`వార్‌ 2` థియేటర్ హక్కులు ఎంత ధర పలికిందో తెలుసా ? ఈ విషయంలో `కూలీ`కి షాకే.. ఎన్టీఆర్‌ రిక్వెస్ట్ ఏంటంటే?

Published : Aug 13, 2025, 07:57 PM IST

ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ కలిసి నటించిన `వార్‌ 2` సినిమా గురువారం విడుదల కాబోతుంది. ఈ మూవీ థియేట్రికల్‌ బిజినెస్‌ ఎంత అయ్యిందో తెలుసుకుందాం. 

PREV
15
`వార్‌ 2`పై హైప్‌ క్రియేట్‌ చేసిన ఎన్టీఆర్‌

ఎన్టీఆర్‌ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ నటించిన `వార్‌ 2` సినిమా మరికొన్ని గంటల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. తారక్‌తోపాటు హృతిక్‌ రోషన్‌ మరో హీరోగా నటించిన ఈ మూవీకి అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించారు.  యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 14న విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ క్రియేట్‌ అయ్యింది. అయితే అంతకు ముందు ఈ మూవీపై పెద్దగా బజ్‌ లేదు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తారక్‌ చెప్పిన మాటలు సినిమాపై హైప్‌ క్రియేట్‌  చేశాయి.

DID YOU KNOW ?
తారక్‌ పారితోషికం
`వార్‌ 2` చిత్రానికి గానూ ఎన్టీఆర్‌ రూ.70 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు సమాచారం.
25
`వార్‌ 2` థియేట్రికల్‌ బిజినెస్‌

కానీ థియేట్రికల్‌ బిజినెస్‌ మాత్రం గట్టిగానే జరిగింది. ఈ సినిమా థియేటర్‌ హక్కులు ఎంత ధర పలికాయి. ఏఏ భాషలో ఎన్ని కోట్లకు అమ్ముడు పోయాయనేది చూస్తే. తెలుగు స్టేట్స్ లో రూ.90కోట్లకు అమ్ముడు పోయాయి. నిర్మాత నాగవంశీ ఈ హక్కులను సొంతం చేసుకున్నారు. ఇక తెలుగు స్టేట్స్ లో ఏరియా వైజ్‌ చూస్తే, నైజాం రూ.36.50కోట్లు, సీడెడ్‌ రూ.18కోట్లు, ఆంధ్ర రూ.36 కోట్లకు అమ్ముడు పోయింది. అలాగే హిందీలో రూ.150కోట్ల ధర పలికింది. ఇండియాలోని ఇతర స్టేట్స్ అన్నీ కలిపి రూ.23కోట్లు పలికినట్టు సమాచారం. ఓవర్సీస్‌లో రూ.102 కోట్లకు అమ్ముడు పోయిందని తెలుస్తోంది. ఈ లెక్కన `వార్‌2` థియేటర్‌ హక్కులు రూ.365కోట్ల ధర పలికిందని సమాచారం.

35
`వార్‌ 2` బడ్జెట్‌, బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌

`వార్‌ 2` సినిమాకి సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‌ అయ్యింది. అందులో థియేట్రికల్‌గానే రూ.365కోట్లు వచ్చింది. ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే సుమారు రూ.700కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేయాలి. సినిమా బ్లాక్‌ బస్టర్‌ అయితే అది పెద్ద సమస్య కాదు. లేదంటే పెద్ద నష్టాలే. నిర్మాతలకు నష్టం లేదు. ఎందుకంటే థియేట్రికల్‌ రైట్స్, ఓటీటీ రూపంలో పెట్టిన బడ్జెట్‌ వచ్చేసింది. ఇంకా లాభాల్లోనే ఉంది. కానీ బయ్యర్లకే ఇబ్బంది. మరి ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

45
`కూలీ`ని మించిపోయిన `వార్‌ 2`

ఇదిలా ఉంటే `వార్‌ 2` మూవీ థియేట్రికల్‌ బిజినెస్‌ `కూలీ`ని మించి జరిగింది. రజనీకాంత్‌ నటించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.305కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ జరిగింది. తెలుగులో రూ.52కోట్లు పలికిందట. ఈ విషయంలో `వార్‌ 2`.. `కూలీ`ని మించిపోయింది. అరవై కోట్లు ఎక్కువగానే రాబట్టింది.

55
ఆడియెన్స్ కి ఎన్టీఆర్‌, హృతిక్‌ రిక్వెస్ట్

`వార్‌ 2` విషయంలో ఆడియెన్స్ కి, ఫ్యాన్స్ కి ఎన్టీఆర్‌, హృతిక్‌ రిక్వెస్ట్ చేశారు. స్పాయిలర్స్ లీక్‌ చేయోద్దని తెలిపారు. ‘`వార్ 2` సినిమాను ఎంతో ప్రేమతో, ఎంతో కష్టపడి తెరకెక్కించాం. ఎంతో ప్యాషన్‌తో చేసిన ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాటిక్ దృశ్యాన్ని ఎక్స్ పీరియెన్స్ చేయడానికి అందరూ థియేటర్లలోనే సినిమాను చూడండి. దయచేసి సినిమాలోని సీక్రెట్లు, ట్విస్ట్‌లను రివీల్ చేయకండి.. స్పాయిలర్‌లను ఆపండి.. ఇది మీడియా, ప్రేక్షకులు, అభిమానులను మేం రిక్వెస్ట్ చేస్తున్నాము’ అని అన్నారు. ‘మీరు (అభిమానులు) ‘వార్ 2’ని మొదటిసారి చూసినప్పుడు అనుభవించినంత ఆనందం, థ్రిల్, వినోదాన్ని మిగతా వారు కూడా అనుభవించాలి. స్పాయిలర్లు సీక్రెట్లు, ట్విస్టులు రివీల్ చేయడం వల్ల మిగతా వాళ్లకు ఆ అనుభూతి, అనుభవం ఉండదు. దయచేసి ‘వార్ 2’ కథను రహస్యంగా ఉంచండి` అని ఎన్టీఆర్ తెలిపారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories