ఈ సినిమా టైటిల్ ను కృష్ణ ముందే రిజిస్టర్ చేయించారు. కాని తన టైటిల్ ను మార్చడానికి నిర్మాత శేఖర్ బాబు ఒప్పుకోలేదు. అటు పెద్దాయన ఎన్టీఆర్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ సామ్రాట్ టైటిల్ బాలయ్య సినిమాకే పెట్టాలని పంతం పట్టారు. సామ్రాట్ టైటిల్ తో సినిమా స్టార్ట్ చేసి.. రిలీజ్ కు కూడా రెడీ అయ్యారు. రెండు సినిమాలు సామ్రాట్ అనే టైటిల్ తో ప్రమోషన్స్ కూడా చేశారు.
కాని ఈ వివాదం ఎక్కడివరకూ వెళ్తుందో అని భయపడ్డ ఇండస్ట్రీ పెద్దలు కొంత మంది.. రెండు వైపుల సర్దిచెప్పి.. అంతకు ముందే కృష్ణ రిజిస్టేషన్ చేసుకున్నారని.. నచ్చచెప్పడంతో.. బాలయ్య సినిమాను సహస్ర సామ్రాట్ గా మార్పించారు. అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ .. సామ్రాట్ టైటిల్ తో వచ్చిన ఈరెండు సినిమాలు భారీ డిజాస్టర్ ను మూటగట్టుకున్నాయి. రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి.