`ఓడెల 2`, `అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి` మూవీ కలెక్షన్లు.. తమన్నాకి షాకిచ్చిన విజయశాంతి

Published : Apr 20, 2025, 08:08 PM IST

సమ్మర్‌  సీజన్‌ని పెద్ద సినిమాలు మిస్‌ చేసుకుంటున్నాయి. దీంతో మిడిల్‌ రేంజ్‌ మూవీస్‌ సందడి చేస్తున్నాయి. అందులో భాగంగా ఈ వారం రెండు మీడియం రేంజ్‌ మూవీస్‌ ఆడియెన్స్ ముందుకు వచ్చాయి. తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. వాటిలో తమన్నా నటించిన `ఓడెల 2` చిత్రంతోపాటు కళ్యాణ్‌ రామ్‌, విజయశాంతి కలిసి నటించిన `అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి` మూవీస్‌ ఉన్నాయి. మరి రెండు సినిమాల ఫలితాలు ఎలా ఉన్నాయి. కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం.   

PREV
15
`ఓడెల 2`, `అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి` మూవీ కలెక్షన్లు.. తమన్నాకి షాకిచ్చిన విజయశాంతి
odela 2, arjun son of vyjayanthi

ఈ వారం తమన్నా మెయిన్‌ లీడ్‌గా చేసిన `ఓడెల 2` మంచి బజ్‌తో గురువారం విడుదలయ్యింది. దీనికి ప్రమఖ దర్శకుడు సంపత్‌ నంది కథ, స్క్రీన్‌ప్లే మాటలు అందిస్తూ, డైరెక్షన్‌ సూపర్‌విజన్‌ చేశారు. దీంతోపాటు కళ్యాణ్‌ రామ్‌, విజయశాంతి కలిసి నటించిన `అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి` మూవీ శుక్రవారం విడుదలైంది. ఈ మూవీకి ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వం వహించారు. ఈ రెండు చిత్రాల మధ్య కలెక్షన్ల పరంగా పోటీ నెలకొంది. 

25
odela 2,

తమన్నా నటించిన `ఓడెల 2` గతంలో వచ్చిన `ఓడెల రైల్వే స్టేషన్‌`కి సీక్వెల్‌. ఆ మూవీ సక్సెస్‌ కావడంతో సీక్వెల్‌ని రూపొందించారు దర్శకుడు సంపత్‌ నంది. తనే అన్నీ తానై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గురువారం విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన రాబట్టుకుంది. కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. ఈ మూవీ మూడు రోజుల్లో రూ.6.25కోట్లు వసూలు చేయడం విశేషం. 
 

35
odela 2

ఇక ఈ మూవీ సుమారు రూ.24కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. రూ.12కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ అయ్యిందని సమాచారం. అంటే సినిమా బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే సుమారు రూ.25కోట్ల కలెక్షన్లు రావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ టార్గెట్‌ రీచ్‌ కావడం కష్టమనే చెప్పాలి. కానీ దర్శకుడు సంపత్‌ నంది మాత్రం పరామత్ముడి దయ వల్ల బ్రేక్‌ ఈవెన్‌ అయ్యిందని ప్రకటించడం విశేషం. 
 

45
arjun son of vyjayanthi

మరోవైపు కళ్యాణ్‌ రామ్‌, విజయశాంతి కలిసి నటించిన `అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి` మూవీకి కలెక్షన్లు బాగానే ఉన్నాయి. శుక్రవారం విడుదలైన ఈ మూవీ రెండు రోజుల్లో 8.5కోట్లు వసూలు చేసిందని టీమ్‌ వెల్లడించింది. `ఓడెల 2`తో పోల్చితే ఇది బెటర్‌ కలెక్షన్లు అనే చెప్పాలి. కానీ ఈ మూవీ బిజినెస్‌ టార్గెట్‌ చూస్తే చాలా దూరంగానే ఉంది. 
 

55
arjun son of vyjayanthi

`అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి` మూవీ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ రూ.21కోట్లు అయ్యిందని సమాచారం. బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే ఇది సుమారు 40కోట్లకుపైగా గ్రాస్‌ కలెక్షన్లు రావాలి. ఇప్పుడున్న కలెక్షన్లని బట్టి చూస్తే సాధ్యమేనా అనేది చూడాలి. అయితే ఇటీవల సక్సెస్‌ మీట్‌లో కళ్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ, మంగళవారం, బుధవారం వరకు సినిమా బ్రేక్‌ ఈవెన్‌ అవుతుందని డిస్ట్రీబ్యూటర్లు చెప్పినట్టుగా తెలపడం గమనార్హం. 

read  more: విడాకులపై నటి ప్రగతి డేరింగ్‌ స్టేట్‌మెంట్‌.. అమ్మలా తాను మిగిలిపోకూడదని, పిల్లల కోసం అంత పని చేసిందా?

also read: Tamannaah: తమన్నా ఒంటరిగా ఉంటే ఏం చేస్తుందో తెలుసా? ఇదే తను స్టార్ట్‌ చేయబోయే బిజినెస్‌!

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories