పవన్ కళ్యాణ్ ఒక వైపు డిప్యూటీ సీఎం గా మరో వైపు హీరోగా బిజీ బిజీగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా తన కార్యక్రమాలు చూసుకుంటూనే హరి హర వీరమల్లు చిత్ర షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, రాంచరణ్ బాబాయ్ అబ్బాయిలు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. వీళ్లిద్దరి మధ్య బాండింగ్ చాలా సందర్భాల్లో చూశాం.
అయితే రాంచరణ్ గురించి చాలా ఏళ్ళ క్రితం ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అప్పటికి రాంచరణ్ ఇంకా హీరో కాలేదు. అప్పుడే తొలి చిత్రం చిరుతకి సన్నాహకాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ రాంచరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ దర్శకత్వంలో రాంచరణ్ తొలి చిత్రం లాంచ్ అవుతోంది అని తెలిసింది.అశ్విని దత్ గారు నిర్మాత అని చెప్పారు.
ఇది వినగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది. అదే సమయంలో చరణ్ అప్పుడే హీరో అయిపోతున్నాడా అని కూడా ఆశ్చర్యపోయా. కొన్ని రోజుల క్రితమే రాంచరణ్ జీవితంలో ఒక సంఘటన జరిగింది. అదే సంఘటన ఇంకెవరి లైఫ్ లో అయినా జరిగి ఉంటే.. వాళ్ళు అక్కడి నుంచి పారిపోయేవారు. లేకుంటే బాధ్యతగా వ్యవహరించకుండా తప్పించుకునేవారు. కానీ రాంచరణ్ మాత్రం చుట్టు పక్కల ఎవరూ లేకపోయినా పారిపోకుండా తన ధర్మం తాను పాటించాడు.
రాంచరణ్ ఒక్కడే ఆ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేశాడు. అప్పుడే వాడు నా మనసులో హీరో అయిపోయాడు అని పవన్ కళ్యాణ్ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే ఆ సంఘటన ఏంటనేది మాత్రం పవన్ కళ్యాణ్ చెప్పలేదు. అయితే కొన్ని రూమర్స్ ప్రకారం 2005లో రాంచరణ్ చిన్నపాటి కారు యాక్సిడెంట్ కి కారణం అయ్యాడు వార్తలు ఉన్నాయి.
ఈ యాక్సిడెంట్ లో ఇద్దరు దంపతులు స్వల్ప గాయాలకు గురయ్యారట. ఆ దంపతుల మెడికల్ ఖర్చులు మొత్తం రాంచరణ్ చూసుకున్నాడట. తనపై కేసు నమోదైనా ఆ దంపతులకు న్యాయం చేసి బెయిల్ పై బయటకి వచ్చాడని కొన్ని రూమర్స్ ఉన్నాయి. బహుశా పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఈ సంఘటన గురించే కావచ్చు.