ఇటీవల విడుదలైన ఓ వెబ్ సిరీస్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. జెన్ జెడ్ యువతని అట్రాక్ట్ చేసేలా అడల్ట్ కంటెంట్ తో ఉన్న ఈ వెబ్ సిరీస్ గురించే నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
ఓటీటీల్లో పరభాషా సినిమాలు, వెబ్ సిరీస్ లకు మంచి ఆదరణ లభిస్తోంది. తెలుగు ఆడియన్స్ మలయాళీ, హిందీ, తమిళ భాషల్లోని సినిమాలు, వెబ్ సిరీస్ లని బాగా ఆదరిస్తున్నారు. తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ఓటీటీల్లో అందుబాటులో ఉంటున్నాయి. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన 'ఆఫ్ క్యాంపస్(Off Campus) అనే వెబ్ సిరీస్ గ్లోబల్ వైడ్ గా సంచలనంగా మారింది.
25
రికార్డ్ వ్యూస్ తో సంచలనం
ఎల్లా బ్రైట్, బెల్ మోంట్ కామేలి, మికా అబ్దల్లా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ ఎంతలా సంచలనం సృష్టిస్తోంది అంటే.. కేవలం 12 రోజుల్లోనే 36 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఇండియాలో కూడా విపరీతంగా ఈ సిరీస్ ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో యువత ఎక్కువగా ఈ సిరీస్ గురించే మాట్లాడుకుంటున్నారు.
35
జెన్ జెడ్ యువత కోసమే..
ఈ వెబ్ సిరీస్ ని జెన్ జెడ్ యువత కోసమే రూపొందించారు. ఈ వెబ్ సిరీస్ లో విపరీతంగా న్యూడిటీ, ఇంటిమేట్ సన్నివేశాలు ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ లో ఫేక్ డేటింగ్ అనే కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అయింది. ఇందులో హీరో హీరోయిన్ల పాత్రలు ఇప్పటి జెన్ జెడ్ యువతని ప్రతిబింబించేలా ఉన్నాయి.
మొదట్లో ఫేక్ డేటింగ్ ప్రారంభించడం, ఆ తర్వాత ప్రేమో కాదో అనే కన్ఫ్యూజన్ కి గురి కావడం లాంటి అంశాలు ఈ సిరీస్ లో ఉన్నాయి. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయింది. అందుకే జెన్ జెడ్ యువత ఈ వెబ్ సిరీస్ తో పిచ్చెక్కిపోతున్నారు. ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ డబ్బింగ్ తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.
55
వైరల్ అవుతున్న మికా అబ్దల్లా
అమెజాన్ ప్రైమ్ లో అత్యధికంగా వీక్షించిన వెబ్ సిరీస్ ల జాబితాలో ఇది టాప్ 3 గా నిలిచింది. ఆఫ్ క్యాంపస్ సిరీస్ ఇండియాలో ఇంతలా వైరల్ కావడానికి మరో కారణం కూడా ఉంది. ఈ సిరీస్ లో కీలక పాత్రలో నటించిన మికా అబ్దల్లా.. 90లో క్రేజీ హీరోయిన్ గా రాణించిన మహిమా చౌదరిలా ఉందంటూ అభిమానులు పోలిక పెడుతున్నారు.