Suma Kanakala: కారు దిగి నడిరోడ్డు మీద పరిగెత్తిన యాంకర్ సుమ, కారణం ఏంటో తెలుసా?

Published : May 28, 2026, 10:48 AM IST

స్టార్ హీరోలు,హీరోయిన్లకు సమానంగా ఇమేజ్ ఉన్న యాంకర్ సుమ కనకాల. పెద్ద ఈవెంల్ ఏదైనా సుమ ఉండాల్సిందే. ఏళ్లుగా టెలివిజన్ రంగాన్నిఏలుతున్నఈ యాంకరమ్మ.. ఓ సారి కారు దిగి నడిరోడ్డుమీద పరిగెత్తాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో తెలుసా?

PREV
15
బుల్లితెర సంచలనం..

తెలుగు టెలివిజన్ ప్రపంచంలో సంచలనంగా మారింది యాంకర్ సుమ. దాదాపు 30 ఏళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న సుమ... 20 ఏళ్లుగా యాంకరింగ్ రంగంలో దూసుకుపోతోంది. 50 ఏళ్లు దాటినా.. అదే ఉత్సాహంతో, అదే జోష్ తో కొనసాగుతోంది సుమ. మలయాళ అమ్మాయి అయినా.. సుమ తెలుగు భాషను అద్భుతంగా మాట్లాడుతుంది. 

అంతే కాదు 5 భాషలను అనర్గళంగా మాట్లాడగలదు స్టార్ యాంకర్. మరీ ముఖ్యంగా స్పస్టమైన తెలుగు, మాట తీరు, కామెడీ టైమింగ్, ఎనర్జీటిక్ యాంకరింగ్ తో ఆడియన్స్ ను అలరిస్తూ వస్తోంది. ఇన్నేళ్ల నుంచి యాంకరింగ్ చేస్తూనే ఉన్నా, ఆమె తీరులో ఎలాంటి మార్పు లేదు. మునుపటికంటే ఎక్కువ ఉత్సాహంతో పనిచేస్తోంది సుమ కనకాల.

25
పెద్ద ఈవెంట్లలో సుమ ఉండాల్సిందే..

ఏ ఈవెంట్ అయినా.. తడబడకుండా..సమయస్పూర్తితో సక్సెస్ చేస్తుంటుంది సుమ. మధ్య మధ్యలో జోకులు వేస్తూ.. అందరిని నవ్వించడం సుమ కనకాలకు అలవాటు. టాలీవుడ్ నుంచి పెద్ద ఈవెంట్ ఏది ఉన్నా.. అక్కడ సుమ ఉండాల్సిందే. 

స్టార్ హీరోల ప్రీరిలీజ్ ఈవెంట్లు, ట్రైలర్ రిలీజ్, ఆడియో ఫంక్షన్స్, ఇండస్ట్రీకి సబంధించిన పెద్ద పెద్ద కార్యక్రమాలను ఎక్కువగా సుమనే హోస్ట్ చేస్తుంటుంది. ఏ కార్యక్రమం అయినా.. సుమ ఏమాత్రం తడబాటు లేకుంటా అద్భుతంగా సక్సెస్ చేస్తుంటుంది. ఇండస్ట్రీలో పరిచయాలు, స్టార్ హీరోలతో తన భర్తకు ఉన్న స్నేహం, అన్నింటికి మంచి సుమ టాలెంట్ ఆమెను ఇన్నాళ్లు ఈ రంగంలో రాణించడానికి ఉపయోగపడుతున్నాయి.

35
సుమ సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా?

యాంకర్ సుమ స్టార్ గా ఎదగడానికి, ఈ రేంజ్ లో సక్సెస్ అవ్వడానికి ఆమె టైమ్ సెన్స్, డెడికేషన్ కారణం. చిన్న ఈవెంట్ అయినా.. పెద్ద ఈవెంట్ అయినా... పక్కాగా ఆ టైమ్ కు అక్కడ ఉండటం సుమకు అలవాటు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సుమ మాత్రం తన టైమ్ ను పక్కాగా పాటిస్తుంది. 

కొన్ని ఛానెల్స్ లో లైవ్ షోలు చేసినప్పుడు సుమకు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. కానీ వాటిని దాటుకుని ఆమె తన కెరీర్ ను బిల్డ్ చేసుకుంటూ వచ్చింది. ఓ సారి లైవ్ షో విషయంలో ఎదురైన షాకింగ్ ఇన్సిడెంట్ గురించి సుమ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

45
యాంకర్స్ తో సుమ స్పెషల్ షో..

సుమ ప్రస్తుతం సొంత యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తోంది. బయట ప్రోగ్రామ్స్ తో పాటు.. తన ఛానెల్ కు కూడా పలు ప్రోగ్రామ్స్, ఇంటర్వ్యూలు చేసుకుంటుంది ఈ క్రమంలో రీసెంట్ గా కొంత మంది స్టార్ యాంకర్స్ తో తన ఛానల్ లో ఓ ఈవెంట్ చేసింది సుమ. సరదాగా ఓ షో చేసింది. స్రవంతి, వర్ష, గీతాభగత్.. లాంటి యాంకర్స్ సుమ ఛానెల్ లో తమ కష్టాల గురించి చెప్పుకున్నారు. ఈక్రమంలో యాంకరింగ్ రంగంలో తాన అనుభవాలను కూడా సుమ వారితో షేర్ చేసుకుంది. ఒకప్పుడు తన లైఫ్ లో జరిగిన ఓ సంఘటన గురించి గుర్తుచేసుకుంది సుమ.

55
రోడ్డు మీద కారు ఆపి.. పరిగెత్తిన సుమ..

యాంకర్స్ షోలో సుమ మాట్లాడుతూ… ''గతంలో నేను మా టీవీలో ఒక లైవ్ షో చేశాను. లైవ్ షో కావడంతో రోజు పక్కాగా ఛానల్ ఆఫీస్ కి వెళ్ళాలి. ఒకరోజు షోకి టైం అయిపోతుంది. పంజాగుట్ట దగ్గర ఫుల్ ట్రాఫిక్, కార్లన్నీ ఆగిపోయి ఉన్నాయి, ఇప్పట్లో ట్రాఫిక్ క్లియర్ అయ్యేలా కనిపించలేదు.. మరో వైపు షో టైం కూడా దగ్గరపడుతోంది. ఏం చేయాలో తెలియలేదు.. దాంతో చేసేది లేక కారు దిగి పంజాగుట్ట రోడ్ల మీద పరిగెత్తడం స్టార్ట్ చేశాను.. అలా మా టీవీ ఆఫీస్ వరకూ పరిగెత్తుకుంటూ వెళ్లాను. తీరా అక్కడికి వెళ్ళాక లిఫ్ట్ పనిచేయలేదు. దాంతో మళ్లీ నాలుగు ఫ్లోర్స్ మెట్లు స్పీడ్ గా ఎక్కేశాను. సరిగ్గా లైవ్ స్టార్ట్ అయ్యే టైమ్ కు అక్కడికి చేరకుని.. నా అంతటా నేనే రెడీ అయి లైవ్ షో టైంకి కరెక్ట్ గా ఎంటర్ అయ్యాను'' అని తాను పడ్డ కష్టం గురించి సుమ చెప్పుకొచ్చింది.

Read more Photos on
click me!

Recommended Stories