకుమించి కాంట్రవర్సీలు ఇలా అన్ని కలగలుపుతూ బిగ్ బాస్ లవర్స్ కి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు. ఈ సారి శనివారం షో ఎపిసోడ్ హైలెట్ అనే చెప్పాలి. కింగ్ నాగార్జున తన హోస్టింగ్ తో బిగ్ బాస్ రేటింగ్ ను అమాంతం పెచ్చేశారు. కంటెస్టెంట్ల తప్పులను ఎత్తిచూపుతో ఇచ్చిపడేసాడు. ఎక్స్ట్రా చేసే కంటెంట్ల తోకలను కత్తిరిచ్చేశాడు. దీంతో బిగ్ బాస్ షో మరింత ఆసక్తికరంగా మారింది. వీకెండ్ షో కు కావలసిన స్టాప్ ఇచ్చేశాడు. ఇక ఆదివారం ఎపిసోడ్ కూడా అదే జోష్ తో కొనసాగింది. ఆదివారం ఎలిమినేషన్ డే కావడంతో కంటెస్టెంట్ లో ఎక్సైట్మెంట్ ను అలాగే కొనసాగిస్తూ షోను కంటిన్యూ చేశారు. ఈ తరుణంలో ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వగా, మరో కంటెస్టెంట్ బిగ్ బాస్ లాకప్ లోకి వెళ్ళింది. వీకెండ్ కింగ్ నాగార్జున ఎపిసోడ్ విశేషాలు ఏంటో ఓ లూక్కేయండి. 

28
తనుజ లవ్ సీక్రెట్ రివీల్

మోస్ట్ బ్యూటిఫుల్ కంటెస్టెంట్ ఎవరంటే ముందుగా గుర్తుకొచ్చేది తనుజ. ఆమె బిగ్ బాస్ షో కే స్పెషల్ ఆపీరియన్స్ అని చెప్పవచ్చు. అయితే తనుజకు కాఫీ అంటే చాలా ఇష్టం. తనకు కాఫీ కావాలని కింగ్ నాగార్జున ను రిక్వెస్ట్ చేయగా.. లవ్ స్టోరీ చెప్తే కాఫీ పౌడర్ ఇప్పిస్తానని మాట ఇస్తాడు. దీంతో చేసేది ఏమీ లేక తనుజ తన ఫస్ట్ అండ్ సీక్రెట్ లవ్ స్టోరీని బయట పెట్టేస్తుంది. తన ఫస్ట్ క్రష్ కోసం బెంగళూరు నుండి హైదరాబాద్ కు వచ్చానని, తనని ఓ కాఫీ షాపులో కలిశానని చెప్పింది. ఇప్పటివరకు ఈ విషయం ఎవరికీ తెలియదని, తొలిసారి విషయాన్ని బయటపెడుతున్నానని కాస్త ఎమోషన్ అయింది. దీంతో ఇంప్రెస్ అయినా బిగ్ బాస్ అండ్ కింగ్ నాగార్జున ఆమెకు కాఫీని ఆఫర్ చేశారు.

38
తొలి రౌండ్ లోనే భరణి, హరీష్ సేఫ్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రెండో వారం నామినేషన్ లో సుమన్ శెట్టి, ఫ్లోరా షైనీ, మర్యాద మనీష్, హరిత హరీష్, భరణి, డిమాన్ పవన్, ప్రియా శెట్టి ఇలా మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. వారిలో తొలి ట్కాస్ లో ఊహించని విధంగా భరణి, మాస్క్ మాన్ హరిత హరీష్ సేఫ్ అయ్యారు. ఈ సమయంలో ఎమోషనల్ అయినా మాస్క్ మెన్ తన గేమ్ చూపిస్తానంటూ సవాల్ విసిరాడు.

48
కెప్టెన్సీ టాస్క్ లో హోరా హోరీ పోరు

ఇక కెప్టెన్సీ టాస్క్ మరోసారి నిర్వహించారు. ఈ టాస్క్ లో డిమాన్ పవన్, భరణి, మర్యాద మనీష్, ఇమ్మాన్యుయేల్ పోటీపడ్డారు. ఫస్ట్ రౌండ్ లోనే భరణి, మర్యాద మనీష్ ఎలిమినేట్ కాగా, రెండో రౌండ్లో ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్ ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఈ పోరులో ఇమ్మాన్యుయేల్ ఏమాత్రం తగ్గకుండా పవన్ కు గట్టి పోటీ ఇచ్చాడు. తన సాశక్తుల చివరి వరకు పోరాడి ఓడిపోయాడు ఇమ్ము. ఈ గేమ్ లో డిమాన్ పవన్ గెలవడంతో కెప్టెన్సీ బాధ్యతలను తిరిగి చేపట్టాడు. ఈ సమయంలో కింగ్ నాగార్జున మాట్లాడుతూ ఇమ్మాన్యుయేల్ పోరాటపటమను మెచ్చుకున్నాడు. అలాగే మన గెలుపు ఎవరు ప్రశ్నించే విధంగా ఉండకూడదని, అందరికీ స్ఫూర్తి నిచ్చేదిగా ఉండాలని కంటెస్టెంట్లకు సూచించారు.

58
ఉత్కంఠగా ఎలిమినేషన్

తర్వాత నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఈ ప్రక్రియలో సుమన్ శెట్టి సేఫ్ కాగా, ఫ్లోరా షైనీ, ప్రియా శెట్టి, డిమాండ్ పవన్, మనీష్ లు అలాగే ఎమినేషన్ లో కొనసాగారు. ఆ వెను వెంటనే కింగ్ నాగార్జున్ మరో ఎలిమినేషన్ టాస్క్ పెట్టి డిమాన్ పవన్ సేప్ చేశారు. దీంతో ఫ్లోరా, ప్రియా, మనీష్ డేంజర్ జోన్లో ఉన్నట్లు అందరికీ అర్థమయిపోయింది. ఈ సమయంలో మరో ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టారు. రంగు డబ్బల గేమ్ పెట్టారు. ముందుగా ఫ్లోరా కలర్ బాక్స్ లో చేయి పెట్టి తీయగా తన హ్యాండ్ కు రెడ్ కలర్ అట్టింది. దీంతో ఆమె డేంజర్ జోన్ లో కొనసాగుతున్నట్టు ప్రకటించారు నాగార్జున. ఆ తర్వాత ప్రియా శెట్టి, మర్యాద మనీష్ లను ఒకేసారి బాక్స్ లో చేతిపెట్టి తీయమన్నారు. తాను చెప్పే వరకు చేతును బయటకు తీయకూడదని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో హౌస్ లో మరింత టెన్షన్ మొదలైంది. నాగార్జున చెప్పిన తర్వాత వారిద్దరూ చేతి బయటికి ప్రియా శెట్టి హ్యాండ్ కి గ్రీన్ కలర్ ఉండడంతో ఆమె సేఫ్ అని కింగ్ నాగ్ ప్రకటించారు.

68
ఊహించని విధంగా మనీష్ ఎలిమినేట్

ఇక ఫైనల్ గా మర్యాద మనీష్, ఫ్లోరా శెట్టి కన్వెన్షన్ రూమ్ లోకి వెళ్లాల్సి వచ్చింది. బయట ప్రేక్షకులు కాదు తోటి కంటెస్టెంట్లు కూడా ఫ్లోరా షైనీ ఎలిమినేట్ అవుతుందని భావించారు. కానీ, కన్వెన్షన్ రూంలో ఊహించడానికి భిన్నంగా జరిగింది. మర్యాద మనీష్ ఎలిమినేట్ కాగా, ఫ్లోరా బిగ్బాస్ హౌస్ లోకి తిరిగి వచ్చింది. కంటెస్టెంట్లు ఎవరు కూడా మర్యాద మనిషి ఎలిమినేట్ అవుతాడని ఊహించలేదు. బిగ్ బాస్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ నిర్ణయంతో కంటెస్టెంట్ లందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. కొంతమంది కంటెస్టెంట్లకు అసలేం జరిగిందో కూడా అర్థం కాకుండా మైండ్ బ్లాక్ అయిపోయింది.

78
మర్యాద మనీష్ రేటింగ్

ఎలిమినేట్ అయిన తర్వాత మర్యాద మనీష్ బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చారు. ఈ సమయంలో తన బిగ్బాస్ జర్నీ ని చూస్తూ ఎమోషనల్ అయ్యారు. తాను ఎలిమినేట్ అవుతానని అసలు ఊహించలేదని, బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు తాను వారియర్ గా గేమ్ ఆడాలని గర్వంగా చెప్పారు. ఈ సమయంలో కింగ్ నాగార్జున ఓ ఫిట్టింగ్ పెట్టారు. హౌస్ నుంచి వెళ్లే ముందు కంటెస్టెంట్లపై అభిప్రాయాన్ని తెలియజేయమంటూ.. టాప్ కంటెస్టెంట్లు ఎవరు? బాటమ్ కంటెస్టెంట్లు ఎవరో చెప్పమన్నారు.

మొదట బాటమ్ కంటెస్టెంట్ల లిస్టులో శ్రీజా దమ్ము, ఫ్లోరా షైనీ, సుమన్ శెట్టి ఫోటోలను పెట్టారు. ఈ సమయంలో సుమన్ శెట్టి పై మనీష్ కామెంట్ చేస్తూ.. అతనికి సరైన స్టాండలేదని, ఎవరి మాటలైనా ఇట్టే నమ్మేస్తాడని, ఇకపై యూనిక్ గా ఉండడం నేర్చుకోమని సూచించాడు. ఆ తర్వాత టాప్ కంటెస్టెంట్ల లిస్టులో టాప్ 1 లో భరణి, టాప్ 2లో ఇమ్మాన్యుయేల్ కంటెస్టెంట్స్ అని చెప్పారు. ఇక టాప్ 3 లో సంజన, హరీష్ ఫోటోలను పెట్టారు.

ఈ సమయంలో సంజన గురించి చెబుతూ.. తనని మొదటి వారంలో చాలా మిస్ అండర్ స్టాండింగ్ చేసుకున్నానని, ఆమె కంటెంట్ ఇవ్వడానికి తెగ ప్రయత్నిస్తుందని చెప్పారు. ఉదయం పూట అందరితో నవ్వుతూ ఉన్న, రాత్రివేళ మాత్రం ఎవరికి తెలియకుండా ఏడుస్తుంది అంటూ సంజన సీక్రెట్ ను బయట పెట్టాడు. అలాగే మాస్క్ మాన్ హరీష్ గురించి మాట్లాడుతూ.. తనని కోపం తగ్గించుకోమని సూచించారు. ఫైనల్ గా ప్రియా శెట్టి పై బిగ్ బాస్ బిగ్ బాంబ్ వేస్తూ టాయిలెట్ క్లీనింగ్ చేయమంటూ తన రివెంజ్ తీర్చుకున్నాడు మర్యాద మనీష్.

88
ఫ్లోరాకు బిగ్ షాక్..

అయితే అంతకుముందు.. కింగ్ నాగార్జున ఓ ఇంట్రెస్టింగ్ గేమ్ పెట్టారు. బిగ్ బాస్ హౌస్ లో మోస్ట్ బోరింగ్ పర్సన్ ఎవరని కంటెస్టెంట్ల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి లాకప్ టాస్క్ నిర్వహించాడు. ఈ టాస్క్ లో 14 మంది కంటెస్టెంట్లు తమ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇందులో ఏకంగా 12 మంది ఫ్లోరా షైనీ మోస్ట్ బోరింగ్ పర్సన్ అంటూ ఓటు వేశారు. ఫ్లోరా షైనీ ఎలినేషన్ నుంచి బయటపడినా.. మోస్ట్ బోరింగ్ పర్సన్ అని కంటెస్టెంట్స్ సెలక్ట్ చేయడంతో బిగ్ బాస్ లాక్ అప్ లో ఉండాల్సి వస్తుంది. ఇలా ఎవరు ఊహించని విధంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ లందరికీ దిమ్మ తిరిగి పోయే ట్విస్ట్ ఇచ్చారు. అంటే బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా ఒకరి ఎలిమిటెడ్ కాగా, మరొకరు కంటెస్టెంట్ల అసమ్మతితో బిగ్ బాస్ లాకప్ లోకి వెళ్లాల్సివచ్చింది.

Read more Photos on
click me!

Recommended Stories