OG Day 2 Collections: హాలీవుడ్ మూవీ రికార్డులు బద్దలు కొట్టిన ఓజీ.. రెండో రోజు పవన్‌ సినిమాకి వచ్చిన కలెక్షన్లు

Published : Sep 27, 2025, 07:14 PM IST

OG Day 2 Collections: పవన్‌ కళ్యాణ్‌ `ఓజీ` మూవీ కలెక్షన్ల పరంగా సంచలనాలు క్రియేట్‌ చేస్తుంది. ఈ చిత్రం హాలీవుడ్‌ మూవీ రికార్డులను బద్దలు కొట్టింది. మరి రెండో రోజుల్లో ఎంత వసూలు చేసిందో తెలుసుకుందాం. 

PREV
15
`ఓజీ`తో పండగ చేసుకుంటున్న పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన `ఓజీ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమా పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. వారు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. పవన్‌ మ్యానరిజం, స్టయిల్, యాక్షన్‌ సీన్లు, అంతకు మించిన ఎలివేషన్లు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి. పవన్‌ కళ్యాణ్‌ని అభిమానులు ఎలా అయితే చూడాలనుకున్నారో, అలానే తెరపై ఆవిష్కరించారు దర్శకుడు సుజీత్‌. ఆయన టేకింగ్‌ సినిమాకి పెద్ద ప్లస్‌ అయ్యింది. దానికి తమన్‌ మ్యూజిక్‌ తోడవ్వడంతో థియేటర్లలో ఆడియెన్స్ కి పూనకాలు తెప్పిస్తోంది. పవన్‌ అభిమానులు నిజంగా పండగ చేసుకుంటున్నారు. దసరా పండుగని ముందే సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

25
`ఓజీ` రెండో రోజులు కలెక్షన్లు

`ఓజీ` మూవీ ఫస్ట్ షో నుంచే పాజిటివ్‌ టాక్‌, ఇంకా చెప్పాలంటే బ్లాక్‌ బస్టర్‌ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ డే ఈ మూవీ భారీ ఓపెనింగ్స్ ని రాబట్టుకుంది. ప్రీమియర్స్ తో కలిసి మొదటి రోజు ఏకంగా రూ.154కోట్లు వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం సత్తా చాటింది. తెలుగు స్టేట్స్ లో దుమ్ములేపింది. అలాగే ఓవర్సీస్‌లోనూ రచ్చ చేస్తోంది. ఇప్పుడు రెండో రోజు వసూళ్ల వివరాలు వచ్చాయి. అయితే సెకండ్‌ డే భారీగా పడిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ సుమారు నలభై కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఇంతటి తక్కువ వసూళ్లని ఊహించలేం. రెండు రోజుల్లో ఈ మూవీ మొత్తంగా రూ.193 కోట్లు రాబట్టగా, ఇండియాలో వంద కోట్ల(రూ.104 కోట్లు)నెట్‌ దాటింది. దీంతో ఇది తక్కువ టైమ్‌లోనే ఇండియాల వంద కోట్ల నెట్‌ కలెక్షన్లని దాటిన మూవీగా సరికొత్త రికార్డు సృష్టించిందని చెప్పొచ్చు.

35
నార్త్ అమెరికాలో `సలార్‌`, `దేవర` రికార్డులు బ్రేక్‌

ఇదిలా ఉంటే ఈ మూవీ పలు ఇతర రికార్డులను బ్రేక్‌ చేసింది. నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ ద్వారా అత్యధిక వసూళ్లని రాబట్టిన నాల్గో చిత్రంగా `ఓజీ` నిలచింది. 3.9 మిలియన్‌ డాలర్లతో ప్రభాస్‌ నటించిన `కల్కి 2898 ఏడీ` మూవీ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కలిసి నటించిన రాజమౌళి మూవీ `ఆర్‌ఆర్‌ఆర్‌` రెండో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రానికి 3.5 మిలియన్‌ డాలర్లు వచ్చాయి. మూడోస్థానంలో అల్లు అర్జున్‌ `పుష్ప 2` ఉంది. దీనికి 3.3 మిలియన్‌ డాలర్లు వచ్చాయి. ఇక 3.13 మిలియన్‌ డాలర్లతో నాల్గో స్థానంలో పవన్‌ కళ్యాణ్‌ ఓజీ నిలవడం విశేషం. అదే సమయంలో ఎన్టీఆర్‌ దేవర`(2.8), ప్రభాస్‌ `సలార్‌`(2.6) రికార్డులను ఈ చిత్రం బ్రేక్‌ చేసింది. ఫస్ట్ డే పరంగా `ఓజీ` సరికొత్త సంచలంగా నిలవడం విశేషం. ఇప్పటి వరకు పాన్‌ ఇండియా గేమ్‌లో పవన్‌ లేరు. `హరి హర వీరమల్లు`తో ప్రయత్నించినా వర్కౌట్‌ కాలేదు. `ఓజీ`తో ఎంట్రీ ఇచ్చారు. రావడం రావడంతోనే చాలా రికార్డులను బద్దలు కొట్టారు.

45
లియోనార్డో మూవీ వసూళ్లని దాటేసిన పవన్‌ `ఓజీ`

పవన్‌ `ఓజీ` మూవీ మరో రికార్డుని బ్రేక్‌ చేసింది.  తాజాగా వచ్చిన హాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ లియోనార్డో డికాప్రియో నటించిన మూవీ వసూళ్లని బ్రేక్‌ చేసింది. లియోనార్డో తాజాగా `వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌` అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 26న విడుదలైంది. గురువారం కలెక్షన్లతో ఓజీ మూవీ `3.6 మిలియన్‌ డాలర్లని వసూలు చేసింది. అదే సమయంలో వచ్చిన లియోనార్డో `వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌` చిత్రం యూఎస్‌లో కేవలం రూ.3.1 మిలియన్‌ డాలర్లనే వసూలు చేసింది. దీంతో లియోనార్డో మూవీ వసూళ్లని పవన్‌ ఓజీ బ్రేక్‌ చేయడం విశేషం. ఇది పవన్‌ ఫ్యాన్స్ గర్వపడే విషయమని చెప్పొచ్చు.

55
`ఓజీ` బిజినెస్‌, బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌

`ఓజీ` మూవీ సుమారు రూ.250కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. దీనికి రూ.190కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ జరిగింది. సినిమా బ్రేక్‌ ఈవెన్ కావాలంటే ఈజీగా రూ.380కోట్ల గ్రాస్‌ రావాలి. అంటే ఇంకా రూ.190కోట్లు వసూలు చేయాలి. ఇదే జోరు ఈ వారం కొనసాగితే అది పెద్ద సమస్య కాదు, కానీ సోమవారం నుంచి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. దసరా సెలవులు కావడం, ఇతర పెద్ద సినిమాలు లేకపోవడంతో `ఓజీ`కి కలిసి వస్తుంది. బ్రేక్ ఈవెన్‌కి ఛాన్స్ ఉంది. మరి అది సాధ్యమవుతుందా? ఓజీ సత్తా చాటుతుందా అనేది చూడాలి. ఇక పవన్‌ కళ్యాణ్‌ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటించింది. ఇమ్రాన్‌ హష్మి విలన్‌ రోల్‌ చేశారు. శ్రియా రెడ్డి, అర్జున్‌ దాస్‌, ప్రకాష్‌ రాజ్‌, శుభలేక సుధాకర్‌, తేజ్‌ సప్రూ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న గ్రాండ్‌ గా విడుదలైన విషయం తెలిసిందే. ముంబయి బేస్డ్ గ్యాంగ్‌ ప్రధానంగా రూపొందిన చిత్రమిది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories