“ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో " ఫినాలే ఎపిసోడ్‌లో, ఒక స్టార్ హీరో తన ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) గురించి మాట్లాడారు. దాదాపు 2000 కోట్ల FD లు కలిగి ఉన్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) 1987 నుంచి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ప్రతి సంవత్సరం అత్యధిక సినిమాలు చేస్తూ, దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా నిలిచారు. సినిమాకు 100 కోట్ల వరకూ అక్షయ్ వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
27
అత్యధిక పన్ను చెల్లించే నటుడు
అక్షయ్ కుమార్ అత్యధిక పారితోషికం తీసుకోవడమే కాదు. చాలా ఏళ్లుగా 'భారత్‌లో అత్యధిక పన్ను చెల్లింపుదారు' (Highest tax payer) అనే పేరు కూడా సంపాదించారు. అంతే కాదు తను డబ్బును సంపాదించడమే కాదు, సమాజసేవలో కూడా ముందు ఉంటాడు అక్షయ్. రీసెంట్ గా తాను ఇప్పటి వరకూ డబ్బును ఎలా పెంచుకున్నారో చెప్పారు.
37
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో
ఇటీవల, అక్షయ్ 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ శో' (సీజన్ 3) ఫైనల్‌లో కనిపించారు. అక్కడ అతని 35 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని సెలబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా, ఆర్థిక భద్రతకు ఎవరు ప్రేరణ ఇచ్చారో, డబ్బు ఆస్తులు ఎలా పెంచారో వివరించారు. అక్షయ్ కుమార్ ఆర్ధికంగా ఎంత స్ట్రాంగా ఉంటాడో, అంత జాగ్రత్తగా కూడా ఉంటాడు.
డబ్బు గురించి అక్షయ్ కుమార్ మాట్లాడుతూ "చాలా కాలం క్రితం జితేంద్ర గారు 100 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) చేశారని ఒక పత్రికలో చదివాను. అప్పుడు మా నాన్న దగ్గరికి పరుగెత్తుకెళ్లి, 'నాన్న, ఎవరైనా 100 కోట్ల FD చేస్తే, ఎంత వడ్డీ వస్తుంది?' అని అడిగాను."
57
100 కోట్ల FDకి 13% వడ్డీ రేటు
ఆ సమయంలో వడ్డీ రేటు 13% ఉండేది, అంటే నెలకు 1.3 కోట్లు. 'నేను అలాంటి FD చేసిన రోజు, ఆర్థికంగా సురక్షితంగా ఉంటానని అప్పుడే అనుకున్నాను. దానికోసం ఇంకా ఎక్కువ కష్టపడటం మొదలుపెట్టాను'.
67
2,000 కోట్లకు FD
కానీ ఎంత డబ్బు ఉన్నా మనిషికి తృప్తి ఉండదు. ఆ సంఖ్య నాకు పెరుగుతూనే ఉంది . 100 కోట్ల నుంచి 1,000 కోట్లకు, ఆ తర్వాత 2,000 కోట్లకు FD చేశాను. ఈ అత్యాశకు అంతం ఉండదని అక్షయ్ అన్నారు.
77
మిడిల్ క్లాస్ ఆలోచన
ఈ టైంలో కపిల్, మీరు ఇంకా మిడిల్ క్లాస్ ఆలోచనలు వదిలారా? లేదా? అని అడగ్గా, అక్షయ్ నవ్వుతూ, "ఈ రోజు కూడా, నా కొడుకు లేదా కూతురు ఫ్యాన్ లేదా లైట్ వేస్తే, నేను వెంటనే వెళ్లి ఆపేస్తాను. అది నా అలవాటు. నేను పిసినారిని కాదు, కానీ పెరిగిన విధానం అలాంటిది." అన్నారు.