ఎన్టీఆర్ కూడా 4 లక్షలకు మించింది లేదు, ఏకంగా రూ. 7 లక్షలతో క్రేజీ హీరో సంచలనం.. ఇండస్ట్రీకే దిమ్మతిరిగింది

Published : Aug 13, 2025, 04:50 PM IST

సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఓ చిత్రాన్ని చూసి ఇండస్ట్రీ మొత్తం నివ్వెర పోయింది. దానికి కారణం ఆ మూవీ బడ్జెట్. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 

PREV
15
అగ్ర హీరోగా ఎన్టీఆర్

అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ అగ్ర హీరోగా ఉండేవారు. ఏఎన్నార్ ఆయనకి పోటీగా కొనసాగేవారు. ఎన్టీఆర్ కి మాస్ లో విపరీతమైన క్రేజ్ ఉండేది. సూపర్ స్టార్ కృష్ణ వచ్చాక కొన్ని దశాబ్దాలు ఎన్టీఆర్ కి గట్టి పోటీ ఇచ్చారు. సూపర్ స్టార్ కృష్ణ వచ్చిన తర్వాత తెలుగు సినిమా మేకింగ్ పరుగులు పెట్టింది.

DID YOU KNOW ?
మహేష్ కౌబాయ్ గా నటించిన మూవీ
సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు టక్కరి దొంగ చిత్రంలో కౌబాయ్ గా నటించారు. అయితే ఈ చిత్రం సక్సెస్ కాలేదు. 
25
ఎన్టీఆర్ కి పోటీగా సూపర్ స్టార్ కృష్ణ 

సూపర్ స్టార్ కృష్ణ కొత్తదనం ప్రదర్శిస్తూ.. ఎన్టీఆర్ కి పోటీగా మాస్ చిత్రాలు చేశారు. తిరుగులేని స్టార్ గా ఎదిగారు. కృష్ణ హీరోగా నటించిన తొలి చిత్రం తేనె మనసులు 1965లో విడుదలైంది. తన మూడవ చిత్రం గూఢచారి 116 తో కృష్ణ క్రేజీ హీరోగా మారారు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఐదారు ఏళ్లలోనే కృష్ణ టాలీవుడ్ మైండ్ బ్లాక్ అయ్యే సాహసం చేశారు. 

35
కృష్ణ చేసిన పెద్ద సాహసం 

 ఆ సాహసం మరేదో కాదు మోసగాళ్లకు మోసగాడు. తెలుగులో ఇదే తొలి కౌబాయ్ చిత్రం. అప్పటి అగ్ర హీరోలు అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి వారి చిత్రాల బడ్జెట్ రూ 4 లక్షలు మించేది కాదు. కానీ మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని కృష్ణ తన సొంత బ్యానర్ లో ఏకంగా 7 లక్షల బడ్జెట్ లో నిర్మించారు. దీనితో ఇండస్ట్రీ మొత్తం షాక్ కి గురైంది. కృష్ణ ఇంత పెద్ద సాహసం చేస్తున్నారు ఏంటి..అని అంతా ఆశ్చర్యపోయారట. ఇప్పుడంటే వందల కోట్లల్లో సినిమాలు నిర్మిస్తున్నారు కానీ అప్పట్లో లక్షల రూపాయల బడ్జెట్ అంటే చాలా భారీగా ఉండేది. 

45
మూవీ క్వాలిటీ కోసం 

తాను అనుకున్నట్లుగా భారీ బడ్జెట్ లో మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని రూపొందించిన కృష్ణ మంచి విజయం అందుకున్నారు. తెలుగులో గొప్ప చిత్రాల్లో ఇది కూడా ఒకటిగా ఉంటుంది. ఈ చిత్ర క్వాలిటీ విషయంలో కృష్ణ కాంప్రమైజ్ కాలేదు. 

55
హాలీవుడ్ స్టైల్ మేకింగ్ 

ఈ చిత్ర చిత్రీకరణ మొత్తం అప్పట్లో హాలీవుడ్ చిత్రాల స్టైల్ లో ఉంటుంది. కెఎస్ఆర్ దాస్ ఈ చిత్రానికి దర్శకుడు. మోసగాళ్లకు మోసగాడు మూవీ రిలీజ్ అయ్యాక తెలుగులో కౌబాయ్ చిత్రాల కల్చర్ పెరిగింది. మోసగాళ్లకు మోసగాడు చిత్రంలో నాగభూషణం, విజయనిర్మల, గుమ్మడి కీలక పాత్రల్లో నటించారు. 

Read more Photos on
click me!

Recommended Stories