రజినీకాంత్ పై హృతిక్ రోషన్ ఎమోషనల్ కామెంట్స్.. 'కూలీ X వార్ 2' రగులుతున్న వేళ ఇలా..

Published : Aug 13, 2025, 07:08 PM IST

కూలీ, వార్ 2 రెండు చిత్రాలు రిలీజ్ అవుతున్న వేళ హృతిక్ రోషన్ రజినీకాంత్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

PREV
15
కూలీ మూవీపై భారీ హైప్

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిరుద్ అందించిన సంగీతం, నటిస్తుండడం, పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లాంటి అంశాలతో ఈ మూవీపై ఒక రేంజ్ లో హైప్ ఏర్పడింది. మరికొన్ని గంటల్లో కూలీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

25
అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు 

మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 చిత్రం కూడా ఆగష్టు 14నే రిలీజ్ అవుతోంది. దీనితో ఈ రెండు చిత్రాల మధ్య బాక్సాఫీస్ వార్ జరగబోతోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే అభిమానులు ఎవరికి నచ్చిన చిత్రానికి వారు మద్దతు తెలుపుతున్నారు. ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. కూలీ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ లోనే రికార్డులు క్రియేట్ చేస్తోంది. వార్ 2 ప్రీ బుకింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. 

35
50 ఏళ్ళ కెరీర్ పూర్తి చేసుకుంటున్న రజినీ 

 ఈ రెండు చిత్రాల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి హృతిక్ రోషన్ చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 1975లో రజినీకాంత్ అపూర్వ రాగంగళ్ చిత్రంతో నటుడిగా తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టారు. ఈ చిత్రం విడుదలై ఆగష్టు 15కి 50 ఏళ్ళు పూర్తవుతుంది. అంటే రజినీకాంత్ తన 50 ఏళ్ళ సినీ కెరీర్ పూర్తి చేసుకోబోతున్నారు. 

45
హృతిక్ రోషన్ ఎమోషనల్ పోస్ట్ 

ఈ సందర్భంగా రజినీకాంత్ కి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెతుతున్నాయి. వార్ 2 హీరో హృతిక్ రోషన్ రజినీకాంత్ గురించి పోస్ట్ చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. రజినీకాంత్ తో హృతిక్ రోషన్ కి మరచిపోలేని మధురమైన జ్ఞాపకం ఒకటి ఉంది. రజినీకాంత్ భగవాన్ దాదా చిత్రంతో హృతిక్ రోషన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించారు.  హృతిక్ పోస్ట్ చేస్తూ.. నా కెరీర్ లో తొలి అడుగులు రజినీకాంత్ సార్ తోనే పడ్డాయి. నటనలో నాకు ఓనమాలు నేర్పిన గురువు ఆయన. మీరు ఇలాగే నటనతో అలరిస్తూ ఆదర్శంగా ఉండాలి. 50 ఏళ్ళ సినీ కెరీర్ పూర్తి చేసుకున్న మీకు శుభాకాంక్షలు అని తెలిపారు. 

55
లోకేష్ కనకరాజ్ కామెంట్స్ 

అదే విధంగా లోకేష్ కనకరాజ్ కూడా రజినీకాంత్ 50 ఏళ్ళ కెరీర్ పూర్తి చేసుకోవడం పై పోస్ట్ చేశారు. నా కెరీర్ లో కూలీ చిత్రం ప్రత్యేకమైన చిత్రం. ఈ అవకాశం ఇచ్చిన రజినీ సార్ కి ధన్యవాదాలు. ఈ మూవీ ఇంత అద్భుతంగా వచ్చింది అంటే అందుకు కారణం తలైవా ఇచ్చిన సపోర్ట్. ఈ చిత్రానికి సంబంధించిన తీపి జ్ఞాపకాలు మొత్తం నా మనసులో దాచుకుంటా. 50 ఏళ్ళ సినీ కెరీర్ పూర్తి చేసుకుంటున్న రజినీ సార్ కి శుభాకాంక్షలు అని లోకేష్ కనకరాజ్ పేర్కొన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories