పెళ్ళైన కొత్తలో మెహర్బానీ కోసం నాకు గతంలో ఉన్న ఎఫైర్స్, క్రష్ ల గురించి ఆమెతో చెప్పాను. మూడు నెలల తర్వాత దాని ప్రభావం ఏమిటో ప్రియ చూపించింది. అనవసరంగా చెప్పాను అనిపించింది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక ప్రియతో మాట్లాడాను. ఆమె ప్రేమగా పలకరించింది.. అని మణికంఠ అన్నారు.
కాగా 25 ఏళ్లకే నాగ మణికంఠ ఎన్నారై అయిన ప్రియను పెళ్లి చేసుకున్నాడట. డిపెండెంట్ వీసా మీద అమెరికా వెళ్ళాడట. మూడు నెలల్లో వీసా వస్తుంది అనుకుంటే ఏడాదిన్నర అయినా రాలేదట. దాంతో ఎలాంటి సంపాదన లేకుండా ప్రియ మీద ఆధారపడాల్సి వచ్చిందట. వీసా కారణం ఇద్దరికీ గొడవలు అవేవట. నువ్వు ఇండియా వెళ్లి, అక్కడ కెరీర్ చూసుకో అని ప్రియ చెప్పడంతో నాగ మణికంఠ తిరిగి స్వదేశం కూతురితో పాటు వచ్చేశాడట.