ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లోనే కాదు హాలీవుడ్‌లో కూడా చాలా పాపులర్ అయ్యింది. పెళ్లై పిల్లలు ఉన్నా కాని ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. నిక్ జోనస్‌తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తోన్న ప్రియాంక చోప్రాకు మొదటిసారి ఏ వయసులో ప్రేమ పుట్టిందో మీకు తెలుసా?
ప్రియాంక చోప్రా తన 'అన్‌ఫినిష్డ్' పుస్తకంలో తన చిన్ననాటి ప్రేమకథ గురించి చెప్పింది. తను 9వ తరగతిలో ఉన్నప్పుడు, 10వ తరగతి అబ్బాయితో ప్రేమలో పడినట్లు రాసింది. ప్రియాంక ఆ అబ్బాయి అసలు పేరు చెప్పలేదు, కానీ అతన్ని బాబ్ అని పిలిచేదట.
28
స్కూల్‌లో ప్రియాంక చోప్రా ప్రేమకథ
"మా రొమాన్స్‌లో అతను నా క్లాస్ బయట నిలబడేవాడు. క్లాస్ అయ్యాక నన్ను చూసి చెయ్యి ఊపేవాడు." స్కూల్ గ్యాలరీలో ఒకరి చేయి ఒకరు పట్టుకుని నడిచేవాళ్లం అని ప్రియాంక చెప్పింది. "ఒకరోజు అతను తన బంగారు గొలుసు నా మెడలో వేసినప్పుడు, మాకు పెళ్లి అయిపోతోందనిపించింది."
38
ప్రియాంక చోప్రాపై అత్త ప్రభావం
ప్రియాంక చోప్రా చెప్పినదాని ప్రకారం, ఇదంతా తను న్యూయార్క్‌లో తన అత్త కిరణ్ ఇంట్లో ఉన్నప్పటి మాట. అక్కడ చాలా కఠినమైన నియమాలు ఉండేవి, డేటింగ్ కూడా నిషేధం. కిరణ్ తన మేనకోడలి కదలికలపై ఓ కన్నేసి ఉంచేవారు. అప్పుడు ప్రియాంక వయసు 14 ఏళ్లు. తన అత్త మంచి ఇంజనీరే కాదు, గొప్ప గూఢచారి కూడా అని ప్రియాంక చెప్పింది.
ప్రియాంక తన అత్తను మోసం చేయడానికి రకరకాల ప్లాన్లు వేసేది. బాబ్ తన సోదరితో ప్రియాంక అత్తగారింటికి ఫోన్ చేయించేవాడు. కానీ వాళ్ల అత్తకు అనుమానం వచ్చి, ఒకరోజు రెండో ల్యాండ్‌లైన్ ఎక్స్‌టెన్షన్ ఎత్తేసింది. దాంతో వాళ్ల ఫోన్ సంభాషణలు ఆగిపోయాయి. అయినా ప్రియాంక అడల్ట్ ఎడ్యుకేషన్ పేరుతో బయటకు వెళ్లడం మొదలుపెట్టింది.
58
దొరికిపోయిన ప్రియాంక చోప్రా
ఉదయం అడల్ట్ ఎడ్యుకేషన్ తర్వాత, ఆమె బాయ్‌ఫ్రెండ్ కారులో పికప్ చేసుకునేవాడు. అపార్ట్‌మెంట్ దగ్గరి బస్ స్టాప్‌లో దింపి, బస్సు దిగినట్టు నటిస్తూ ఇంటికి వెళ్లేది. కానీ వాళ్ల అత్తకు మళ్లీ అనుమానం వచ్చి, ఒకరోజు పార్కింగ్‌లో దాక్కుని చూసింది. ప్రియాంక కారు దిగగానే అత్త ఫాలో అవ్వడంతో, కారులో కలవడం కూడా ఆగిపోయింది.
68
బాయ్‌ఫ్రెండ్‌ను ఇంటికి పిలిచిన ప్రియాంక
ఒకరోజు అత్త ఇంట్లో లేనప్పుడు బాబ్‌ను ఇంటికి పిలిచింది. ఇద్దరూ సోఫాలో కూర్చుని చేతులు పట్టుకుని టీవీ చూస్తున్నారు. వాళ్ల జీవితంలో మొదటి ముద్దు పెట్టుకోబోతుండగా, కిటికీలోంచి మెట్లపైకి వస్తున్న అత్త కనిపించింది. రోజూ 4 గంటలకు వచ్చే అత్త, ఆ రోజు 2 గంటలకే రావడంతో ప్రియాంక భయపడిపోయింది.
78
బాయ్‌ఫ్రెండ్‌ను అల్మారాలో దాచి
అత్త అపార్ట్‌మెంట్ మూడో అంతస్తులో ఉంది, ఒకే ఒక డోర్ ఉంది. బాయ్‌ఫ్రెండ్‌ను బయటకు పంపలేక, అతన్ని అల్మారాలో దాచిపెట్టింది. తను చదువుకుంటున్నట్టు నటించింది. కానీ అత్త కోపంగా వచ్చి అల్మారా తెరవమంది. ప్రియాంక వణుకుతూ అల్మారా తెరవడంతో, ఆమె బండారం బయటపడింది.
88
ప్రియాంక తల్లికి ఫోన్ చేసిన అత్త
వెంటనే అత్త ఇండియాలోని ప్రియాంక తల్లి మధు చోప్రాకు ఫోన్ చేసి విషయం చెప్పింది. అప్పుడు ఇండియాలో అర్ధరాత్రి. 'ఎందుకిలా చేశావ్? దొరికిపోవాలనేనా?' అని తల్లి అడిగింది. చివరగా, కఠినమైన నియమాలతో తనను సరైన దారిలో పెట్టినందుకు కిరణ్ అత్తకు, అమితాబ్ మామకు ప్రియాంక కృతజ్ఞతలు తెలిపింది.