Yash BGMI: సినిమాలకు బ్రేక్.. గేమింగ్ లోకి యష్ ? రాకింగ్ స్టార్ కొత్త అవతారం

Published : May 28, 2026, 11:53 AM IST

రాకింగ్ స్టార్ యష్ ఇప్పుడు ఆన్‌లైన్ గేమింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. యువత ఎక్కువగా ఆడే పాపులర్ ఆన్‌లైన్ గేమ్ BGMIతో ఆయన చేతులు కలిపారు. ఈ కొత్త నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

PREV
15
BGMIతో యష్ భాగస్వామ్యం

యష్ తన 'టాక్సిక్' సినిమా కోసం యువతను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇందులో భాగంగా, ఆయన ఇప్పుడు ఆన్‌లైన్ గేమింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. యువత ఎక్కువగా ఆడే పాపులర్ ఆన్‌లైన్ గేమ్ BGMIతో ఆయన చేతులు కలిపారు.

25
ది టాక్సిక్ వాయిస్ ప్యాక్

దేశంలోనే సుమారు 26 కోట్ల కంటే ఎక్కువ మంది ఈ BGMI గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ గేమ్ కొత్త 4.4 అప్‌డేట్‌లో భాగంగా యష్ తో ఈ భాగస్వామ్యం కుదిరింది. దీనికి 'యశ్ x BGMI: ది టాక్సిక్ వాయిస్ ప్యాక్' అని పేరు పెట్టారు.

35
టాక్సిక్ ఆయుధాలతో ఫైట్

ఈ గేమ్‌లో యష్ వాయిస్‌ను కన్నడ, హిందీ భాషల్లో వినొచ్చు. 'టాక్సిక్' సినిమాలో ఉపయోగించిన ఆయుధాలతో గేమ్‌లో ఫైట్ చేయవచ్చు. యష్ హెయిర్‌స్టైల్, డ్రెస్సింగ్, యాక్షన్ మేనరిజమ్స్‌ను కూడా ఇందులో యాడ్ చేశారు.

45
అద్భుతమైన అనుభవం

దీనిపై యష్ మాట్లాడుతూ.. 'ఈ తరం యువతకు కొత్తదనం, థ్రిల్లింగ్ కథలు నచ్చుతాయి. ఆ వైబ్ 'టాక్సిక్'లో ఉంది. నా వాయిస్, 'టాక్సిక్' ఎనర్జీ ఈ గేమ్‌లో ఉంటాయి. పెద్దల కోసం చెప్పే ఈ ఫెయిరీ టేల్ యువతకు అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుందని నమ్ముతున్నాను. జనం దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలని ఆసక్తిగా ఉంది'' అని యశ్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

55
గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో..

గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న 'టాక్సిక్' సినిమాను KVN ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఈసినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories